MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • థియేటర్లో పునీత్‌ రాజ్‌కుమార్‌ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న `ఇడియట్‌` హీరోయిన్‌.. ఎమోషనల్‌ కామెంట్‌

థియేటర్లో పునీత్‌ రాజ్‌కుమార్‌ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న `ఇడియట్‌` హీరోయిన్‌.. ఎమోషనల్‌ కామెంట్‌

Rakshita Prem: `ఇడియట్‌` హీరోయిన్‌ రక్షితా ప్రేమ్‌ థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకుంది. `అప్పు` సినిమాని చూస్తూ ఆమె ఎమోషనల్‌ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేసింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 15 2025, 09:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
appu movie, puneeth rajkumar

appu movie, puneeth rajkumar

Rakshita Prem-Appu: పునీత్ రాజ్‌కుమార్ 50వ జన్మదినం సందర్భంగా ‘అప్పు’ సినిమాను రీ రిలీజ్‌ చేశారు. అభిమానులు సినిమాను ఘనంగా స్వాగతించారు.  థియేటర్లలో సెలబ్రేట్‌ చేశారు. 

26

బెంగళూరులోని కొన్ని సెంటర్లలో తెల్లవారుజామున షోలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ హౌస్‌ఫుల్ ప్రదర్శనలు జరిగాయి. వేలాది మంది `అప్పు`(పునీత్‌ రాజ్‌కుమార్‌) అభిమానులు ఉదయాన్నే థియేటర్ల ముందు గుమిగూడి పునీత్‌కు జై కొట్టారు.  అభిమాన హీరోపై ప్రేమని చాటుకున్నారు. 

36

చాలా చోట్ల పునీత్ కటౌట్‌కు పాలతో అభిషేకం చేశారు. సినిమా ప్రదర్శన ప్రారంభంలో పునీత్ పేరు తెరపైకి రాగానే ఫ్యాన్స్ ఉర్రూతలూగి సంబరాలు చేసుకోవడం అప్పుపై వారి అభిమానానికి నిదర్శనంగా చెప్పొచ్చు. 

46

బెంగళూరులోని మెజెస్టిక్ ప్రాంతంలోని చాలా థియేటర్ల ముందు అభిమానుల జాతర జరిగింది. చాలా మంది టీవీ, సినిమా సెలబ్రిటీలు కూడా అభిమానుల సంబరాల్లో పాల్గొనడం విశేషం. ఈ సినిమా హీరోయిన్ రక్షితా ప్రేమ్ థియేటర్‌లో అభిమానుల మధ్య సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.
 

56

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె, ‘అప్పు సినిమా ఇప్పటికీ తాజాగా అనిపిస్తుంది. ఇది ఎవర్ గ్రీన్ స్టోరీ. అప్పు, సుచి మధ్య ప్రేమ కథ అద్భుతమైనది. చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. సినిమా చూస్తూ చూస్తూ, అప్పు జ్ఞాపకం తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఈరోజు మనతో ఉండాల్సింది’ అని భావోద్వేగంగా మాట్లాడారు రక్షితా ప్రేమ్‌. 

66

రాఘవేంద్ర రాజ్‌కుమార్ మాట్లాడుతూ, ‘`అప్పు` సినిమాను 23 సంవత్సరాల క్రితం నాన్న, అమ్మ, అప్పుతో కలిసి చూశాను. అది గుర్తుకు వస్తే మళ్లీ మనసుకు కష్టంగా ఉంటుంది. కానీ ఈరోజు ఈ సినిమా ప్రదర్శనలో అభిమానులు డైలాగులు చెబుతుంటే, పాటలోని ప్రతి లైన్‌ను పాడుతుంటే చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు. 

`అప్పు` తెలుగులో వచ్చిన `ఇడియట్‌`కి రీమేక్‌. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. తెలుగులో రవితేజ, రక్షితా జంటగా నటించారు. కన్నడలో పునీత్‌ రాజ్‌కుమార్‌, రక్షితా నటించారు. తెలుగులోనే కాదు, కన్నడలో కూడా ఇది సంచలన విజయం సాధించింది. 

read  more: ఎన్టీఆర్‌ నెక్ట్స్ మూవీ టైటిల్స్.. `డ్రాగన్‌` ఫిక్స్, నెల్సన్‌ మూవీకి అదిరిపోయే టైటిల్‌ ?

also read: ఆస్కార్‌ అవార్డులపై మంచు విష్ణు బోల్డ్ స్టేట్‌మెంట్‌, 200కోట్లు ఇస్తా తెప్పించండి

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Hits: ఎక్కువ హిట్లు కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. కరీనా కపూర్ కి షాకిచ్చిన దీపికా
Recommended image2
Oh My Goddess: అక్షయ్ కుమార్‌కు మరో షాక్, పెద్ద సినిమా నుంచి స్టార్ హీరోయిన్ సడెన్‌గా అవుట్!
Recommended image3
Vijay React on Divorce: భార్య సంగీతతో విడాకులు, తొలిసారి స్పందించిన విజయ్.. అభిమానులకు క్లారిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved