- Home
- Entertainment
- అలియా భట్ కి కూతురు.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి పండగ చేసుకుంటున్న రాఖీ సావంత్, ఎందుకంటే..
అలియా భట్ కి కూతురు.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి పండగ చేసుకుంటున్న రాఖీ సావంత్, ఎందుకంటే..
తాజాగా రాఖీ సావంత్ తన ప్రియుడితో కలిసి సంబరాల్లో మునిగిపోయింది. అందుకు కారణం ఉంది.

రాఖీ సావంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వివాదాలే. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ ఫోజింగ్ తో శృంగారతార అనే ముద్ర వేయించుకుంది. తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం రాఖి సావంత్ కు అలవాటు. రాఖి సావంత్ కి సంతోషం కలిగినా, బాధ కలిగిన ఆపుకోవడం కష్టమే.
తాజాగా రాఖీ సావంత్ తన ప్రియుడితో కలిసి సంబరాల్లో మునిగిపోయింది. అందుకు కారణం ఉంది. నేడు బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ తల్లిదండ్రులు అయ్యారు. అలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
దీనితో కపూర్ ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో అభిమానులు, సెలెబ్రిటీలు అలియా, రణబీర్ లకు వెల్లువలా శుభాకాంక్షలు చెబుతున్నారు. రాఖి సావంత్ ఏం చేసినా వెరైటీ కాబట్టి అలియా, రణబీర్ లకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది.
దోసె పెనంతో సౌండ్ చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ తో కలసి రచ్చ చేసింది. 'మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అంటూ పాట పాడుతూ తన సంతోషాన్ని తెలియజేసింది. అలియా భట్ ఇదిగో స్వీట్ తీసుకో.. దేశ ప్రజలందరి నుంచి శుభాకాంక్షలు అందుకో.. ఇది ప్రౌడ్ మూమెంట్. తల్లిదండ్రులు అయినందుకు అలియా, రణబీర్ ఇద్దరికీ శుభాకాంక్షలు.
నీతూజీకి , కపూర్ ఫ్యామిలీ అందరికి నా బెస్ట్ విషెస్ అంటూ రాఖి సావంత్ తన ప్రియుడుతో కలసి విషెస్ తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాఖి సావంత్ మాత్రమే కాదు.. రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ , రష్మిక, రాశి ఖన్నా, కాజల్ అగర్వాల్ ఇలా సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా రణబీర్, అలియా జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలియా భట్ తనకి కుమార్తె పుట్టిందన్న సంతోషాన్ని సోషల్ మీడియాలో తెలియజేసింది.