- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మితో చేతులు కలిపిన లాస్య.. విక్రమ్ కి మనసులో మాట చెప్పాలనుకుంటున్న దివ్య?
Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మితో చేతులు కలిపిన లాస్య.. విక్రమ్ కి మనసులో మాట చెప్పాలనుకుంటున్న దివ్య?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 31వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో ప్రియ సంజయ్ కోసం కాఫీ తీసుకొనివచ్చి ఏవండి కాఫీ తీసుకోండి అనగా నా నెత్తిన పోయి అంటూ ఇరిటేట్ అవుతూ ఉంటాడు సంజయ్. ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు మీరు అత్తయ్య చెప్పినట్లే వింటున్నాను కదా అని అంటుంది ప్రియ. అయినా నన్ను ప్రేమించినప్పుడు నన్ను కలిసినప్పుడు నీకు ఇరిటేషన్ రాలేదా అనగా ప్రేమ గాడిద గుడ్డా, తొందరపడి చేసిన ఒక నిర్ణయం వల్ల నా జీవితం స్పాయిల్ అయింది అనుకుంటూ ఉంటాడు సంజయ్. ఇంతలోనే అక్కడికి రాజ్యలక్ష్మి రావడంతో మామ్ నా వల్ల కాదు అవుట్ హౌస్ లో ఉండలేకపోతున్నాను అనడంతో చేశావు కదా అనుభవించు అని అంటుంది రాజ్యలక్ష్మి.
ప్లీజ్ మామ్ ఇంట్లోకి వస్తాను అనడంతో విక్రమ్ ఒప్పుకోడు అనగా నువ్వే ఏదో ఒకటి చెప్పి ఒపించు మామ్ అని అంటాడు సంజయ్. వాడి ముందు నా పరువు పోతే నువ్వు నేను రోడ్డు మీద పడి ఆడుకోవాలి. అందుకే వాడి ముందు నటించడానికి నానా తంటాలు పడుతున్నాను అంటుంది రాజ్యలక్ష్మి. ఇంతలోనే విక్రమ్ అక్కడికి రావడంతో ఏమైందమ్మా తమ్ముడు అలా ఉన్నాడు అనగా ప్రియ గురించి ఆలోచిస్తున్నాడు ఔట్హౌస్లో ఉండలేకపోతోంది అంట అనడంతో నిజమే కానీ మనం ఏం చేయలేం కాదమ్మా అని అంటాడు విక్రమ్. అప్పుడు సంజయ్ కోరికలన్నీ ప్రియ మీద నెట్టేస్తూ ఉంటుంది రాజ్యలక్ష్మి.
ఈ విషయం గురించి పంతులు గారిని అడిగితే లోపలికి పిలుచుకొని వెళ్లొచ్చు అని చెప్పాడు అని అనగా మరి ఇంకేం అదే పని చేద్దాం అమ్మ అని అంటాడు విక్రమ్. అప్పుడు విక్రమ్ ప్రియ కి నాలుగు మంచి మాటలు చెబుతూ ఉంటాడు. అప్పుడు ప్రియ విక్రంతో మాట్లాడాలి అనుకుంటుండగా రాజ్యలక్ష్మి కోపంగా చూడడంతో ప్రియ మౌనంగా తలదించుకుంటుంది. అప్పుడు సంజయ్ నా బదులు హాస్పిటల్ కి వెళ్లి జీతాలు ఇచ్చిరా అన్నయ్య అని అనగా సరే అని విక్రమ్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. అప్పుడు రాజ్యలక్ష్మి సంజయ్ ప్రియకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత దివ్య అద్దం ముందర రెడీ అవుతూ ఉండగా అది చూసి తులసి మురిసిపోతూ ఉంటుంది.
అప్పుడు దివ్య నా డ్రెస్ బాగుందా అమ్మ అనగా ఎక్కడికి వెళ్తున్నావు అని అనడంతో అమ్మలకు ఇలాంటి తెలివితేటలు అన్ని బాగానే ఇస్తాడు అని అనగా మాట దాటేయకుండా ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు అని అడుగుతుంది తులసి. అప్పుడు ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో కలిసి ఈ మధ్య నీలో ఏదో నాకు మార్పు కనిపిస్తోంది అని అంటుంది. మాటల్లోనా అనగా మాటల్లో కాదు ప్రవర్తనలో నా దగ్గర ఏదో దాస్తున్నావని అనిపిస్తోంది అంటుంది తులసి. అమ్మ ఆలోచన ఎప్పుడూ తప్పు కాదు నిజంగానే విక్రమ్ గురించి దాస్తున్నాను కదా అనుకుంటూ ఉంటుంది దివ్య.
వెళ్తున్నాను కదా విక్రమ్ మనసులో ఉన్నానో లేదో తెలుసుకొని వెంటనే నా మనసులో మాట చెప్పేస్తాను సారీ అమ్మ అనుకుంటూ ఉంటుంది దివ్య. ఆ తర్వాత దివ్య విక్రమ్ ని కలవడానికి వెళ్తుండగా హాస్పిటల్ కి రమ్మని ఫోన్ రావడంతో సరే అని విక్రమ్ కి ఫోన్ చేసి చెప్పగా సరే అని అనుకుంటూ ఉంటాడు విక్రమ్. మరొకవైపు లాస్య రాజ్యలక్ష్మి దగ్గరికి వెళ్లి నన్ను రమ్మని చెప్పారు కానీ ఎందుకో ఇప్పటివరకు చెప్పలేదు అని అంటుంది. నేను విషయం ఏంటో తెలియకుండా మాట ఇవ్వని రాజ్యలక్ష్మి గారు అనడంతో మాట ఇవ్వకపోతే నువ్వే మోసపోతావు ఒకసారి కళ్ళారా చూసుకో అని డబ్బు చూపించడంతో డబ్బు చూసి లాస్య నోరెళ్ళ బెడుతుంది.
సరే పనేదో చెప్పండి చేయడానికి నేను రెడీ అని అంటుంది లాస్య. అప్పుడు రాజ్యలక్ష్మి దగ్గర ఉండి చూసినట్టుగా లాస్య బ్యాక్ గ్రౌండ్ మొత్తం చెబుతూ ఉంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి మాటలకు లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పని చెప్పడానికి పిలిపించారా లేక నా జాతకం చెప్పడానికి పిలిపించారా అని అంటుంది లాస్య. నాకు కావాల్సిన వాళ్ళ బ్యాగ్రౌండ్ తెలియకుండా నేను పని ఒప్పుకోను అని చెప్పడానికి నీకు అదంతా చెప్పాను అని అంటుంది రాజ్యలక్ష్మి. నాకు ఇప్పుడు అర్థమైంది దివ్యని దెబ్బ కొట్టే విషయంలో నా హెల్ప్ అడుగుతున్నారు అనడంతో బాగానే గెస్ చేసావు అని అంటుంది రాజ్యలక్ష్మి.
అప్పుడు లాస్య సంజయ్ ప్రియ మధ్యలో ఉన్న సీన్ ని విక్రమ్ దివ్యల మధ్య ఊహించుకోండి ఎంత తెలివిగా ఉంటుందో అని అంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి ఊహించుకొని సంతోషపడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మీరు డోస్ పెంచుతూ పోతే దివ్య ఎప్పటికీ మీ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది ఇదే కదా మీకు కావాల్సింది అని అంటుంది లాస్య. కాబట్టి దివ్యని ఈ ఇంటి కోడల్ని చేసుకోండి అనడంతో సరే అని అంటుంది రాజ్యలక్ష్మి. అప్పుడు లాస్య సంతోషంతో డబ్బు తీసుకుంటుండగా దివ్య ను ఈ ఇంటికి కోడలు చేసే వరకు ఆ సూట్ కేస్ ని ముట్టుకోవడానికి వీల్లేదు అని అంటుంది.
అప్పుడు లాస్య మీద షాకింగ్ న్యూస్ చెప్పనా ఆల్రెడీ విక్రమ్ దివ్య ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనడంతో రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది. ఈ విషయంలో కోపం తెచ్చుకోకండి మీ చేతికి మట్టి అంటకుండానే విక్రమ్ మీకు పనికి పూర్తయ్యేలా చేస్తున్నాడు లాస్య చెప్పడంతో అయిపోయావు దివ్య అనుకుంటూ ఉంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు హాస్పిటల్లో విక్రమ్ దివ్య పేరు చూసి మురిసిపోతూ సంతోషపడుతూ ఆ ఫోటోకి ముద్దు పెడతాడు. అప్పుడు హాస్పిటల్ లో పనిచేసే వారికి చెక్కులు ఇస్తూ ఉంటాడు విక్రమ్.