- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: అప్పుడే కొడుకు, కోడల్ని దూరం చేస్తున్న రాజ్యలక్ష్మి.. తులసికి నిజం చెప్పనున్న నందు?
Intinti Gruhalakshmi: అప్పుడే కొడుకు, కోడల్ని దూరం చేస్తున్న రాజ్యలక్ష్మి.. తులసికి నిజం చెప్పనున్న నందు?
Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. మోసపోయి పులి బోను లాంటి అత్తింట్లో అడుగుపెట్టిన ఒక అమ్మాయి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మగ పెళ్లి వాళ్ళ ఆచారాలే ఆడ పెళ్లి వాళ్ళు పాటించాలి అంటాడు బసవయ్య. ఆడపిల్ల ఇంట్లో అయితే తనకి భయం బెరుకు ఉండవు అంటుంది తులసి. అత్తిల్లు ఏమీ నరకం కాదు కదా ఇక్కడ కూడా అలవాటు చేసుకోవాలి కదా రాజ్యలక్ష్మి. మరేమీ మాట్లాడలేక మీ ఇష్టమే, మీకు ఎలా నచ్చితే అలా చేయండి అంటుంది తులసి.
మరోవైపు ప్రియతో మాట్లాడుతున్న దివ్య.. నీ మొహం లో ఏదో దిగులు కనిపిస్తుంది నవ్వటానికి కూడా చాలా కష్టపడుతున్నావు.. నువ్వు ఇక్కడ సుఖంగానే ఉన్నావా అని అడుగుతుంది. ఎలా ఉన్నా బ్రతుకుని ఎలాగో ఒకలాగా ముందుకి సాగించాలి కదా మేడం అని వేదాంత ధోరణిలో మాట్లాడుతుంది ప్రియ. ఎందుకు అంత వేదాంతంలో మాట్లాడుతున్నావు.
ఇక్కడ నీకు ఎవరి వల్ల కష్టమో చెప్పు నేను మాట్లాడతాను పెళ్లి చేయడంతోనే నా బాధ్యత అయిపోలేదు. నాకు తెలిసి నీకు సంజీవతో మాత్రమే కష్టం కలిగి ఉంటుంది ఎందుకంటే అత్తయ్య గారు చాలా మంచివారు కదా అంటుంది దివ్య. మరోవైపు మేము బయలుదేరుతాము ఒకసారి దివ్యని పిలిపిస్తే మాట్లాడి వెళ్లిపోతాము అంటుంది తులసి. తను పడుకుంది రేపు ఎలాగా సత్యనారాయణ వ్రతం ఉంది కదా అప్పుడు మాట్లాడుకోవచ్చు లెండి అంటుంది రాజ్యలక్ష్మి.
చేసేది లేక చాలా బాధతో అక్కడినుంచి బయలుదేరుతారు నందు దంపతులు. మరోవైపు నువ్వు నిజం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటూ ప్రియని నిలదీస్తుంది దివ్య. ఏదైతే అదే జరిగింది నిజం చెప్పేయాలి అనుకుంటుంది ప్రియ. ఇంతలో దేవుడు వచ్చి మీ అమ్మగారు వాళ్ళు వచ్చారు అని చెప్పటంతో ఆనందంతో అక్కడి నుంచి బయలుదేరుతుంది దివ్య. కిందికి వచ్చి చూసేసరికి అక్కడ నందు వాళ్ళు ఉండరు. అమ్మ వాళ్ళు ఏరి అని రాజేశ్వరి వాళ్ళని అడుగుతుంది దివ్య.
పని మీద వచ్చారు చూసుకుని వెళ్ళిపోయారు నువ్వు పడుకున్నావని ఎవరో చెప్పారు.. పడుకొనివ్వండి పాపం అని చెప్పి వెళ్ళిపోయారు అంటాడు బసవయ్య. కన్నీరు పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దివ్య. నువ్వు పెట్టిన మంట దివ్య కొంగుకి అంటుకోవాలి అప్పుడు మజా అంటాడు బసవయ్య. మరోవైపు దిగులుగా ఉన్న భర్తని చూసి ఎందుకు అంత దిగులు దివ్య కోసమేనా అంటుంది తులసి. మూడు రాత్రులు మన ఇంట్లో జరగనివ్వరిట అంటాడు నందు.
ఆవిడకి కోడలు అంటే ఎంత ప్రేమ తల్లిలాగా బాధ్యత తీసుకుంటుంది అంటుంది తులసి. రాజీ పడుతున్నావా అంటాడు నందు. మన ప్రయత్నాలు ఏవి ఫలించినప్పుడు ఆఖరికి మనం చేయవలసింది అదే అంటూ దిగులుగా అంటుంది తులసి. రేపు కూతురు సునామీలో చుట్టుకోపోతుంది అంటే ఇంకేమైపోతావో అందుకే నిజం తెలిసినా చెప్పలేకపోతున్నాను అని మనసులోనే బాధపడతాడు నందు.
మరోవైపు నందు వాళ్ల కోసం ఎదురు చూస్తూ పరంధామయ్య దంపతులు చిలిపి తగాదాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు తులసి కుటుంబ సభ్యులు. లాస్య అక్కడ రాజ్యలక్ష్మి వీళ్ళని తన్ని తరిమేసి ఉంటుంది లైవ్ లో చూసేదాన్ని అనవసరంగా ఈ ముసలి దానివల్ల మిస్ అయిపోయాను అని టెన్షన్ గా నందు వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో ఒంటరిగా వచ్చిన నందు వాళ్ళని చూసి దివ్య వాళ్ళు ఏరి అని అడుగుతారు కుటుంబ సభ్యులందరూ. ఏమి మాట్లాడకుండా నందు దిగులుగా ఇంట్లోకి వెళ్లిపోతాడు. తులసి ద్వారా జరిగిందంతా తెలుసుకుని మండిపడతారు ఆమె కుటుంబ సభ్యులు.
అలా కామ్ గా ఎందుకు వచ్చేసారు నిలదీయవలసింది కదా నేను బావగారితో మాట్లాడుతాను అంటాడు ప్రేమ్. మొదటి రోజే తల్లి కొడుకులతో గొడవపడకు అది మన దివ్యకే ప్రమాదం అంటుంది లాస్య. అవును లాస్య చెప్పింది నిజమే అయినా ఈ విషయం గురించి పెద్ద వాళ్లమే మేము చూసుకుంటాము మీరు వదిలేయండి అంటూ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తులసి. మరోవైపు ఇంటికి వచ్చిన వాళ్ళకి నోటు మీద వాత పెట్టినట్టు మా అక్కయ్య భలే చెప్పింది వాళ్ల మొహాలు చూస్తే నాకే బాధనిపించింది అంటాడు బసవయ్య. నాకు మాత్రం నవ్వొచ్చింది అంటుంది అతని భార్య. కానీ బాధపడవలసింది వాళ్ళు కాదు దివ్య తన కంట్లోంచి రక్తం రావడం మా అక్క చూడాలి అంటాడు బసవయ్య.
రేపు ఫస్ట్ నైట్ సంగతి ఏంటి అని రాజ్యలక్ష్మిని అడుగుతాడు. ఫస్ట్ నైట్ జరిగితే నా చేతిలో నుంచి జారి దివ్య ఒళ్ళో పడతాడు అందుకని ఫస్ట్ నైట్ జరిగే చాన్సే లేదు అంటుంది రాజ్యలక్ష్మి. ఎన్నాళ్ళని ఆపుతావు నీ కొడుక్కి అనుమానం రాకపోయినా ఆ దివ్యకి అనుమానం వస్తుంది కదా అంటాడు బసవయ్య. అప్పుడు నా కొడుకుని ఆయుధంగా ప్రయోగిస్తాను అంటుంది రాజ్యలక్ష్మి. తరువాయి భాగంలో ఈరోజు ఫస్ట్ నైట్ లేదు అని కొడుక్కి చెప్పి డిసప్పాయింట్ చేస్తుంది రాజ్యలక్ష్మి. మనసులో ఏదో తుఫాను చెలరేగినట్లుగా ఉంది సంఘర్షణ చాలా తీవ్రంగా అనిపిస్తుంది అంటుంది తులసి. నీకు ఒక విషయం చెప్పాలి అంటూ ఏదో చెప్తాడు నందు.