రజనీ ‘వేట్టైయాన్’ OTT రిలీజ్ డేట్, వివరాలు
క్రైమ్ క్యాన్సర్ లాంటిది దానిని పెరగనివ్వకూడదు”, అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు మౌనంగా ఉండడం కంటే న్యాయాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు కాదు.’
Rajinikanth, Vettaiyan, OTT release date
దసరా హాలిడేస్ మొదలవ్వగానే ఇటీవలే శ్రీవిష్ణు స్వాగ్ సినిమాతో వచ్చాడు. అయితే మార్నింగ్ షోకే తేడా టాక్ రావటంతో ఈ సినిమా వర్కవుట్ కాదు అని తేలిపోయింది. ఈ క్రమంలో దసరా రోజున రిలీజ్ కు ఈ సారి అరడజను సినిమాలు రిలీజ్ కి రెడీగా చేసారు.
దసరా 12వ తేదీ కావడంతో రెండు రోజుల ముందు నుంచే సినిమాల పండగ మొదలైంది. వాటిల్లో ముఖ్యమైంది అక్టోబర్ 10న వచ్చిన రజినీకాంత్ ‘వెట్టయాన్’. అయితే ఊహించని విధంగా ఈ సినిమాకు కూడా మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చేసింది. దాంతో వెళ్దామనుకున్న వాళ్లు సైతం ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూడటం మొదలెట్టారు.
Rajinikanth, Vettaiyan, OTT release date
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మూవీ వేట్టయన్ ని టి.జె. జ్ఞానవేల్ డైరక్ట్ చేసారు. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్,రానా, మంజు వారియర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.. లైకా ప్రొడక్షన్స్ పతాకం పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
క్రైమ్ క్యాన్సర్ లాంటిది దానిని పెరగనివ్వకూడదు”, అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు మౌనంగా ఉండడం కంటే న్యాయాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు కాదు.’ అనే డైలాగ్స్ జనాల్లోకి బాగానే వెళ్లినా టైటిల్ తెలుగులో లేకపోవటం ఇబ్బంది పెట్టింది.
Rajinikanth, Vettaiyan, OTT release date
పేరుకి డబ్బింగ్ సినిమా అయినా ఈ సినిమాకే ఉన్న సినిమాల్లో కాస్తంత ఎక్కువ క్రేజ్ ఉంది. తెలుగులో రజినీకాంత్ కి మంచి ఫాలోయింగే ఉంది, దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా బాగానే వర్కౌట్ అవ్వొచ్చు తెలుగులో అని డిస్ట్రిబ్యూటర్స్ అంచనాలు వేసారు. కానీ అంచనాలు తలక్రిందులు అయ్యాయి. ‘వెట్టయాన్’లో కంటెంట్ రజనీ ఇమేజ్ కు సరపడా లేదు. ఫస్టాఫ్ నడిచిపోయినా, సెకండాఫ్ కు వచ్చేసరికి తడబడింది. సినిమా తేడా కొట్టేసింది.
Rajinikanth, Vettaiyan, OTT release date
ఇక ఈ చిత్రం నవంబర్ 7 నుంచి ఓటిటి లోకి రావటానికి రంగం సిద్దం అవుతున్నట్లు సమాచారం. అయితే అఫీషియల్ ప్రకటన రాలేదు. ఈ సినిమా నార్త్ లో మల్టీప్లెక్స్ లలో రిలీజ్ కాలేదు కాబట్టి ఎనిమిది వారల కండీషన్ దీనికి వర్తించదు. దాంతో నాలుగు వారాల్లోనే ఈ సినిమా ఓటిటిలోకి వచ్చే ఛాన్స్ కనపడుతోంది. అమేజాన్ ప్రైమ్ వారు ఈ చిత్రం ఓటిటి రైట్స్ భారీ మొత్తం ఇచ్చి తీసుకున్నారు.
Actor Rajinikanths Vettaiyan
‘వేట్టైయాన్ - ది హంటర్’ story line
ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే.... ఈ సినిమా కథ భారతదేశంలో జరిగిన భారీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్కామ్ ఆధారంగా కథ నడుస్తోంది. రీసెంట్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వాలని మేనుప్యులేట్ చేసిన ఫ్రాడ్ చేసిన ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. రానా ఓ పెద్ద ఎడ్యుకేషన్ యాప్ కంపెనీకి ఓనర్ గా కనిపిస్తాడు. అతను చేసే అక్రమాలకు ఓ టీచర్ బలి అవుతుంది. ఆ కేసు టేకప్ చేసిన రజనీ చెక్ పెడతాడు.
అమితాబ్ క్యారక్టర్ ఇలాంటి ఎనకౌంటర్స్ కు వ్యతిరేకంగా వాదిస్తాడు. సీరియస్ క్రైమ్స్ చేసి తప్పించుకునే చెడ్డవాళ్లకి న్యాయబద్ధమైన శిక్ష పదాలని చూసే అమితాబ్ బచ్చన్ ఒకవైపు, మరో వైపు అన్యాయం జరిగితే అది హద్దులు దాటిపోయింది అనిపిస్తే ఎన్ కౌంటర్ చేయడానికి సిద్ధం అయ్యే పోలీస్ అయిన హీరో ఒకవైపు నిలుస్తారు. ఇలాంటి వీళ్ళకి సీరియస్ కేసు ఒకటి సవాలుగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా . సూర్యతో జై భీం లాంటి క్లాసిక్ మూవీ ఇచ్చిన టీజె జ్ఞానవేల్ దీనికి దర్శకుడు అవటం కలిసొచ్చే అంశం.