- Home
- Entertainment
- Rakhi Sawant: ఆరేళ్ళు చిన్నవాడైన యువకుడితో ప్రేమలో రాఖీ సావంత్.. విడాకుల తర్వాత చాలా జరిగిందట
Rakhi Sawant: ఆరేళ్ళు చిన్నవాడైన యువకుడితో ప్రేమలో రాఖీ సావంత్.. విడాకుల తర్వాత చాలా జరిగిందట
రాఖీ సావంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వివాదాలే. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ ఫోజింగ్ తో శృంగారతార అనే ముద్ర వేయించుకుంది.

రాఖీ సావంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వివాదాలే. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ ఫోజింగ్ తో శృంగారతార అనే ముద్ర వేయించుకుంది. తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం రాఖి సావంత్ కు అలవాటు. ఎలాంటి విషయం గురించి అయినా మొహమాటం లేకుండా మీడియా ముందు మాట్లేడేస్తుంది.
వాలంటైన్స్ డే రోజున రాఖీ సావంత్ తన భర్త రితేష్ తో విడాకులు ప్రకటించింది. అతడి మొదటి భార్య నుంచి రితేష్ విడాకులు పొందకపోవడంతో వీరిద్దరి వివాహం చెల్లలేదు. దీనితో రాఖీ అతడి నుంచి విడిపోయింది. తాజాగా రాఖీ సావంత్ తన పర్సనల్ లైఫ్ గురించి మరో ట్విస్ట్ ఇచ్చింది.
భర్త నుంచి విడిపోయిన కొన్ని నెలలకే రాఖీ మరో యువకుడితో ప్రేమలో పడిందట. ఈ విషయాన్ని రాఖీ సావంత్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. తన కొత్త ప్రియుడి పేరు అదిల్ దురాని అని రాఖీ సావంత్ ప్రకటించింది. అతడు నాకంటే వయసులో ఆరేళ్ళు చిన్నవాడు. రితేష్ తో బ్రేకప్ తర్వాత అదిల్ నన్ను ఒకసారి కలిశాడు.
పరిచయం అయిన నెలరోజులకే నాకు ప్రపోజ్ చేశాడు. వయసు వ్యత్యాసం ఉండడంతో మొదట నేను ఒప్పుకోలేదు. కానీ ప్రియాంక చోప్రా,నిక్ జోనస్.. మలైకా , అర్జున్ కపూర్ ల మధ్య వయసు తేడా ఉన్నప్పటికి వారు అన్యోన్యంగానే ఉన్నారు కదా.. అలా మనం ఎందుకు ఉండకూడదు అని నన్ను ఒప్పించాడు. నా బిజినెస్ పార్ట్నర్ శైలే..అదిల్ కి స్నేహితుడు. అలా మా మధ్య పరిచయం ఏర్పడిందని రాఖీ సావంత్ పేర్కొంది.
మేమిద్దరం రోజూ ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళం. మైసూర్ నుంచి తరచుగా నాకోసం అదిల్ ముంబైకి వచ్చేవాడు. బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ గా ఇచ్చాడు అని రాఖి సావంత్ పేర్కొంది. కానీ అదిల్ కుటుంబ సభ్యులకు మా ప్రేమ ఇష్టం లేదు.
నా డ్రెస్సింగ్ స్టైల్,ప్రవర్తన వాళ్ళకి నచ్చదు. కానీ ఎలాగైనా వాళ్ళని ఇంప్రెస్ చేస్తాను అని రాఖి సావంత్ అంటోంది. రాఖి సావంత్ కొత్త ప్రేమ ప్రయాణంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.