MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Peddanna review:రజినీకాంత్ పెద్దన్న ప్రీమియర్ షో రివ్యూ... ఫస్ట్ హాఫ్ అలా సెకండ్ హాఫ్ మరోలా!

Peddanna review:రజినీకాంత్ పెద్దన్న ప్రీమియర్ షో రివ్యూ... ఫస్ట్ హాఫ్ అలా సెకండ్ హాఫ్ మరోలా!

ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన తన స్థాయి హిట్ కొట్టలేదు. కనీసం పెద్దన్న చిత్రంతో అయినా ఫ్యాన్స్ దాహం Rajinikanth తీర్చాడా? ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో చూద్దాం...   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 04 2021, 07:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


కథ: తమిళంలో Annaatthe టైటిల్ తో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో పెద్దన్నగా విడుదల చేశారు. మాస్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కించగా తెలుగులో సురేష్ బాబు, నారాయణదాస్ నారంగ్ విడుదల చేశారు. పెద్దన్న కథ విషయానికి వస్తే తన గ్రామంలో పెద్ద అయిన రజినీకాంత్ మంచి మనసున్న వ్యక్తి. పేదల పాలిట పెన్నిధిగా, ఊరిగా అండగా ఉంటాడు. ఆయనకు చెల్లి కీర్తి సురేష్ అంటే ఎనలేని ప్రేమ. తన ప్రాణప్రదంగా ప్రేమించే చెల్లికి వచ్చిన ఆపద ఏమిటీ? పల్లెటూరి పెద్దన్న కలకత్తా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు దర్శకుడు శివ. ఇక రజినీకాంత్ కెరీర్ లో కూడా ఈ తరహా చిత్రాలు ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశాయి. ముత్తు, అరుణాచలం, నరసింహ... ఈ జోనర్ లో తెరకెక్కి తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని విజయాలు అందుకున్నాయి. లేటెస్ట్ రీలీజ్ Peddanna సైతం ఇదే తరహాలో తెరకెక్కింది. 
 

37

కథ కొత్తదైనా, పాతదైనా ట్రెండ్ ఫాలో అవ్వాలి. పెద్దన్న విషయంలో ముఖ్యంగా వినిపిస్తున్న నెగిటివ్ కామెంట్ ఇది. 80-90 ల నాటి కథను పెద్దన్న టైటిల్ తో మరోమారు ప్రేక్షకుల మీద రుద్దారని కొందరు అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ఇది కొత్త జాడీలో పెట్టిన పాత పచ్చడే అని పెదవి విరుస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఎమోషన్స్, కామెడీతో నడపాలని ట్రై చేశారు. అయితే అవేమి అంతగా కనెక్ట్ కాలేదన్నట్లు తెలుస్తుంది. మెల్లగా సాగే కథనంతో పాటు సీనియర్ హీరోయిన్స్ కుష్బూ, మీనా కామెడీ సీన్స్ టార్చర్ అంటున్నారు. 

47


ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ బాగుంది అన్న అభిప్రాయం ప్రీమియర్ టాక్ ద్వారా వినిపిస్తుంది. రజిని మార్క్ మేనరిజం, డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయట. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే సైతం కొంచెం వేగం పుంజుకొని, ప్రేక్షకులకు ఉపశమనం కలిగించిందన్న టాక్ వినిపిస్తుంది. 


 

57

ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా పెద్దన్న సినిమాలో చెప్పుకోదగ్గ అంశం, బాగా కుదిరిందని మెజారిటీ ఆడియన్స్ తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. అలాగే పెద్దన్న పక్కా దీపావళి చిత్రం, సెంటిమెంట్, కామెడీ అంశాలు... ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయని, పెద్దన్న మంచి విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

67

చెల్లిగా Keerthy suresh, రజినీకాంత్ జోడీగా నయనతార ఆకట్టుకున్నారు. Nayanatara పెద్దన్న లో లాయర్ రోల్ చేయడం విశేషం. సీనియర్ హీరోయిన్స్ కుష్బూ, మీన కామెడీతో పాటు సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు. విలన్ రోల్స్ చేసిన జగపతి బాబు, ప్రకాష్ రాజ్... తమ బెస్ట్ పెర్ఫార్మన్స్ తో సినిమాకు ప్లస్ అయ్యారు. 

77


మొత్తంగా పెద్దన్న అవుట్ డేటెడ్ కథతో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రీమియర్స్ ద్వారా పెద్దన్న మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆకట్టుకోని ఎమోషన్స్, కామెడీ ఫస్ట్ హాఫ్ ని డల్ గా మార్చేశాయని, అయితే ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ లో రజినీకాంత్ యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయన్న అభిప్రాయం వెలువడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన పెద్దన్న, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే అవకాశాలు కొట్టిపారేయలేం అనే మాట కూడా వినిపిస్తుంది. 

Also read Annaatthe(Peddanna): రజనీ 'పెద్దన్న' మూవీ ట్విట్టర్ రివ్యూ.. అసలైన మజా అదే

Also read బాడీ మేకోవర్‌తో షాకిస్తున్న వరుణ్‌ తేజ్‌.. కండలు తిరిగిన దేహానికి ఫ్యాన్స్ ఫిదా

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved