- Home
- Entertainment
- మినీ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సింగ్ పరువాల విందు .. స్లీవ్ లెస్ అందాలతో మతిపోగొడుతున్న ఫిట్ నెస్ బ్యూటీ..
మినీ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సింగ్ పరువాల విందు .. స్లీవ్ లెస్ అందాలతో మతిపోగొడుతున్న ఫిట్ నెస్ బ్యూటీ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ వరుస చిత్రాల్లో నటిస్తూ తన మార్క్ చూపెడుతోంది.

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) నార్త్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోతోంది. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఎక్కువ శాతం హిందీ చిత్రాల్లోనే నటించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ ఏడాది తను నటించిన రెండు భారీ చిత్రాలు విడుదలయ్యాయి. అందులో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం (John Abraham)తో కలిసి నటించిన చిత్రం ‘ఎటాక్’ ఈ చిత్రం ఏప్రిల్ 1న రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్సే వచ్చింది.
అలాగే తను నటించిన మరో మల్టీస్టారర్ చిత్రం ‘రన్ వే 34’. ఈ చిత్రంలో ఏకంగా బాలీవుడ్ సీనియర్ హీరోలు అజయ్ దేవగన్ (Ajay Devgn), బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)తో కలిసి నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ అయ్యింది.
ఈ రెండు చిత్రాలతో విభిన్న పాత్రల్లో నటించిన రకుల్ నార్త్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం Runway34 మూవీ థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినిమాను గుర్తు చేస్తూ తాజాగా లేటెస్ట్ ఫొటోషూట్ చేసింది.
ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. మినీ డ్రెస్ లో రకుల్ ప్రీత్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మిర్రర్ లో తన రూపసౌందర్యాన్ని చూసుకుంటూ మురిసిపోతోంది. ఈ పిక్స్ షేర్ చేస్తూ ‘గోడకు అద్దం! మా సినిమా. రన్‌వే 34ని ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు.’అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం మరోరెండు హిందీ చిత్రాలు ‘మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ జీ’ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు తమిళ చిత్రాల్లో నటిస్తూ ఈ సుందరి బాలీవుడ్ అడ్డాపై తన మార్క్ చూపిస్తోంది. కాగా తను సైన్ చేసిన ‘థ్యాంక్ గాడ్, 31 అక్టోబర్ లేడీస్ నైట్, ఇండియన్ 2’ చిత్రాల్లో నటిస్తోంది.