ప్రియుడితో రాఖీ సావంత్ వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్.. కానీ ఇంత పెద్ద ట్విస్ట్ ఏంటి, మాట మార్చాడా ?
గత ఏడాది రాఖి సావంత్ తన మొదటి భర్త నుంచి విడిపోయింది. రాఖి సావంత్ మొదటి భర్త పేరు రితేష్. రితేష్ నుంచి హింస ఎదురుకావడంతో రాఖి సావంత్ విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత ఆదిల్ దురాని అనే యువ బిజినెస్ మ్యాన్ ప్రేమలో పడింది.
రాఖీ సావంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వివాదాలే. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ ఫోజింగ్ తో శృంగారతార అనే ముద్ర వేయించుకుంది. తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం రాఖి సావంత్ కు అలవాటు. ఎలాంటి విషయం గురించి అయినా మొహమాటం లేకుండా మీడియా ముందు మాట్లేడేస్తుంది.
గత ఏడాది రాఖి సావంత్ తన మొదటి భర్త నుంచి విడిపోయింది. రాఖి సావంత్ మొదటి భర్త పేరు రితేష్. రితేష్ నుంచి హింస ఎదురుకావడంతో రాఖి సావంత్ విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత ఆదిల్ దురాని అనే యువ బిజినెస్ మ్యాన్ ప్రేమలో పడింది. గత ఏడాది వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా వీరిద్దరికీ వివాహం కూడా జరిగినట్లు తెలుస్తోంది. రాఖి సావంత్, ఆదిల్ కోర్టులో వివాహం చేసుకుని ఒక్కటైనట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గత ఏడాదే వీరిద్దరి వివాహం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న ఫొటోల్లో ఆదిల్, రాఖీ ఇద్దరూ పూలదండలతో కనిపిస్తున్నారు. తమ మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తున్నారు.
ఇద్దరూ మ్యారేజ్ సర్టిఫికెట్ లో సంతకాలు చేస్తున్న ఫోటో కూడా వైరల్ అవుతోంది. దీనితో రాఖీ సావంత్ సీక్రెట్ గా వివాహం చేసుకుందా అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఊహించని ట్విస్ట్ వైరల్ గా మారింది. తనకి, రాఖీ సావంత్ కి అసలు పెళ్లే జరగలేదని ఆదిల్ ప్లేటు మార్చేస్తున్నాడట.
ఆదిల్ ఫ్యామిలీ తనని ఇంకా యాక్సెప్ట్ చేయలేదని గతంలో రాఖీ సావంత్ పేర్కొంది. దీనితో ఆదిల్ ఫ్యామిలీ వీరిద్దరి వివాహాన్ని ఒప్పుకోవడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
వైరల్ అవుతున్న రాఖీ పెళ్లి ఫోటోలపై వీరిద్దరూ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. ఆదిల్. రాఖీ ఇద్దరూ జంటగా పలు సందర్భాల్లో దర్శనం ఇచ్చారు. తన ప్రియుడుతో ఉన్నప్పుడు రాఖీ సావంత్ చేసే హంగామానే వేరు. అలియా భట్ కి కూతురు పుట్టినప్పుడు కూడా రాఖీ, ఆదిల్ జంటగా విష్ చేశారు.