MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • చిరు, బన్నీ, తారక్ లకు పోటీగా మారుతున్న రాజమౌళి.. భార్య రమా రాజమౌళితో ప్రభుదేవా పాటకి డాన్స్.. వైరల్‌

చిరు, బన్నీ, తారక్ లకు పోటీగా మారుతున్న రాజమౌళి.. భార్య రమా రాజమౌళితో ప్రభుదేవా పాటకి డాన్స్.. వైరల్‌

రాజమౌళి దర్శకుడిగా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు. కానీ ఆయనలో మరో టాలెంట్‌ ఉంది. డాన్సులతో ఇరగదీయడంలోనూ ఆయన ముందుంటున్నారు. భార్యతో చేసిన రచ్చ వైరల్‌గా మారింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 11 2024, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్‌ సినిమా గర్వించదగ్గ దర్శకుడు. భారతీయ సినిమా రూపు రేఖలు మార్చిన దర్శకుడు. తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు. నో డౌట్‌ ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలో ఆయన్ని మించిన డైరెక్టర్ లేరని చెప్పొచ్చు. అలాంటి దర్శకుడు ఇప్పుడు తనలోని మరో టాలెంట్‌ని బయటపెట్టాడు. సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రాజమౌళి ఆ మధ్య ఓ ఈవెంట్‌లో డాన్స్ చేస్తూ కనిపించాడు. భార్య రమా రాజమౌళితో కలిసి స్టేజ్‌పై డాన్స్ చేయడం విశేషం. ఆ వీడియో వైరల్‌ అయ్యింది. ఇప్పుడు దాన్ని మించిన డాన్స్ పర్‌ఫెర్మ్ చేసి షాకిచ్చాడు. వాహ్‌ అనిపించాడు. తన భార్య రమా రాజమౌళితో కలిసి మరోసారి రెచ్చిపోయాడు రాజమౌళి. 
 

36

తాజాగా డాన్స్ రిహార్సల్‌ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో కొంత మంది డాన్సర్లు, తమ సన్నిహితులతో కలిసి ఆయన డాన్స్ రిహార్సల్‌ చేయడం విశేషం. ఇందులో రాజమౌళి డాన్సులు చూస్తుంటే మతిపోవాల్సిందే. పర్‌ఫెక్ట్ డాన్స్ మూమెంట్స్ తో అదరగొడుతున్నాడు. `ప్రేమికుడు` చిత్రంలోని `అందమైన ప్రేమరాణి` పాటకి డాన్స్ చేయడం విశేషం. ఈ వీడియో నెట్టింట రచ్చ లేపుతుంది. 
 

46

ఇది చూసిన నెటిజన్లు, సినీ అభిమానులు స్పందిస్తూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. రాజమౌళి డాన్సుల ముందు చిరంజీవి, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లు ఎక్కడ నిలబడతారు. జక్కన్న ముందు వాళ్లంతా దిగదుడుపే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మహేష్‌ బాబు తో చేసే సినిమాలో ఆయనకు డూప్‌ డాన్సర్ గా పనికొస్తాడని సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తంగా రాజమౌళి డాన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 
 

56

రాజమౌళి అపజయం లేని దర్శకుడు. ఆయన `స్టూడెంట్‌ నెం1`తో దర్శకుడిగా పరిచయమై ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. `సింహాద్రి`, `ఛత్రపతి`, `విక్రమార్కుడు`, `మగధీర`, `మర్యాద రామన్న`, `ఈగ`, `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌` ఇలా ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ, హీరోల స్థాయిని పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మహేష్‌ బాబు వంతు వచ్చింది. ఆయన్ని ఇంటర్నేషనల్‌ స్టార్‌గా మార్చే పనిలో ఉన్నాడని చెప్పొచ్చు. 

66
Rajamouli

Rajamouli

దర్శకుడు రాజమౌళి చివరగా `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంతో వచ్చారు. ఈ మూవీకి ఏకంగా ఆస్కార్‌ వరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్‌ బాబుతో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది. అది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. కానీ ఈ మూవీ కోసం మహేష్‌ వర్కౌట్స్ చేస్తూ బాడీని ఫిట్‌గా రెడీ అవుతున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image2
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image3
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved