- Home
- Entertainment
- Pawan Kalyan Net Worth: పవన్ కల్యాణ్ ఆస్తులు, లగ్జరీ కార్లు, పవర్ స్టార్ లైఫ్ స్టైల్ గురించి మీకు తెలుసా?
Pawan Kalyan Net Worth: పవన్ కల్యాణ్ ఆస్తులు, లగ్జరీ కార్లు, పవర్ స్టార్ లైఫ్ స్టైల్ గురించి మీకు తెలుసా?
Pawan Kalyan Net Worth 2026: అన్నా కొణిదెల నుంచి పవన్ కల్యాణ్ విడిపోతున్నారనే వార్తలతో ఆయన వ్యక్తిగత జీవితం మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తెలుగు సూపర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆస్తులు, కార్ల కలెక్షన్, నికర ఆస్తుల విలువ వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం.

పవన్ కల్యాణ్ ఆస్తుల విలువెంత?
13 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం వ్యక్తిగత జీవితం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. విడిపోవడానికి గల కారణాలను వారు చెప్పకపోయినా, ఈ జంట సంయుక్త ప్రకటనతో పెద్ద చర్చే జరుగుతోంది.
సక్సెస్ ఫుల్ సినీ కెరీర్, రాజకీయ బాధ్యతలతో పాటు పవన్ కల్యాణ్ కు భారీగా ఆస్తులు, సూపర్ కార్ల కలెక్షన్ కూడా ఉంది. లగ్జరీ ఎస్ యూవీల నుంచి ప్రీమియం కార్ల వరకు ఈ యాక్టర్-పాలిటీషియన్ దగ్గర ఎన్నో ఖరీదైన వాహనాలున్నాయి. ఆయన నెట్ వర్త్, ఆస్తులు, కార్ల కలెక్షన్ వివరాలు ఏంటంటే.
పవన్ కల్యాణ్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచన. అయితే ఆయన ప్రస్తుత వ్యక్తిగత నెట్ వర్త్ ను ధ్రువీకరించే పబ్లిక్ ఫిగర్ ఏదీ లేదు.
ఏపీలోని పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన దాఖలు చేసిన 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, పవన్ కల్యాణ్ తన కుటుంబ ఆస్తుల విలువ దాదాపు రూ.164.53 కోట్లుగా ప్రకటించారు. కాగా దాదాపు రూ.65.77 కోట్ల అప్పులున్నాయి.
ఆయన ప్రకటించిన ఆస్తుల్లో చరాస్తులు, స్థిరాస్తులు ఉన్నాయి. 2018-19 నుంచి 2022-23 వరకు ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.60.77 కోట్ల ఆదాయాన్ని ఈ యాక్టర్-పాలిటీషియన్ చూపించారు.
అఫిడవిట్ లెక్కల ప్రకారం, ఆయన ప్రకటించిన కుటుంబ ఆస్తుల నుంచి అప్పులు తీసేస్తే సుమారు రూ.98.77 కోట్లు ఉంటుంది. అయితే ఇది ఆయన ప్రస్తుత వ్యక్తిగత నెట్ వర్త్ మాత్రమే.. ఎందుకంటే ఆస్తుల ప్రకటనలో కుటుంబ ఆస్తులు కూడా కలిపి ఉన్నాయి.
తెలుగు సినిమాలు, ప్రొడక్షన్ యాక్టివిటీస్, పెట్టుబడులు, తన ప్రొఫెషనల్ పనుల పలు మార్గాల ద్వారా ఆయనకు ఆదాయం వస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకున్న క్రేజ్ తో సౌత్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ ఉన్న స్టార్లలో ఒకరిగా నిలిచారు.
రేంజ్ రోవర్ నుంచి మెర్సిడెస్ బెంజ్ వరకు
పవన్ కల్యాణ్ దగ్గర సూపర్ కార్ల కలెక్షన్ ఉంది. ఇందులో ఎన్నో ప్రీమియం, లగ్జరీ వాహనాలున్నాయి. 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఆయన దగ్గర 11 వాహనాలున్నాయి. ఇందులో తొమ్మిది కార్లు, ఒక పికప్ ట్రక్, ఒక హార్లీ-డేవిడ్ సన్ మోటార్ సైకిల్ ఉన్నాయి.
పవన్ గ్యారేజ్ లో కొన్ని ముఖ్యమైన వాహనాలు
- రేంజ్ రోవర్ స్పోర్ట్: ఆయన కలెక్షన్ లో ఉన్న అత్యంత ఖరీదైన ఎస్ యూవీల్లో ఇదొకటి. అఫిడవిట్ ప్రకారం దీని విలువ సుమారు రూ.2.42 కోట్లు.
- టయోటా ల్యాండ్ క్రూయిజర్: ప్రకటన ప్రకారం సుమారు రూ.5.47 కోట్ల విలువైన ప్రీమియం ఎస్ యూవీ.
- టయోటా వెల్ ఫైర్: సుమారు రూ.2.53 కోట్ల విలువైన లగ్జరీ ఎంపీవీ.
- మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ ఎస్-క్లాస్ 560: ఒక ప్రీమియం లగ్జరీ సెడాన్.
- జీప్ రాంగ్లర్: హై-ఎండ్ ఆఫ్ రోడ్ ఎస్ యూవీ.
- మహీంద్రా స్కార్పియో ఎస్ 11: ఆయన కలెక్షన్ లో రెండు స్కార్పియో ఎస్ యూవీలు కూడా ఉన్నాయి.
- మెర్సిడెస్-బెంజ్ ఆర్-క్లాస్ 350: ఆయన ప్రకటించిన జాబితాలో ఉన్న మరో లగ్జరీ వాహనం.
- ఆడి క్యూ 7: తన తల్లి బహుమతిగా ఇచ్చినట్లు చెబుతున్న ఒక పాత వాహనం.
- టాటా యోధా: ఆయన ప్రకటించిన వాహనాల జాబితాలో ఉన్న పికప్ ట్రక్.
పవన్ కళ్యాణ్ దగ్గర ఒక హార్లీ-డేవిడ్ సన్ మోటార్ సైకిల్ కూడా ఉంది.
పవన్ కళ్యాణ్ ఆస్తుల వివరాలు
సినిమా సంపాదన, ఆటోమొబైల్ కలెక్షన్ తో పాటు ప్రాపర్టీ, ఇతర ఆస్తుల్లోనూ పవన్ కల్యాణ్ కు భారీగా పెట్టుబడులున్నాయి.
2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఆయన ప్రకటించిన చరాస్తులు, స్థిరాస్తులతో పాటు కుటుంబ ఆస్తుల విలువ సుమారు రూ.164.53 కోట్లు. ఈ ప్రకటనలో ఆయన స్థిరాస్తుల వాటానే ఎక్కువ.
తెలంగాణలోని జన్వాడ గ్రామంలో ఉన్న ప్రాపర్టీతో సహా సుమారు రూ.10.42 కోట్ల విలువైన 18.02 ఎకరాల భూమి ఉన్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
బ్యాంకు డిపాజిట్లు, నగలు, బంగారం, ఇతర విలువైన వస్తువులు కూడా ఆయన ఆర్థిక ప్రకటనలో ఉన్నాయి. అఫిడవిట్ లోని ఆస్తుల్లో సుమారు 1,680 గ్రాముల బంగారం, 114 క్యారెట్ల వజ్రాభరణాలు ఉన్నాయి.
తెలుగు సినిమాలో దశాబ్దాల కెరీర్ తో పవన్ కల్యాణ్ బలమైన ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఆయన పబ్లిక్ ప్రొఫైల్ కు మరో కోణాన్ని జోడించింది. దీంతో ఆయన ప్రొఫెషనల్, వ్యక్తిగత జీవితంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.













