- Home
- Entertainment
- ప్రభాస్ కే డాన్స్ నేర్పిన రాకేష్ మాస్టర్ పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది? ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే!
ప్రభాస్ కే డాన్స్ నేర్పిన రాకేష్ మాస్టర్ పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది? ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే!
రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ ఇక లేరు. నేడు ఆయన అనార్యోగంతో కన్నుమూశారు. వివాదాలతో వార్తల్లో నిలిచిన రాకేష్ మాస్టర్ గతం, ఆయన గొప్పతనం తెలిస్తే గుండె ద్రవిస్తుంది.

Rakesh Master
రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. వాళ్ళ అమ్మకు రాముడు, రామారావు అంటే మహా ఇష్టం. అందుకే రామారావు అని పేరు పెట్టుకుంది. రామారావుకు నలుగురు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు. మొత్తం ఏడుగురు సంతానం. చిన్నప్పటి నుండి ముక్కుసూటి మనిషి. నచ్చని విషయాన్ని సహించేవాడు కాదట.
Rakesh Master
ఒకసారి వాళ్ళ అక్క పట్ల తప్పుగా ప్రవర్తించిన రిక్షావాడిని చితకొట్టాడట. డప్పు వినపడితే అక్కడకు పోయి చిందులు వేసేవాడట. సినిమాలు అంటే మక్కువ. ఆ సినిమాలు చూడటానికి కావలసిన డబ్బులు శవాల ముందు డాన్స్ చేసి, చిల్లర పోగు చేసుకుని చూశేవాడట. ఒకరోజు శవం లేస్తే ఆ రోజు ఒక కొత్త సినిమా చూడొచ్చనే భావనలో ఉండేవాడట.
Rakesh Master
రామారావు కుటుంబం తిరుపతిలో అద్దె ఇంటిలో ఉండేవారట. ఓనర్స్ ఒకసారి అవమానకరంగా మాట్లాడారని ఎలాగైనా సొంత ఇల్లు కట్టుకోవాలని రామారావు తల్లి భావించారట. కూలీ నాలీ చేసి డబ్బులు పోగు చేసేవారట. కూలి డబ్బులు సరిపోవని ఒక గంపలో ఇడ్లి, దోస పెట్టుకొని అమ్మారట. ఎట్టకేలకు ఒక ఇల్లు కొనుకున్నారట. రామారావుకి జిమ్నాస్టిక్స్, కరాటే అంటే కూడా ఇష్టం. డాన్స్ బాగా చేసేవాడట.
Rakesh Master
తన టాలెంట్ చూసి సినిమాల్లో ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులే ప్రోత్సహించారట. నువ్వు పెద్ద హీరోవి అవుతావని అనేవారట. హీరో అయ్యే లక్షణాలు నాలో లేవు. మీరు అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. నేను మంచి డాన్స్ మాస్టర్ అవుతానని చెప్పేవాడట. చెన్నై వెళ్లి కొన్నాళ్ళు ప్రయత్నం చేశాడట. భరతనాట్యం నేర్చుకొని తిరుపతిలో డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాడట.
Rakesh Master
రామారావు టాలెంట్ గుర్తించిన ఓ వ్యక్తి సీనియర్ కొరియోగ్రాఫర్ ముక్కు రాజుకు పరిచయం చేశాడట. హైదరాబాద్ వెళ్లి రామారావు ఆయన్ని కలిశాడట. సాగర సంగమం మూవీలోని కొన్ని డాన్స్ మూమెంట్స్ చేసి చూపించగా ముక్కురాజు ఆశ్చర్యపోయాడట. నీలో ఇంత టాలెంట్ ఉందా... అని ఎప్పటి నుండో తన వద్ద ఉన్న శిష్యులకు గురువుగా రామారావును పరిచయడం చేశాడట.
Rakesh Master
అది తట్టుకోలేని వారు రామారావు మీద కక్ష సాధింపు చర్యలకు దిగారట. రౌడీలతో బెదించడం చేశారట. ఇది ముక్కురాజుకు తెలిసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో వాళ్ళు బ్రతకనివ్వరని చెప్పాడట. ఒక ప్రముఖ వ్యక్తిని కలవగా ఆయన హైదరాబాద్ లో ఆశ్రయం ఇచ్చారట. అక్కడ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయించాడట. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ డాన్స్ ఇన్స్టిట్యూట్ అనతి కాలంలో పాప్యులర్ అయ్యింది.
Rakesh Master
హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న ప్రభాస్, వేణు తొట్టెంపూడి రాకేష్ మాస్టర్ వద్ద డాన్స్ నేర్చుకున్నారట. ఆ పరిచయంతో వేణు తాను నటించిన చిరునవ్వుతో సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ఇచ్చాడట. తర్వాత కృష్ణవంశీ, వైవిఎస్ చౌదరి వంటి డైరెక్టర్స్ అవకాశాలు ఇచ్చారట. రామారావు అనే కొరియోగ్రాఫర్స్ చాలా మంది ఉండగా, రాకేష్ మాస్టర్ అని పేరు మార్చుకున్నాడట.
Rakesh Master
స్టార్ గా ఎదగాల్సిన రాకేష్ మాస్టర్ లౌక్యం తెలియక క్రిందకు పడిపోయాడు. ఎదుటివారు ఎవరైనా నచ్చని విషయాన్ని కుండబద్దలు కొట్టేవాడట. దాంతో పరిశ్రమ వర్గాలతో వివాదాలు తలెత్తాయి. అలాగే డాన్స్ అసోసియేషన్ నుండి ఇదే కారణంతో బహిష్కరించబడ్డారు. చివరికి పరిశ్రమలో మనుగడ కోల్పోయాడు.
Rakesh Master
కొన్నేళ్లుగా రాకేష్ మాస్టర్ వివాదాలతో పాప్యులర్ అయ్యాడు. అనేక మంది స్టార్స్ ని ఆయన ఓపెన్ గా బూతులు తిట్టారు. ఒక టాలెంటెడ్ డాన్సర్ గా కంటే కూడా వివాదాలతో ఆయన ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు స్టార్ గా వెలుగుతున్న శేఖర్ మాస్టర్ కూడా ఆయన శిష్యుడే. శేఖర్ తో కూడా రాకేష్ మాస్టర్ కి గొడవలు అయ్యాయి. ఒక గొప్ప డాన్స్ మాస్టర్ ఎలాంటి గౌరవం అందుకోకుండా ఈ లోకం విడిచిపోయారు.