MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వణికే చలిలో చెమటలు పట్టిస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాలు.. ఆరెంజ్‌ కోటులో మెంటల్‌ ఎక్కించే పోజులు చూశారా!

వణికే చలిలో చెమటలు పట్టిస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాలు.. ఆరెంజ్‌ కోటులో మెంటల్‌ ఎక్కించే పోజులు చూశారా!

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా మంటలు పెట్టింది. ఆమె లేటెస్ట్ ఫోటోలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తూ వేడి పుట్టిస్తుంది. 
 

Aithagoni Raju | Published : Dec 01 2023, 08:16 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. తాజాగా ఆరెంజ్‌ కోటు ధరించి లేటెస్ట్ గా ఫోటో షూట్‌ చేసింది. ఇందులో ఆమె ఇచ్చిన పోజులు మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా ఉన్నాయి. ఆమెచూపులు చురకత్తుల్లా గుచ్చేస్తున్నాయి. ఆమె పొగరు మెంటల్‌ ఎక్కిస్తుంది. 

28
Asianet Image

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆరెంజ్‌ కోట్‌లో కత్తిలాగా ఉంది. చూపు తిప్పుకోనివ్వడం లేదు. దీంతో నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. వణికే చలిలో చెమటలు పట్టిస్తుందని, రకుల్‌ని ఇలా చూస్తే మెంటల్‌ ఎక్కిపోవడం ఖాయమంటున్నారు. ఇంకొందరు రెచ్చిపోతే మంట లేకుండానే వేడి పుట్టిస్తుందని కామెంట్‌ చేస్తున్నారు. 
 

38
Asianet Image

ఇక మొత్తానికి రకుల్‌ నయా ఫోటో షూట్‌తో, ముఖ్యంగా ఆమె ఆరెంజ్‌ కోట్‌లో అదిరిపోయేలా ఉంది. సూపర్‌ హాట్‌ పోజులు, చురకత్తుల్లాంటి చూపులతో మతిపోగొడుతుంది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 

48
Asianet Image

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగులో హీరోయిన్‌గా ఎదిగింది. వరుసగా విజయాలు అందుకుని స్టార్‌ స్టేటస్‌ని అందుకుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆఫర్లని అందుకుంది. దాదాపు స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది. నాగార్జున వంటి సీనియర్‌తోనూ మెప్పించింది. 
 

58
Asianet Image

అయితే వరుస పరాజయాలు ఆమె కెరీర్‌ని దెబ్బ కొట్టాయి. చివరగా రకుల్‌ నటించిన అన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. దీంతో నెమ్మదిగా ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర వేశారు. ఈ ట్యాగ్‌ ప్రారంభమవుతున్న సమయంలోనే బాలీవుడ్‌ చెక్కేసింది రకుల్ ప్రీత్‌ సింగ్‌. అక్కడ ఊహించని ఆఫర్లని అందుకుంది. 

68
Asianet Image

బాలీవుడ్‌లో వరుసగా పది సినిమాలకు సైన్‌ చేసింది. `దేదే ప్యార్‌ దే` సినిమా ఆమె కెరీర్‌ని మలుపుతిప్పింది. హిందీలో ఆఫర్ల క్యూకి కారణమైంది. దీంతో రకుల్‌ సైతం వచ్చిన ప్రతి అవకాశాన్ని నో చెప్పకుండా సైన్‌ చేసింది. ఇలా దాదాపు రెండేళ్లపాటు సినిమాలతో సందడి చేసింది. 
 

78
Asianet Image

ఏడాదికి నాలుగైదు సినిమాలతో మెరిసింది. ప్రతి రెండు నెలలకు ఒక సినిమాతో బాక్సాఫీసు వద్ద సందడి చేసింది. సందడంతా రకుల్‌ దే అనేలా ఆమె సినిమాల్లో మెరవడం విశేషం. దీంతో రకుల్‌ బాలీవుడ్‌ని ఊపేస్తుందనే కామెంట్లు వచ్చాయి. త్వరలోనే బాలీవుడ్‌ హీరోయిన్లని మించి పోతుందనే వార్తలొచ్చాయి. 
 

88
Asianet Image

కానీ ఈ బ్యూటీకి బాలీవుడ్‌లోనూ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఆఫర్లు అయితే వచ్చాయి, కానీ హిట్లు రాలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ డైలామాలో పడింది. అవకాశాలు తగ్గిపోయాయి. గతంలో ఒప్పుకున్న సినిమాలే చేస్తుంది. కొత్తగా మరే సినిమాని ప్రకటించలేదు. దీంతో రకుల్‌కి బాలీవుడ్‌లోనూ గడ్డు పరిస్థితి ఎదురవుతుందనే కామెంట్లు వస్తున్నాఇ. మరి దీన్ని రకుల్‌ ఎలా ఓవర్‌ కమ్‌ చేస్తుందో చూడాలి. అయితే అవకాశాల వేటలో అందాలను ఎరగా వేస్తుంది రకుల్‌. మరి మేకర్స్ రియాక్ట్ అవుతారా? ఆఫర్లు ఇస్తారా? అనేది చూడాలి. 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories