రజనీకాంత్ vs ఎంజీఆర్: సౌత్ హీరోయిన్స్ సూపర్ స్టార్ ను ఎందుకు వ్యతిరేకించారో తెలుసా..?
తమిళ సినిమాల్లో సూపర్ స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో రజనీకాంత్ కొంతమంది హీరోయిన్స్‌తో నటించడంలో అడ్డంకులు ఎదుర్కొన్నారు, ఎంజీఆర్ కూడా అందుకు ఒక కారణమని చెబుతారు.
ఎంజీఆర్ vs రజనీకాంత్
1980లలో, రజనీకాంత్ వరుస విజయాలతో తమిళ సినిమాల్లో అగ్ర తారగా ఎదుగుతున్న సమయంలో, కొంతమంది హీరోయిన్లు ఆయనతో నటించడానికి వ్యాతిరేకత తెలిపారు. ఆ నటీమణులు మరెవరో కాదు లత, జయలలిత. రజనీకాంత్‌తో నటించకపోవడానికి ఎంజీఆర్ ఒప్పందమే కారణమని తెలుస్తోంది.
అసలు ఈ కథ ఏంటంటే.. 1972లో, ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, అయితే అటు రాజకీయాలతో పాటు ఆయన సినిమాల్లో కూడా నటించడం కొనసాగించారు. 1974లో, ఆయన ఒక సినిమా కోసం మారిషస్ పర్యటనకు వెళ్లబోతున్నారు.
అజిత్ కొత్త కారు పోర్షే GT3.. కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
హీరోయిన్స్‌తో ఎంజీఆర్ ఒప్పందం
ఎంజీఆర్, విలేకరులతో మాట్లాడుతూ, తనకు, లతకు మధ్య జరిగిన ఒప్పందం గురించి మాట్లాడారు. ఆ ఒప్పందం ప్రకారం నటి లత తన అనుమతి లేకుండా ఏ సినిమాలోనూ నటించకూడదని ఆయన చెప్పారు. ఒకవేళ ఆమె నటించడానికి అంగీకరిస్తే, తన సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు.
ఉలగం సుట్రుమ్ వాలిబర్' సినిమాలో లత నటిస్తున్నప్పుడు ఎంజీఆర్ ఈ ఒప్పందం చేసుకున్నారని చెబుతారు. ఈ పరిస్థితుల్లోనే నటి లతకు రజనీకాంత్ సరసన నటించే అవకాశం వచ్చింది.
రజనీకాంత్, ఎంజీఆర్
కానీ ఎంజీఆర్ చేసుకున్న ఒప్పందం కారణంగా ఆమె రజనీ సినిమాలో నటించలేకపోయింది. దీనికి ఎంజీఆర్ అడ్డంకి వేశారనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది. నటి జయలలిత కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు.
ఆమెకు కూడా రజనీతో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆమె నటించకపోవడానికి కూడా ఎంజీఆర్ జోక్యమే కారణమని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. కానీ ఈ వివాదంపై జయలలిత స్వయంగా స్పందించారు.
జయలలిత, ఎంజీఆర్
1979లో, జయలలిత ఒక పత్రికకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో, రజనీతో నటించడానికి నిరాకరించినట్లు వస్తున్న వార్తలు నిజమేనా అనే ప్రశ్నకు జయలలిత సమాధానం ఇచ్చారు. 'నేను నటించడానికి నిరాకరించిన మాట నిజమే అన్నారు.
దానికి వేరే కారణం లేదు, వాళ్లు నాకు ఇచ్చిన పాత్ర నాకు సంతృష్టికరంగా లేకపోవడంతో నేను నటించలేదు' అని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా, 1980లో, జయలలితకు సినిమా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తను ప్రచురించిన పత్రికకు జయలలిత ఘాటుగా లేఖ రాశారు.
జయలలిత
ఆ లేఖ లో ఇలా ఉంది.. 'నేను మళ్లీ సినిమాల్లో నటించడానికి ఇబ్బంది పడటం లేదు. నిజానికి, నాకు సినిమాల్లో నటించడానికి చాలా మంచి అవకాశాలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది 'బిల్లా' సినిమా. ఆ సినిమా నిర్మాత బాలాజీ ముందుగా రజనీకాంత్ సరసన నటించడానికి నన్ను సంప్రదించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించడానికి నేను నిరాకరించాను. ఆ తర్వాతే ఆ పాత్రలో నటి శ్రీదేవిని తీసుకున్నారు. అని అన్నారు.