ప్రభాస్ మొదటిసారి ఎమోషనల్ అయిన సందర్భం.. అమ్మలా మారిన అక్క
Prabhas: ప్రభాస్ మొదటిసారి తన ఫ్యామిలీ గురించి ఓపెన్ అయ్యారు. తన అక్కతో అనుబంధం గురించి చెప్పారు. అయితే మొదటిసారి తాను ఎమోషనల్ అయిన సందర్భంగా గురించి వెల్లడించారు డార్లింగ్.

ఫ్యామిలీ గురించి మొదటిసారి ఓపెన్ అయిన ప్రభాస్
డార్లింగ్ ప్రభాస్‌కి సిగ్గు ఎక్కువ. కొత్త వ్యక్తులతో అంత ఈజీగా మూవ్ కాలేరు. ఎక్కువగా మాట్లాడరు. అంతెందుకు ప్రెస్ మీట్లలో కూడా మైక్ తన వద్ద ఉంచుకోరు. పక్క వాళ్లకు ఇచ్చేస్తారు. మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక్కనిమిషం, రెండు నిమిషాల్లో తేల్చేస్తారు. అయితే ప్రభాస్ రిలేషన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. వ్యక్తిగతంగా చాలా స్ట్రాంగ్ పర్సన్. దేన్నైనా తట్టుకోగలరట. కానీ ఒక విషయంలో మాత్రం ఆయన కంట్రోల్ కాలేకపోయారట. ఆ విషయాన్ని ప్రభాస్ వెల్లడించారు. అంతేకాదు మొదటిసారి ఫ్యామిలీ గురించి ఓపెన్ అయ్యారు ప్రభాస్.
ప్రభాస్ అక్కనే అన్నీ చూసుకునేదట
ప్రభాస్.. కృష్ణంరాజు తమ్ముడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కొడుకు అనే విషయం తెలిసిందే. వీరు ముగ్గురు. ప్రభాస్‌కి అక్క, అన్నయ్య ఉన్నారు. తాను చిన్నవాడు కావడంతో ఇంట్లో అంతా గారాబం చేసేవారట. చిన్నప్పుడు అక్క తనకు అమ్మలా వ్యవహరించేదట. ప్రభాస్ నాన్న సినిమాలు, వ్యాపారంలో బిజీగా ఉండేవారు. తమది పెద్ద ఫ్యామిలీ కావడంతో వారిని చూసుకుంటూ అమ్మ బిజీగా ఉండేదట. దీంతో అక్కనే ప్రభాస్‌ని పట్టించుకునేదట. తనకు చదువు నేర్పించడం నుంచి మంచీ మర్యాదలు అన్నీ తనే చూసుకునేదట. తన ఫ్యామిలీలో అక్కది కీలక పాత్ర అని తెలిపారు ప్రభాస్. అమ్మానాన్న ఏదైనా విషయంపై చర్చించాలన్నా, అక్కతో చర్చించేవారని, అంతగా ఆమె బాధ్యత తీసుకునేదని చెప్పారు.
అల్లుడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ప్రభాస్ అక్కకి ఇద్దరు అబ్బాయిలు. `వర్షం` సినిమా సమయంలో పెద్దబ్బాయి పుట్టాడట. ఆ రోజుని తాను మాటల్లో చెప్పలేనని తెలిపారు. చాలా ఎమోషనల్ అయ్యారట. మామూలుగా అయితే తాను ఎమోషనల్ పర్సన్ కాను అని, కానీ ఆ రోజు వాడిని(అల్లుడుని) చూడగానే ఒళ్లు ఝల్లు మనిపించిందట. మూడు, నాలుగేళ్లు ఆలస్యంగా పుట్టినందువల్లనో, లేక అక్క కొడుకు అనే ప్రేమ వల్లనో అలా జరిగిందన్నారు ప్రభాస్. ఆ క్షణంలో తనకు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేనని తెలిపారు డార్లింగ్. ఆ తర్వాత అల్లుడు పెరిగి పెద్ద వాడయ్యాడు, `మామయ్యా` అని పిలిచాడు, కానీ అప్పుడు ఏమనిపించలేదుగానీ, పుట్టినప్పుడే తాను ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయినట్టు తెలిపారు ప్రభాస్.
ఇంటికి పెద్ద దిక్కుగా బావ
ఇక రెండో అల్లుడు `మిస్టర్ పర్‌ఫెక్ట్` సినిమా సమయంలో జన్మించాడట. అతను చాలా అల్లరివాడు అని తెలిపారు. ఈ సందర్భంగా తన బావ గురించి చెబుతూ తన ఫ్యామిలీలో బావ విజయ్ ది కీలక పాత్ర అని, నాన్నగారు ఉన్నప్పుడు కూడా చాలా బాధ్యతగా ఉండేవారట. నాన్న మరణం తర్వాత కూడా ఎంతో బాధ్యతగా తీసుకున్నారట. తమ ఫ్యామిలీకి పెద్ద దిక్కులా ఉండేవారట. తన కుటుంబంలో పెద్ద వాళ్లని గౌరవించడం చిన్నప్పుడే నేర్పించారని, అన్నని కూడా అండీ అని పిలవమని చెప్పేవారని, అలాంటి పద్ధతులు ఎంతో బాగుంటాయని, తానే కాదు, వచ్చే తరాలు కూడా దీన్ని పాటించాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు ప్రభాస్. గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. డార్లింగ్ రేపు గురువారం తన 45వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న విషయం తెలిసిందే.