- Home
- Entertainment
- బాలకృష్ణ నో చెప్పిన స్క్రిప్ట్ తో హిట్ కొట్టిన రాజశేఖర్.. రాయలసీమ కథతో బాలయ్యకి డిజాస్టర్.. ఆ సినిమాలు ఇవే
బాలకృష్ణ నో చెప్పిన స్క్రిప్ట్ తో హిట్ కొట్టిన రాజశేఖర్.. రాయలసీమ కథతో బాలయ్యకి డిజాస్టర్.. ఆ సినిమాలు ఇవే
బాలకృష్ణ, రాజశేఖర్ ఒకప్పుడు పోటాపోటీగా సినిమాలు చేసి హిట్లు అందుకున్నారు. కానీ ఓ సినిమా విషయంలో బాలయ్య నో చెప్పగా, రాజశేఖర్ హిట్ కొట్టాడు.

బాలకృష్ణ స్క్రిప్ట్ నచ్చితే, డైరెక్టర్ నచ్చితే బ్లైండ్‌గా వెళ్లిపోతారు. దర్శకుడు ఏం చెబితే అది చేస్తాడు. మధ్యలో సినిమా అనుకున్నట్టే వస్తుందా? ట్రాక్ తప్పుతుందా అనేది పట్టించుకోరు. తనవంతుగా తను ఏం చేయాలో అది బెస్ట్ ఇస్తారు. సినిమా ఫలితాలను పట్టించుకోరు. అదే బాలయ్య ప్రత్యేకత.
Survey:వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
అయితే ఈ నిర్ణయం కొన్ని సార్లు ప్లస్ అవుతుంది. కానీ చాలా సార్లు మైనస్‌గా మారుతుంది. సినిమా ఎలా వస్తుందో అని చూసుకోకపోతే ఫలితాలు తేడా కొట్టే ప్రమాదం ఉంటుంది. బ్లైండ్‌గా దర్శకుడిని నమ్మడం కూడా కొన్ని సార్లు మిస్టేకే అవుతుంది.
ఇండస్ట్రీలో స్క్రిప్ట్ ని ఓ హీరో రిజెక్ట్ చేస్తే, మరో హీరో చేసి హిట్ కొట్టడం కామన్‌గా జరుగుతుంది. ఇలా కథలు చాలా మంది హీరోల చుట్టూ తిరుగుతాయి. చివరికి ఎవరో చేసి హిట్ కొట్టేస్తారు. కొన్ని సార్లు మిస్ ఫైర్ అవుతుంటాయి. బాలయ్య విషయంలోనూ అలా చాలానే జరిగాయి. కానీ ఒకటి మాత్రం ప్రధానంగా ఇప్పుడు చర్చకు వచ్చింది. అదే `సింహారాశి` మూవీ. మొదట ఈ స్క్రిప్ట్ బాలకృష్ణ వద్దుకు వెళ్లింది.
బాలకృష్ణ ఈ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేశాడు. తనకు సెట్ కాదని చెప్పేశాడట. దీంతో దర్శకుడు సముద్ర రాజశేఖర్ వద్దకు వెళ్లాడు. అప్పుడు రాజశేఖర్ టాప్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. కెరీర్ పరంగా పీక్‌లో ఉన్నాడు. ఈ స్క్రిప్ట్ ఆయన ఓకే చేశారు. సూర్య ప్రకాష్ కథ అందించిన ఈ మూవీకి పరుచూరి బ్రదర్స్ రైటర్స్ గా పనిచేశారు. వి సముద్ర దర్శకత్వం వహించారు. 2001లో విడుదలైన ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. ఇది తమిళ మూవీ `మాయి`కి రీమేక్ కావడం విశేషం. సో ఇలా రీమేక్ అని నో చెప్పి మంచి హిట్‌ని మిస్ చేసుకున్నాడు బాలయ్య. రాజశేఖర్ కి హిట్ పడింది.
అదే సమయంలో బాలకృష్ణ రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీతో `పల్నాటి బ్రహ్మనాయుడు` మూవీ ఒప్పుకున్నాడు. ఆయనకు ఆ టైమ్ లో రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీలు బాగా ఆడుతున్నాయి. హిట్ ఫార్ములాగానూ నిలిచాయి. `సమరసింహారెడ్డి`, `నరసింహా నాయుడు` వంటి చిత్రాలు ఇదే కాన్సెప్ట్ తో వచ్చి పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆ కోవలోనే `పల్నాటి బ్రహ్మనాయుడు` మూవీ చేశాడు. లేట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యింది.