- Home
- Entertainment
- కృష్ణ, శోభన్ బాబు మధ్యలోనే వదిలేయడంతో ఆస్తి మొత్తం కోల్పోయిన హీరో.. కట్ చేస్తే వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యం
కృష్ణ, శోభన్ బాబు మధ్యలోనే వదిలేయడంతో ఆస్తి మొత్తం కోల్పోయిన హీరో.. కట్ చేస్తే వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యం
సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు గతంలో ఓ కంపెనీలో బిజినెస్ పార్ట్నర్స్ గా ఉన్నారు. ఆ కంపెనీ నుంచి వీరిద్దరూ తెలివిగా తప్పించుకోవడంతో మరో హీరో అప్పుల్లో కూరుకుపోయి ఆస్తి మొత్తం కోల్పోయారు.

వ్యాపారాల్లో రాణించిన కృష్ణ, శోభన్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు అప్పట్లో పోటాపోటీగా సినిమాలు చేసేవారు. అనేక మల్టీస్టారర్ చిత్రాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించిన సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టేవారు. కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ కేవలం హీరోగా వచ్చే రెమ్యునరేషన్ పై మాత్రమే ఆధారపడలేదు. వ్యాపారాల్లో సైతం రాణించాలని అనుకున్నారు. దీనికోసం కృష్ణ సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. సొంతంగా స్టూడియో స్థాపించారు. అనేక చిత్రాలు నిర్మించారు.
బిజినెస్ పార్ట్నర్స్ గా కృష్ణ, శోభన్ బాబు
శోభన్ బాబు మాత్రమే అప్పట్లోనే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకున్నారు. తన సంపాదనని శోభన్ బాబు చెన్నైలో ల్యాండ్స్ కొనడంపై ఇన్వెస్ట్ చేసేవారు. భూమి ధర అంతకంతకూ పెరుగుతూనే ఉంటుందని శోభన్ బాబు అప్పట్లోనే పసిగట్టారు. అందుకే శోభన్ బాబు ఉన్నన్ని ఆస్తులు అప్పట్లో ఇంకెవరికీ ఉండేవి కాదు. అప్పట్లో కృష్ణ, శోభన్ బాబు కలిసి విజయవాడలోని ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పార్ట్నర్స్ గా జాయిన్ అయ్యారట.
తెలివిగా వదిలించుకున్నారు
వారి స్ఫూర్తితో మురళి మోహన్ కూడా ఆ కంపెనీలో పార్ట్నర్ గా జాయిన్ అయ్యారు. అక్కడ జరిగిన సంఘటనల గురించి మురళి మోహన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మురళి మోహన్ మాట్లాడుతూ.. 'ఈ కంపెనీ సరిగ్గా లేదని గ్రహించిన కృష్ణ, శోభన్ బాబు తెలివిగా ముందే డ్రాప్ అయ్యారు. నేను మాత్రం అలాగే ఉన్నాను. కానీ ఆ కంపెనీకి ఆదాయం ఎంత వస్తోంది, ఎలా నడుస్తోంది అని నేను ఎప్పుడూ అడగలేదు. కనీసం ఒక్క రూపాయి లాభం కూడా తీసుకోలేదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆఫీస్ కి వెళ్ళేవాడిని. నేను ఇక ఆ కంపెనీ నుంచి డ్రాప్ అయిపోదాం అని అనుకుంటున్న తరుణంలో ఓనర్ చనిపోయారు.
అప్పుల్లో కూరుకుపోయిన మురళి మోహన్
దీనితో పార్ట్నర్ గా ఉన్న నాపై ఆ కంపెనీ అప్పుల భారం పడింది. అప్పుల వాళ్లంతా నానా దగ్గరకు వచ్చారు. నాకు, మీకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కంపెనీ గురించి కూడా నాకు పూర్తిగా తెలియదు. అలాంటప్పుడు అప్పులు నేనెందుకు కట్టాలి అని అడిగాను. లేదు సర్, మీరు పార్ట్నర్ కదా.. కాబట్టి మీదే బాధ్యత అని అన్నారు. ఇక చేసేది లేక.. వడ్డీ కట్టలేను.. అసలు కూడా 50 శాతం మాత్రమే చెల్లిస్తాను. అంతకు మించి కట్టాలంటే నా వల్ల కాదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేశా. దీనితో వాళ్లు సరే అని 50 శాతానికి అంగీకరించారు.
కట్ చేస్తే వందల కోట్ల బిజినెస్ సామ్రాజ్యం
ఆ 50 శాతం అసలు చెల్లించడానికి కూడా నా సంపాదన మొత్తం కోల్పోయాను. అప్పులు కట్టడంతో నాకు చిల్లి గవ్వ కూడా మిగల్లేదు' అని మురళి మోహన్ అన్నారు. జస్ట్ పార్ట్నర్ గా ఉన్న పాపానికి మురళి మోహన్ ఆస్తులు మొత్తం కోల్పోయారు. కానీ వెనకడుగు వేయలేదు. సినిమాల్లో నటిస్తూ, నిర్మాతగా రాణిస్తూ సంపాదించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం మురళి మోహన్ వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత. ఆయనకి జయభేరి కన్ స్ట్రక్షన్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది.