MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రజనీకాంత్ రిజెక్ట్ చేసిన చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన కమల్ హాసన్, ఆ మూవీ ఏంటంటే ?

రజనీకాంత్ రిజెక్ట్ చేసిన చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన కమల్ హాసన్, ఆ మూవీ ఏంటంటే ?

సినిమాలో పోలీసుల దగ్గర దెబ్బలు తినే సీన్ ఉంది. నేను దెబ్బలు తినే సీన్‌లో నటిస్తే నా ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పాడట. కమల్ చాలా సినిమాల్లో దెబ్బలు తినే సీన్స్‌లో నటించాడు కాబట్టి అతనికి ఈ సినిమా సూట్ అవుతుందని కమల్‌కు ఫోన్ చేసి నటించమని చెప్పాడట రజినీ.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 09 2025, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Rajinikanth Rejected Papanasam Movie : మలయాళంలో మోహన్‌లాల్ నటించిన దృశ్యం సినిమాను తమిళంలో కమల్ హాసన్ పాపనాశం పేరుతో తీసి హిట్టు కొట్టాడు. ఆ సినిమాలో నటించే ఛాన్స్ రజినీకాంత్ మిస్ చేసుకున్నాడట.

మలయాళంలో జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో మోహన్‌లాల్ నటించిన సినిమా దృశ్యం. 2013లో రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. దీన్ని తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనే కాకుండా చైనా, కొరియా లాంటి దేశాల్లో కూడా రీమేక్ చేశారు. కొరియన్ భాషలో రీమేక్ అయిన మొదటి ఇండియన్ సినిమాగా దృశ్యం నిలిచింది. ఈ సినిమాను తమిళంలో పాపనాశం పేరుతో తీశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పాపనాశం

పాపనాశం

దృశ్యం సినిమాను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ పాపనాశం సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. ఇందులో కమల్ హాసన్, గౌతమి, నివేదా థామస్ నటించారు. మలయాళంలో లాగే తమిళంలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత దృశ్యం రెండో పార్ట్‌ను 2021లో ఓటీటీలో రిలీజ్ చేశారు. మొదటి పార్ట్‌లాగే ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. త్వరలోనే మూడో పార్ట్ కూడా తీస్తామని చెప్పారు.

 

34
పాపనాశం సినిమాకు రజినీకాంత్ ఫస్ట్ ఛాయిస్

పాపనాశం సినిమాకు రజినీకాంత్ ఫస్ట్ ఛాయిస్

ఇంతలో దృశ్యం సినిమాను తమిళంలో పాపనాశం పేరుతో తీసే అవకాశం రజినీకాంత్‌కు వచ్చిందట. కానీ ఆయన ఎందుకు వద్దన్నారో నిర్మాత ధనుంజయన్ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పాపనాశం సినిమా నిర్మాత సురేష్ బాలాజీతో ధనుంజయ్ మాట్లాడుతూ రజినీతో ఈ సినిమా తీస్తే బాగుంటుందని ఐడియా ఇచ్చాడట. తర్వాత రజినీతో మాట్లాడటానికి ముందు సినిమా చూపించారట.

44
పాపనాశం సినిమాను రజినీకాంత్ రిజెక్ట్ చేశాడు

పాపనాశం సినిమాను రజినీకాంత్ రిజెక్ట్ చేశాడు

సినిమా చూసిన రజినీకాంత్‌కు నచ్చినా కూడా నటించడానికి ఒప్పుకోలేదట. ఎందుకంటే సినిమాలో పోలీసుల దగ్గర దెబ్బలు తినే సీన్ ఉంది. నేను దెబ్బలు తినే సీన్‌లో నటిస్తే నా ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పాడట. కమల్ చాలా సినిమాల్లో దెబ్బలు తినే సీన్స్‌లో నటించాడు కాబట్టి అతనికి ఈ సినిమా సూట్ అవుతుందని కమల్‌కు ఫోన్ చేసి నటించమని చెప్పాడట రజినీ. ఆ తర్వాత కమల్ హాసన్ నటించి పాపనాశం సినిమా బ్లాక్‌బస్టర్ అయిందని ధనుంజయన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తమిళ సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka -ShivaKumar: ప్రియాంకతో డెస్టినీ వెడ్డింగ్‌ రివీల్‌ చేసిన శివ కుమార్‌.. ఇప్పటి వరకు ఎవరూ అలా చేయలేదు
Recommended image2
Ramesh Babu: రమేష్‌బాబు సూపర్‌ స్టార్‌ అయ్యే ఛాన్స్ మిస్‌.. మహేష్‌ చేతుల మీదుగా ప్రారంభమై ఆగిపోయిన మూవీ ఏంటంటే?
Recommended image3
రజనీకాంత్ కు ఫస్ట్ సాంగ్ రాసింది ఎవరో తెలుసా? ఆల్ రౌండర్ సక్సెస్ స్టోరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved