మహేష్ బాబు చేత సిక్స్ ప్యాక్ చూపించబోతున్నాను రాజమౌళి, జక్కన్న కోసం మరో సెంటిమెంట్ కు బ్రేక్
మహేష్ బాబుతో మరో సెంటిమెంట్ బ్రేక్ చేయించబోతున్నాడట రాజమౌళి. ఇప్పటికే జక్కన్న కోసం ఓ త్యాగం చేసిన సూపర్ స్టార్ మరో షాకింగ్ పనికి రెడీ అయ్యాడట.
ఎట్టకేలకు మహేష్ బాబు - రాజమౌళి సినిమా స్టార్ట్ అయ్యింది. రీసెంట్ గా ఈమూవీ ఓపెనింగ్ చాలా సింపుల్ గా జరిగింది. అంత భారీ బడ్జెట్ తో పెద్ద స్థాయిలో తెరకెక్కుతున్న ఈసినిమా ఓపెనింగ్ ను చాలా సింపుల్ గా ఏమాత్రం హంగు ఆర్బాటాలు లేకుండా చేశాడు జక్కన్న. ఆయన ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందో ఏం ప్లాన్ చేస్తారో చెప్పడం కష్టం. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబును చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నాడు రాజమౌళి.
ఇక రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబులో చాలా మార్పు కనిపిస్తోంది. ఆయన కొన్నేళ్ళుగా పాటిస్తున్న కొన్ని సెంటిమెంట్స్ ను బ్రేక్ చేశాడు మహేష్. మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఎంత పెద్ద సినిమా అయినా.. తన సినిమా ఓపెనింగ్ కు రాడు. తన సినిమా ఓపెనింగ్ కు తాను వస్తే.. ఆసినిమా ప్లాప్ అవుతుందని మహేష్ బాబు కు సెంటిమెంట్. దాంతో చాలా ఏళ్లుగా తన సినిమా ఓపెనింగ్ కు హాజరవ్వకుండా స్కిప్ చేస్తూ వస్తున్నాడు.
ఇక రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తుండటంతో.. మహేష్ వస్తాడా రాడా అని చాలా కాలంగా ఇండస్ట్రీ అంతా చాలా క్యూరియాసిటీతో ఎదురు చూసింది. ఇక చాలామంది అనుకన్నట్టుగానే మహేష్ బాబు తన అన్నేళ్ల సెంటిమెంట్ ను బ్రేక్ చేసి.. ఈసినిమా ఓపెనింగ్ కు అంటెండ్ అయ్యారు. అంతే కాదు ఓపెనింగ్ లో మహేష్ బాబు లుక్స్ అదిరిపోయాయి. కుర్రహీరోలు కుళ్లుకునేలా.. అమ్మాయిల మనసుల్లో మరోసారి రాజకుమారుడు అనిపించుకున్నాడు మహేష్.
ఇక ఇలా రాజమౌళి సినిమా కోసం ఓ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన ఆయన.. మరో సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేయడానికిరెడీ అయ్యాడట. అది అందరికి తెలిసిందే.. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా.. ఏ సినిమాలో కూడా షర్ట్ విప్పలేదు. బాడీని ఎక్స్ పోజ్ చేయలేదు. అలా చేయకుండానే ఆయన సూపర్ స్టార్ రేంజ్ కు వచ్చాడు. ఇక సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాకోసం బాడీ పెంచిన మహేష్ బాబు.. ఆసినిమాలో కూడా షర్ట్ విప్పలేదు.
కాకపోతే కాస్త స్లీవ్ లెస్ లో కండలు చూపించాడు కాని.. సిక్స్ ప్యాక్ చూపించలేదు. ఇక ఈసారి రాజమౌళితో చేయబోయే సినిమా పాన్ వరల్డ్ కాన్సెప్ట్ కావడం.. అడ్వెంచరస్ మూవీ కావడంతో పక్కాగా షర్ట్ విప్పాల్సిన పరిస్థితి. దాంతో మహేష్ బాబు ఈసినిమా కోసం మరో సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్నాడట. మహేష్ హైట్ కు.. పర్సనాలిటీ, కలర్ కు సిక్స్ ప్యాక్ చేస్తే.. హాలీవుడ్ హీరోలను మించి కనిపించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
నిజంగా మహేష్ బాబు కండలు చూపించే కార్యక్రమం జరిగితే.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవ్వడం ఖాయం. సినిమా కూడా ఓ రేంజ్ హిట్ అవుతుంది అంటున్నారు.ఇక ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందు అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈసారి 2000 కోట్ల మార్క్ ను ఈజీగా దాటేయడం ఖాయం అంటున్నారు. చూడాలి మరి ఈ కాంబో ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో.