MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • రజనీకాంత్ భార్యకి విపరీతంగా నచ్చేసిన చిరంజీవి సినిమా..అంత గొప్ప చిత్రం ఏదో తెలుసా, స్వయంగా ఫోన్ చేసి

రజనీకాంత్ భార్యకి విపరీతంగా నచ్చేసిన చిరంజీవి సినిమా..అంత గొప్ప చిత్రం ఏదో తెలుసా, స్వయంగా ఫోన్ చేసి

చిరంజీవి తన కెరీర్ లో ఎక్కువగా అభిమానుల సంతోష పెట్టే మాస్ చిత్రాలు చేశారు. అప్పుడప్పుడూ స్వయం కృషి , ఆపద్భాందవుడు, రుద్రవీణ లాంటి కళాత్మక చిత్రాలు కూడా చేశారు. అయితే చిరంజీవి తన కెరీర్ లో తాను ఎంతో ఇష్టపడి.. తనకోసం తాను చేసిన చిత్రం ఒకటి ఉంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 20 2024, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్  ఘనతలు చెప్పుకుంటూ పోతే పెద్ద చిట్టానే అవుతుంది. చిరంజీవికి మాస్ ఆడియన్స్ లో ఉన్న ఫ్యాన్ బేస్ ఇంకెవరికీ లేదు. ఒక దశలో రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవి అమితాబ్ ని మించిపోయాడు అంటూ కూడా కథనాలు వచ్చాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చిరంజీవి తన కెరీర్ లో ఎక్కువగా అభిమానుల సంతోష పెట్టే మాస్ చిత్రాలు చేశారు. అప్పుడప్పుడూ స్వయం కృషి , ఆపద్భాందవుడు, రుద్రవీణ లాంటి కళాత్మక చిత్రాలు కూడా చేశారు. అయితే చిరంజీవి తన కెరీర్ లో తాను ఎంతో ఇష్టపడి.. తనకోసం తాను చేసిన చిత్రం ఒకటి ఉంది. ఆ మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ కి విపరీతంగా నచ్చేసిందట. ఆ మూవీ మరేదో కాదు సైరా నరసింహా రెడ్డి. 

 

36

స్వాతంత్ర పోరాట యోధుడు సైరా నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ బడ్జెట్ అంటే రిస్క్ ఎక్కువ. కానీ చిరంజీవికి ఇష్టమైన కథ అది. దీనితో తండ్రి కోసం రాంచరణ్ సొంత ప్రొడక్షన్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 

 

46

సినిమా బావుందని ప్రశంసలు దక్కినప్పటికీ నష్టాలు తప్పలేదు. ఈ చిత్రంలో చిరంజీవి పెర్ఫామెన్స్ లో టాలీవుడ్ హీరోలంతా అభినందించారట. చిరంజీవి ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. నాగార్జున, వెంకటేష్ ఇద్దరూ మూవీ అద్భుతంగా ఉందని అభినందించినట్లు చిరు తెలిపారు. 

 

56

మూవీ రిలీజ్ అయ్యాక రజనీకాంత్, ఆయన సతీమణి లతా రజనీకాంత్ ఇద్దరూ కలసి సైరా చూశారట. మూవీ చూశాక రజనీకాంత్ నాకు ఫోన్ చేశారు. మూవీ బ్రహ్మాండంగా ఉంది అని అభినందించారు. వెంటనే ఆయన సతీమణి లతా గారు ఫోన్ తీసుకుని.. ఏం సినిమా అండీ, వండర్ ఫుల్ గా ఉంది. నిన్నంతా ఆ మూవీ ఫీలింగ్ లోనే ఉన్నాం అంటూ ఆమె సంతోషాన్ని తనతో పంచుకున్నట్లు చిరు తెలిపారు. 

 

66

తనకి మూవీ విపరీతంగా నచ్చేసింది అని చెప్పారట. కమర్షియల్ గా సైరా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ చిరంజీవి ఈ చిత్రంలో నటించి తన కోరిక నెరవేర్చుకున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గ్గా నటించగా.. తమన్నా కీలక పాత్రలో నటించింది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Annapurna: భర్తను రెండో పెళ్లి చేసుకోమన్న స్టార్ నటి.. అన్నపూర్ణ సంచలన నిర్ణయం వెనుక కారణం ఏంటి?
Recommended image2
Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?
Recommended image3
Youtuber Nandu: నందూస్ వరల్డ్ రమా నందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved