- Home
- Entertainment
- చిరంజీవి కంటే నా హీరోనే నాకు ముఖ్యం, ఒక్క పాటకే వణికిపోయిన రాజమౌళి.. రాఘవేంద్రరావు ముందు సీక్రెట్ రివీల్
చిరంజీవి కంటే నా హీరోనే నాకు ముఖ్యం, ఒక్క పాటకే వణికిపోయిన రాజమౌళి.. రాఘవేంద్రరావు ముందు సీక్రెట్ రివీల్
మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలు తెరకెక్కించిన రాజమౌళి ఒక్క సాంగ్ విషయంలో చాలా టెన్షన్ పడ్డారట. రాఘవేంద్ర రావుతో ఆ పాట వెనకున్న కష్టం గురించి రాజమౌళి మాట్లాడారు.

రాజమౌళి పుట్టినరోజు
దర్శకధీరుడు రాజమౌళి నేడు అక్టోబర్ 10న తన 52వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమాని ప్రపంచస్థాయిలో నిలబెట్టిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. రాజమౌళి పుట్టినరోజు కావడంతో ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారీ బడ్జెట్ లో మగధీర
రాజమౌళి తన కెరీర్ లో తీసుకున్న తొలి పెద్ద ఛాలెంజ్ మగధీర మూవీ. మగధీర చిత్రం అప్పటికి టాలీవుడ్ లో ఎవ్వరూ ఊహించలేనంత భారీ బడ్జెట్ లో రూపొందింది. మగధీర ముందు వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ చిత్రాల రేంజ్ కూడా 30 నుంచి 40 కోట్లు మాత్రమే. అలాంటిది ఏకంగా మగధీర బడ్జెట్ కోసమే 40 కోట్లు వెచ్చించడం అంటే మామూలు విషయం కాదు. అంత బడ్జెట్ పెట్టినప్పటికీ మగధీర చిత్రం డబుల్ ప్రాఫిట్స్ తీసుకువచ్చి టాలీవుడ్ చరిత్రలోనే అప్పటికి అతిపెద్ద విజయంగా నిలిచింది.
మగధీరలో బంగారు కోడిపెట్ట సాంగ్
ఈ మూవీ చిత్రీకరణ సమయంలో రాజమౌళి చాలా టెన్షన్ పడ్డారట. రాజమౌళి ఎక్కువగా టెన్షన్ పడింది బంగారు కోడిపెట్ట సాంగ్ కే అని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాఘవేంద్ర రావు, రాజమౌళి కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూ అది. చిరంజీవి, రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో తెరకెక్కిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ఘరానామొగుడు మూవీలోనిది ఆ పాట. రాజమౌళి మాట్లాడుతూ.. ''తెలుగులో బెస్ట్ మాస్ సాంగ్స్ లో బంగారు కోడిపెట్ట సాంగ్ ఒకటి. చిరంజీవి గారి సాంగ్ కావడంతో రాంచరణ్ కోసం రీమిక్స్ చేస్తే బావుంటుంది అని అంతా అనుకున్నాం.
ఒక్క పాటకే వణికిపోయిన రాజమౌళి
రీమిక్స్ సాంగ్ కాబట్టి సులభంగా షూట్ చేయొచ్చు అని అనుకున్నా. కానీ దిగిన తర్వాతే లోతెంతో తెలిసింది. చిరంజీవి గారు డ్యాన్స్ ని ఎంజాయ్ చేసినంతగా ఇంకెవరూ ఎంజాయ్ చేశారు. అందుకే ఆయన మామూలు స్టెప్ వేసినా 10 రెట్లు బావుంటుంది.. మంచి స్టెప్ వేస్తే 100 రెట్లు బావుంటుంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ చాలా కష్టపడ్డారు. రాంచరణ్ బాగా ప్రాక్టీస్ చేశాడు. అయినప్పటికీ షూట్ చేస్తుంటే చిరంజీవి గారి స్టెప్పులే బావున్నాయి అని అనిపిస్తోంది. చిరంజీవి గారి డ్యాన్స్ మామూలు మ్యాజిక్ కాదు. దానిని మ్యాచ్ చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాం. నాకు టెన్షన్ పెరిగిపోతోంది. కానీ చివరికి జస్ట్ పాస్ మార్కులతో గట్టెక్కాం'' అని రాజమౌళి అన్నారు.
చిరంజీవి కంటే నా హీరోనే ముఖ్యం
దీని గురించి రాఘవేంద్ర రావు రియాక్ట్ అవుతూ.. పాస్ మార్కులతో పాసవడం కాదు చాలా బాగా చేశారు. రాజమౌళి కమిట్మెంట్ బావుంది. రాంచరణ్ తో ఐరన్ బాల్ పై డ్యాన్స్ చేయించి చిరంజీవి కన్నా హైలైట్ అయ్యేలా చేశారు అని రాఘవేంద్ర రావు అన్నారు. రాజమౌళి తిరిగి స్పందిస్తూ.. చిరంజీవి గారి డ్యాన్స్ నాకు ఇష్టమైనప్పటికీ.. నా హీరో రాంచరణే నాకు ముఖ్యం అని రాజమౌళి తేల్చి చెప్పారు.