రజనీకాంత్ `కూలీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. 1000 కోట్ల బ్లాక్ బస్టర్ లోడింగ్ ?
Rajinikanth Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న `కూలీ` సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. కోలీవుడ్ నుంచి ఫస్ట్ వెయ్యి కోట్ల సినిమా లోడ్ అవుతుందట.

Rajinikanth -Coolie
Rajinikanth Coolie:'వేట్టైయన్' తర్వాత, సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు 'కూలీ' మూవీలో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ భారీ కాస్టింగ్‌తో రూపొందుతుంది.
పూజా హెగ్డే స్పెషల్ సాంగ్
హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ఒక పాటలో మాత్రమే డ్యాన్స్ చేసింది. ఐటెమ్ సాంగ్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. దీనికోసం ఆమెకు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్.
ఫస్ట్ రివ్యూ చెప్పిన యాక్టర్ సందీప్ కిషన్
ఈ సినిమా గురించి యంగ్ హీరో సందీప్ కిషన్ తన ఫస్ట్ రివ్యూ చెప్పాడు. రజినీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తాను 45 నిమిషాల రష్ చూశాడట. తనకు గూస్ బంమ్స్ ఫీలింగ్ కలిగిందని, తన అంచనా ప్రకారం ఈ మూవీ వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ కాబోతుందని ఆయన తెలిపారు.
రజినీకాంత్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నాడు
సందీప్ కిషన్ చెప్పింది నిజమే అయితే కోలీవుడ్‌లో ఫస్ట్ వెయ్యి కోట్ల మూవీ `కూలీ` కాబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇది భారీ కాస్టింగ్‌తో రూపొందుతుంది. రజనీకాంత్‌తోపాటు నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ నటిస్తున్నారు. అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని సమాచారం.
రజినీకాంత్ 171వ సినిమా:
ఈ సినిమాలో రజినీకాంత్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నాడు. గోల్డ్ స్మగ్లింగ్ స్టోరీతో ఈ సినిమా వస్తోంది. రజినీకాంత్ కెరీర్‌లో ఇది 171వ సినిమా. దీని తర్వాత రజినీకాంత్, 'జైలర్ 2' సినిమాలో నటిస్తాడు.
read more: డైరెక్టర్‌కే 100 కోట్ల పారితోషికమా? ఇలా అయితే అల్లు అర్జున్ సినిమా కష్టమే? కథ మళ్లీ మొదటికి
also read: ప్రభాస్, ప్రశాంత్ వర్మ మూవీకి హీరోయిన్ ఫిక్స్.. రవితేజ హీరోయిన్‌తో డార్లింగ్ రొమాన్స్ ?