- Home
- Entertainment
- సుమన్ చేయాల్సిన సినిమాల వల్లే రాజశేఖర్ స్టార్ అయ్యాడా? పచ్చి నిజాలు చెప్పిన స్టార్ హీరో
సుమన్ చేయాల్సిన సినిమాల వల్లే రాజశేఖర్ స్టార్ అయ్యాడా? పచ్చి నిజాలు చెప్పిన స్టార్ హీరో
Hero Suman: సుమన్ చేయాల్సిన సినిమాలతోనే రాజశేఖర్ విజయాలు అందుకుని స్టార్ అయ్యాడనే కామెంట్ అప్పట్లో బాగా వినిపించిందట. దీనిపై తాజాగా సుమన్ స్పందించారు. అసలు నిజం ఏంటో ఆయన వెల్లడించారు.

సుమన్ వల్లే రాజశేఖర్ స్టార్
హీరో సుమన్ ఒకప్పుడు చిరంజీవికే కాదు, చాలా మంది హీరోలకు పోటీ ఇచ్చారు. అందానికి అందం, హైట్ పర్సనాలిటీ ఉండటంతో ఈజీగా అందరిని ఎట్రాక్ట్ చేశారు. పైగా వరుసగా ఫ్యామిలీ, యాక్షన్ చిత్రాలతో మెప్పించారు. సుమన్ సినిమాల్లో మంచి డ్రామా ఉంటుంది. అది అందరిని ఆకట్టుకునేది. దీనికితోడు అదిరిపోయే యాక్షన్ సీన్లు కూడా ఉండేవి. అవి మాస్ ఆడియెన్స్ ని బాగా ఉర్రూతలూగించేవి. దీంతో 1980, 90లో సుమన్ సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేసేవి. పెద్ద విజయాలు కూడా సాధించాయి. దీంతో అప్పట్లో సుమన్‌ని చాలా మంది కాంపిటీషన్‌గా భావించేవారు. అంతేకాదు ఆయన వల్లే రాజశేఖర్ స్టార్ అయ్యాడనే కామెంట్ కూడా ఉంది.
సుమన్ కెరీర్‌ని బాగా దెబ్బకొట్టింది అదే
సుమన్ కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఆయన్ని వివాదాలు వెంటాడాయి. బ్లూ ఫిల్మ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆరు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత నిర్దోశిగా బయటకు వచ్చారు. తనపై కొందరు కుట్ర చేశారనేది స్పష్టమైంది. ఎంతటి ఆరోపణలతో ఆయన జైలుకి వెళ్లారో, అంతే క్లీన్‌గా బయటకు వచ్చారు. కానీ ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగింది. ఆయన సినిమా కెరీర్‌పై ప్రభావం పడింది. గతంలో మంచి సినిమాలు రాలేదు. పెద్ద విజయాలు దక్కలేదు. కొన్ని ఫర్వాలేదనిపించాయి. కానీ ఆయన రేంజ్ మూవీస్ కాదు. అదే సుమన్ కెరీర్‌కి పెద్ద దెబ్బగా మారింది.
సుమన్‌కి బ్రేక్ రావడంతో రాజశేఖర్‌కి ఆఫర్లు
ఆ సమయంలో సుమన్‌కి బ్రేక్ రావడంలో ఆయన చేయాల్సిన సినిమాలు రాజశేఖర్‌కి వెళ్లాయట. అప్పుడే రాజశేఖర్ కూడా యాక్షన్ సినిమాలు చేస్తూ అలరిస్తుండటంతో నిర్మాతలు, దర్శకులు ఆయన వైపు మొగ్గుచూపారట. దీంతో వరుసగా యాక్షన్ సినిమాలు చేసి రాజశేఖర్ స్టార్ అయిపోయారు. టాలీవుడ్‌లో సూపర్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగారు. రాజశేఖర్ చేసిన యాక్షన్ సినిమాలన్నీ సుమన్ చేయాల్సినవే అని అప్పుడు చాలా మంది అనుకున్నారట. దీనిపై చాలా చర్చ కూడా జరిగిందట. అయితే దీనిపై తాజాగా సుమన్ స్పందించారు. ఈ విషయం తన వద్దకు కూడా వచ్చిందని తెలిపారు.
తాను ఈ స్థాయికి వస్తానని ఊహించలేదు
తాను సినిమా ఫీల్డ్ కి సంబంధం లేని వాడిని అని, సినిమా యాక్టర్ అవ్వాలని కూడా తాను అనుకోలేదని, యాక్టింగ్ కోర్స్ చేయడం గానీ, డాన్సులు, ఫైట్లు నేర్చుకోవడం గానీ చేయలేదు. అన్నీ అలా వచ్చాయి. బలవంతంగా సినిమా రంగంలోకి లాక్కొచ్చారని తెలిపారు. తనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ తప్ప ఏం తెలియదని, కానీ చేసుకుంటూ వచ్చానని, ఆ తర్వాత అదే వృత్తిగా మారిందని, విజయాలు వచ్చాయి. ఆదరించారు. ఈ స్థాయికి వచ్చానని చెప్పారు సుమన్. అయితే కొన్ని సార్లు ఎప్పుడూ ఇదేనా, రొటీన్ వర్క్ చేయాలా? ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదాం అనుకున్నాడట. కానీ అనుకునేలోపే ఓ పది సినిమాలు వచ్చేవి, వాళ్లు, వీళ్లు బలవంతం చేయడంతో ఒప్పుకునేవాడిని, అవి చేయడానికి కొన్నేళ్లు పట్టేది, మళ్లీ అనుకోవడం, మళ్లీ ఆఫర్స్ రావడం ఇలా 45ఏళ్లు గడిచిపోయాయని తెలిపారు సుమన్.
నా వల్లే రాజశేఖర్ స్టార్ అయ్యాడనేది నిజం కాదు
``సినిమా రంగం అనేది ఏ ఒక్కరిదో కాదు, ఇక్కడ అందరు వస్తుంటారు, పోతుంటారు. ఇదొక ఫ్లో. దాన్ని ఎవరూ ఆపలేరు, నేను ఎవరినీ అడ్డుకోలేను, అలాగే నన్నూ ఆపలేరు. టాలెంట్ ఉన్నవాళ్లు సర్వైవ్ అవుతారు, లేనివాళ్లు వెళ్లిపోతారు. అలాగే రాజశేఖర్ నా వల్లే హీరో అయ్యాడు, స్టార్ అయ్యాడనేది నేను నమ్మను. ఆయనకు ఆ సమయంలో అలాంటి సినిమాలు రావాల్సి ఉంది వచ్చాయి, దానికి నేను కారణం అవుతానని నేనెప్పుడూ అనుకోను` అని తెలిపారు సుమన్. ఈ సినిమా జర్నీ తనకు ఒక అదృష్టమని, ఇంత మంది అభిమానులను సొంతం చేసుకోవడం, తనని ఇంత మంది, ఇన్నేళ్లు ఆదరించడం ఇదొక మిరాకిల్ అని తెలిపారు సుమన్. ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారాయన.