- Home
- Entertainment
- ఓటీటీలోకి వచ్చేసిన వార్ 2, క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత ? మొత్తం ఎన్ని కోట్లు పోయాయో తెలుసా
ఓటీటీలోకి వచ్చేసిన వార్ 2, క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత ? మొత్తం ఎన్ని కోట్లు పోయాయో తెలుసా
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. దీనితో థియేట్రికల్ రన్ ముగిసినట్లే. ఈ నేపథ్యంలో వార్ 2 క్లోజింగ్ కలెక్షన్స్ వైరల్ అవుతున్నాయి. వార్ 2 తో ఏమేరకు నష్టాలు ఏర్పడ్డాయో ఈ కథనంలో తెలుసుకోండి.

ఓటీటీలోకి వచ్చేసిన వార్ 2
యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 9 గురువారం అంటే నేటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని రూపొందించారు. టైగర్ ష్రాఫ్, హృతిక్ నటించిన వార్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనికి సీక్వెల్ అయిన వార్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆగస్టు 14న రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ రిజల్ట్ సొంతం చేసుకుంది.
అన్ని భాషల్లో నిరాశే
పాన్ ఇండియా మూవీగా రిలీజైన వార్ 2 కి ఏ భాషలోనూ సరైన ఆదరణ లభించలేదు. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కావడంతో బుల్లితెరపై ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో వార్ 2 మూవీ థియేట్రికల్ క్లోజింగ్ కలెక్షన్స్ వైరల్ అవుతున్నాయి.
భారీ నష్టాలు
తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 థియేట్రికల్ హక్కులని నాగవంశీ దాదాపు 90 కోట్లకు కొనుగోలు చేశారు. కానీ వార్ మూవీ ఫుల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల లోపే వసూళ్లు రాబట్టింది. అంటే దాదాపు 40 కోట్ల వరకు నష్టాలు తప్పలేదు. ఇక వరల్డ్ వైడ్ గా వార్ 2 థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 300 కోట్లు. కనీసం 200 కోట్ల షేర్ కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. దీనితో వరల్డ్ వైడ్ గా 100 కోట్లకి పైగా లాస్ ఏర్పడింది.
మెప్పించలేకపోయిన యాక్షన్
ఈ మూవీలో కియారా అద్వానీ కీలక పాత్రలో నటించింది. వార్ 2 మూవీ ఆడియన్స్ కి యాక్షన్ ఫీస్ట్ లా ఉంటుంది అనుకున్నారు. కానీ ఆ యాక్షన్ సన్నివేశాలే మరీ అతిగా అనిపించాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో కూడా ఈ మూవీ ఫెయిల్ అయింది.
నిరాశ పరిచిన ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ
ఎన్టీఆర్ పాత్రని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసి ఉంటే తెలుగు వర్షన్ లో కలెక్షన్స్ అదిరిపోయేవి. కానీ డైరెక్టర్ ఆ అవకాశాన్ని కూడా చేజార్చుకున్నారు. జూనియర్ వార్ 2 చిత్రానికి గాను 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ పూర్తిగా నిరాశపరిచింది. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు.