MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టోరీ డిస్కషన్స్ లో తాను ఎక్కువ ఏమి తింటాడో చెప్పిన రాజమౌళి

స్టోరీ డిస్కషన్స్ లో తాను ఎక్కువ ఏమి తింటాడో చెప్పిన రాజమౌళి

డైరెక్టర్  రాజమౌళి పేరు వినగానే  'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'మగధీర' లాంటి సినిమాలే గుర్తొస్తాయి. ఇప్పుడు మహేష్ తో అదిరిపోయే సినిమా చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. అలాగే రాజమౌళి ఫ్యామిలీ గురించి చాలావరకు ప్రేక్షకులకు తెలుసు. 

2 Min read
Author : Surya Prakash
Published : Dec 16 2024, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rajamouli, rana daggubati show, baahubali

Rajamouli, rana daggubati show, baahubali


 హీరో రానా తాజాగా హోస్ట్​గా వ్యవహరిస్తున్న ది రానా దగ్గుబాటి టాక్ షో మెల్లి మెల్లిగా పాపులర్ అవుతోంది. ఇప్పటికే  నాని, సిద్ధు జొన్నలగడ్డ-శ్రీలీల, నాగచైతన్య తదితరులు పాల్గొన్న ఎపిసోడ్స్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. తాజాగా రాజమౌళి-రాంగోపాల్ వర్మతో మాట్లాడిన ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు.  

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ షోలో ఆయన తన సినిమా అలాగే పర్సనల్ విషయాలు గురించి మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన వన్ సైడ్ లవ్ స్టోరీ తో పాటు, తన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చెప్పుకొచ్చారు. తనకు ఇష్టమైన స్వీట్స్ గురించి చెప్పారు.

25
Rajamouli

Rajamouli

 
డైరెక్టర్  రాజమౌళి పేరు వినగానే  'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'మగధీర' లాంటి సినిమాలే గుర్తొస్తాయి. ఇప్పుడు మహేష్ తో అదిరిపోయే సినిమా చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. అలాగే రాజమౌళి ఫ్యామిలీ గురించి చాలావరకు ప్రేక్షకులకు తెలుసు. ఇప్పటివరకు వాళ్లు చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు రానా టాక్ షోలో పాల్గొని.. తన ఇంటర్మీడియట్ ప్రేమకథని బయటపెట్టాడు. అదే సమయంలో తనకు స్వీట్స్ పై ఉన్న మక్కువ ని వెల్లడించారు రాజమౌళి.

35

రాజమౌళి ఈ షోలో మాట్లాడుతూ..  సినిమాల తర్వాత ఆయనకు బాగా ఏదిష్టం అంటే తనకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమంటున్నాడు ఆన. తన ఫేవరెట్ స్వీట్ కూడా బయటపెట్టాడు. “స్వీట్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పట్నుంచి అలా అలవాటైపోయింది. బాగా ఆలోచిస్తున్నప్పుడు బ్రెయిన్ కు ఎక్కువ గ్లూకోజ్ (షుగర్) అవసరం అవుతుందంట. అందుకే స్టోరీ డిస్కషన్లలో ఎక్కువగా స్వీట్స్ తింటుంటాను. ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు స్వీట్ తినాలని పీకేస్తుంటుంది. మెత్తమెత్తగా ఉండే బ్రౌనీ, ఐస్ క్రీమ్ తో కలిపి తినడం చాలా ఇష్టం. అదే నా ఫేవరెట్ స్వీట్.” అన్నారు.

45


అలాగే ఈ స్వీట్స్ తో  పాటు బొబ్బట్లు అంటే కూడా రాజమౌళికి బాగా ఇష్టమని చెప్తున్నారు. కాకపోతే అవి తినటానికి కొన్ని  కండిషన్స్ చెబుతున్నాడు. “బొబ్బట్లు తెల్లగా ఉండకూడదు. డార్క్ బ్రౌన్ కలర్ లో ఉండాలి. మందంగా ఉండాలి, పైన పిండి సన్నగా ఉండాలి. మడతపెట్టి ఉండాలి.

ఓపెన్ చేస్తే లోపల మళ్లీ నెయ్యి, పంచదార కనిపించాలి.”అలా తింటే అద్భుతం అంటున్నాడు రాజమౌళి. ఇక రాజమౌళికి పెద్దగా నచ్చని స్వీట్ పూతరేకులు. తన ఫేవరెట్ స్వీట్స్ లో దీనిదే ఆఖరి స్థానం అంటున్నాడు. ఎందుకంటే, ఇందులో తీపి తక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. 
 

55


ఇక తనకు ఇష్టమైన సినిమాల గురించి చెప్తూ... మీ అందరికీ యాక్షన్‌తో ఉన్న సినిమాలను అందించే నాకు మాత్రం 'మిస్సమ్మ' లాంటి క్లాసిక్ అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో చాలా రొమాంటిసిజమ్‌ ఉంటుంది. చిన్నప్పుడు కొవ్వూరు లైబ్రరీలో అమర చిత్ర కథలను బాగా చదివేవాడిని. నా స్టోరీల్లో ఎక్కువగా ప్రతీకారాన్ని చూపిస్తాను. అదొక బలమైన భావోద్వేగం.

అన్యాయం జరిగినప్పుడల్లా, దానికి న్యాయం జరగకపోతే కోపం, బాధ, అవమానం కలుగుతాయి. అవన్నీ చాలా బలమైనవి. నేను, మా నాన్న కూర్చొన్నప్పుడు తండ్రీ కొడుకులమన్న విషయం మాకు అస్సలు గుర్తుండదు. ఓ రచయిత, ఓ డైరెక్టర్ అన్నట్లుగానే మా ఇద్దరి మధ్య చర్చ జరుగుతుంది. మా అబ్బాయి కార్తికేయతోనూ నేను అలాగే ఉంటా. తనొక ప్రొడ్యూసర్‌. నేనొక డైరెక్టర్. కానీ ఇంటికి వస్తే మాత్రం మామూలుగానే ఉంటాం అని చెప్పుకొచ్చారు.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: బైక్ కోసం తమ్ముడిని ఇరికేంచేసిన రాజు, ఇందును అవమానించిన ఐశ్వర్య
Recommended image2
Podarillu Today Episode మార్చి 18: మహాకు షాకిచ్చిన చక్రి, ఇలా అయితే వారికి విడాకులు రావడం కష్టమే
Recommended image3
Balakrishna: సింహం నవ్వడమేంటి? పిచ్చి కాకపోతే.. తండ్రి ఎన్టీఆర్‌తో చేసిన సినిమాపైనే బాలయ్య సెటైర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved