సినిమాలకు రజినీకాంత్ గుడ్ బై.. వాళ్ల హెచ్చరికలే కారణమా..? చివరి సినిమా అదే..?
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా..? సినిమాలు ఆపక తప్పదని ఆయన్ను హెచ్చరించింది ఎవరు..?
సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళ తలైవా.. ఒక్క తమిళనాడులోనే కాదు.. సౌత్ లో ఆయన స్టార్ డమ్ ను టచ్ చేయగలిగే హీరో రాలేదనే చెప్పాలి. ఇండియన్ సినిమా లెజెండ్ గా.. బాలీవుడ్ స్టార్స్ సైతం గౌరవించే వ్యక్తి రజినీకాంత్. ఆయన సినిమా కోసం కోట్లాదిగా అభిమానులు ఎదరు చూస్తుంటారు.
73 ఏళ్లు దాటినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ.. వందల కోట్ల బిజినెస్ చేయగలిగే సినిమాలను అందిస్తున్నారు రజినీకాంత్. ఇక ఈ ఏజ్ లో కూడా రజినీకాంత్ కష్టపడుతూ.. తన అభిమానులను అలరిస్తున్నారు. ఈక్రమంలో ఆయన పలుమార్లు అనారోగ్యాలకు గురికావడం.. హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూనేఉంది.
rajinikanth
తాజాగా మరోసారి రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రీసెంట్ గా సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి, నటుడు రజనీకాంత్ తేలికపాటి ఛాతీ నొప్పి, అలసట మరియు పొత్తికడుపు వాపు కారణంగా చెన్నైలోని అయర్ లాన్‌ముట్ ప్రాంతంలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.
అక్కడ ఆయనకు కార్డియాలజీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు రజినీకాంత్ కోలుకుంటున్నారు. గుండె నుండి శరీరానికి రక్తం సరఫరా చేసే ప్రధాన రక్త నాళంలో(aorta)వాపు చోటు చేసుకుంది. శస్త్ర చికిత్స అవసరం లేకుండా ట్రాన్స్ క్యాథటర్ పద్దతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ ఆర్టా కి స్టెంట్ అమర్చారు.
రజినీకాంత్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన క్షేమంగా ఉన్నారు. కోలుకుంటున్నారు.తాజాగా ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయినట్టు తెలుస్తోంది. ఆయన ఇలా అనారోగ్యంపాలు అవ్వడం ఇది మొదటి సారి కాదు.. ఎన్నోసార్లు ఆయన ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
డీహైడ్రేషన్ తో ఒక సారి.. కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ హాస్పిటల్ లో మరికొన్ని రోజులు.. కరోనా అనుమానంతో.. అన్నాత్తే షూటింగ్ టైమ్ లో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కూడా చేశారు రజినీకాంత్. ఇక ఇన్ని సార్లు ఆయన ఆరోగ్యం ఇబ్బందులు ఫేస్ చేయడంతో.. రజినీకాంత్ కు కంప్లీట్ గా రెస్ట్ అవసరం అంటున్నారట డాక్టర్లు.
గతంలో రాజకీయాల్లోకి రావడం కోసం అన్ని రెడీ చేసుకున్న తలైవా.. అనారోగ్యం కారణంగానే వెనకడుగు వేసినట్టు ప్రకటించారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో రాజికీయాల్లో ప్రజెర్ ను తీసుకోగలడో లేదో అనే అనుమానంతో ఆయన పాలిటిక్స్ ను వదిలేశారు. అప్పటిక వరకు చేసిన కమిటీలను కూడా రద్దు చేశారు.
ఇక తాజాగా ఆయన అనారోగ్యం మరింతగా పెరగడంతో.. సూపర్ స్టార్ ఇక సినిమాలు చేయడం కూడామంచిది కాదు అంటున్నారు డాక్టర్లు. షూటింగ్ అంటూ ఆయన స్ట్రేన్ అవ్వడంమంచిది కాదుఅన్నారట డాక్టర్లు. అందుకే షూటింగ్స్ కూడా చేయడం మంచిది కాదు అని చెప్పడంతో.. రజినీకాంత్ ఇక సినిమాలకు కూడా గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయాన్, కూలీ చిత్రాల్లో నటిస్తున్నారు. వేట్టయాన్ అక్టోబర్ 10న విడుదల కానుంది. దసరా కానుకగా బాక్సాఫీసు ముందుకొస్తున్న చిత్రాల్లో ‘వేట్టయాన్’ ఒకటి. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. టి.జె. జ్ఞానవేల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇది రజనీకాంత్‌కు 170వ చిత్రం. ఆయన ఇందులో రిటైర్డ్ పోలీసు అధికారిగా కనిపించనున్నట్టు సమాచారం.
అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, రితికా సింగ్, మంజు వారియర్, కీలక పాత్రలు పోషించారు. తెలుగులోనూ అదే పేరుతో విడుదల కానుంది. ఇక కూలీ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆసక్తి రేపుతున్నాయి.
కూలీ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక రోల్ చేయడం విశేషం. అయితే కూలి సినిమా తరువాత రజినీకాంత్ సినిమాలను వదిలేయబోతున్నాడని టాక్ గట్టిగా నడుస్తోంది. మరి సూపర్ స్టార్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి.