- Home
- Entertainment
- రజినీకాంత్ కోసం అట్లీ శిష్యుడు, తలైవర్ 173 కి దర్శకుడు ఎవరో తెలుసా? ఎవరూ ఊహించని కాంబో
రజినీకాంత్ కోసం అట్లీ శిష్యుడు, తలైవర్ 173 కి దర్శకుడు ఎవరో తెలుసా? ఎవరూ ఊహించని కాంబో
కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించనున్న తలైవర్ 173 సినిమా కోసం డైరెక్టర్ ను మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది. సుందర్.సి తప్పుకోవడంతో.. ఆ స్థానంలోకి ఎవరు వచ్చారో తెలుసా?

రజినీకాంత్ 173వ సినిమాకు దర్శకుడు దొరికాడు
తమిళ చిత్రసీమతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న స్టార్ నటులు రజినీకాంత్, కమల్ హాసన్. ఈ ఇద్దరూ పెద్ద స్టార్లు గతంలో పలుమార్లు కలిసి నటించారు. కానీ మొదటిసారి కమల్ నిర్మాణంలో రజినీకాంత్ నటిస్తున్నారని గత నవంబర్‌లో ప్రకటించారు. ఈ 173వ సినిమాకి సుందర్ సి ని దర్శకుడిగా కూడా అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన మధ్యలోనే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.
రజినీకాంత్ సినిమా నుంచి తప్పుకున్న స్టార్ డైరెక్టర్
తలైవర్ 173 సినిమా ప్రకటన వచ్చిన వారంలోనే సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. కథ నచ్చకపోవడమే దానికి కారణమన్న టాక్ వినిపించింది. ఆయన తప్పుకున్నప్పటి నుంచి వాత దర్శకుడిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇక తాజాగా ఈసినిమా దర్శకుడెవరో చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
తలైవార్ 173 కొత్త దర్శకుడు ఎవరంటే?
తలైవర్ 173కి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. ఈ యంగ్ డైరెక్టర్ గతంతో శివకార్తికేయన్ 'డాన్' సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, 2027 సంక్రాంతి కానుకగా ఈమూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
సిబి చక్రవర్తి అట్లీ శిష్యుడు
సిబి చక్రవర్తి దర్శకుడు అట్లీ శిష్యుడు. 'తెరి', 'మెర్సల్', 'బిగిల్' లాంటి సినిమాలకు అతను అసిస్టెంట్ డైరెక్టర్ గా అట్లీ దగ్గర ా పనిచేశారు. 2022లో శివకార్తికేయన్ 'డాన్'తో దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమాతోనే 125 కోట్లు వసూలు చేయగలిగే సినిమాను అందించాడు. మరి రజినీకాంత్ తో సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో చేస్తాడో చూడాలి.

