- Home
- Entertainment
- రాజమౌళి జాతక రహస్యం, లగ్నంలో బుధుడు ఉండటం వల్ల ఏం జరుగుతుంది? జ్యోతిష్యుడు చెప్పిన జక్కన్న జాతకం
రాజమౌళి జాతక రహస్యం, లగ్నంలో బుధుడు ఉండటం వల్ల ఏం జరుగుతుంది? జ్యోతిష్యుడు చెప్పిన జక్కన్న జాతకం
టాలీవుడ్ ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి జాతకం ఎలా ఉందో తెలుసా? ఆయన జతక ప్రభావంతో ఏం జరగబోతోంది. జక్కన్న సినిమా తరువాత హీరోలకు ప్లాప్ ఎందుకు వస్తుంది? జోత్యీష్యుడు చెప్పిన రాజమౌళి జాతక రహస్యం ఏంటి?

దిగ్గజ దర్శకుడు
ఎస్ ఎస్ రాజమౌళి, టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ లో నిలబెట్టిన దర్శకుడు. బాలీవుడ్, కోలీవుడ్ ముందు ఎన్నో అవమానాలు ఫేస్ చేసిన తెలుగు సినీపరిశ్రమను ఆస్కార్ రేంజ్ లోకి తీసుకెళ్లిన దర్శకుడు. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అన్న పేరు తీసుకువచ్చిన దర్శకుడు. తెలుగు హీరోలను పాన్ ఇండియా స్టార్లుగా మార్చిన దర్శకుడు. టాలీవుడ్ మార్కెట్ ను వెయ్యి కోట్లకు తీసుకెళ్లిన దర్శకుడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. టాలీవుడ్ బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అని చెప్పవచ్చు. ఈరకంగా తెలుగు పరిశ్రమకు దేవుడిలా దొరికిన ఈదర్శకుడు ప్రస్తుతం హాలీవుడ్ ను టార్గెట్ చేసుకుని మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు.
రాజమౌళికి మాత్రమే సాధ్యం
కొన్ని సినిమాలు రాజమౌళికి మాత్రమే సాధ్యం. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్ లు కాదు, ఆయన హీరోలంతా స్టార్ హీరోలు కాదు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలతో ఎలాంటి హిట్లు ఇచ్చాడో నాని, నితిన్, సునిల్ లాంటి చిన్న హీరోలతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాడు రాజమౌళి. ఇప్పటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళికి పేరుతంది. రాజమౌళి ఏ హీరోను తీసుకున్నా, తన కథాబలంతో సినిమాను విజయం వైపు తీసుకెళ్తాడు. స్క్రీన్ ప్లేతో వెండితెరపై అద్భుతం చేగల సత్తా ఆయన సొంతం. అందుకే రాజమౌళి సినిమా అంటే హీరోలు కళ్లు మూసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటారు.
రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్
రాజమౌళితో సినిమా చేయాలంటే హీరోలకు పండగే. కానీ స్టార్ హీరోల ఫ్యాన్స్ లో మాత్రం ఓ భయం ఉంటుంది. రాజమౌళితో సినిమా అంటే ఆతరువాత చేసే ఆ హీరోకు డిజాస్టర్ పక్కా అనే సెంటిమెంట్ ఉంది. అది నిజమౌతూ ఉంది కూడా. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, నాని, నితిన్, రవితేజ్ లాంటి హీరోలకు రాజమౌళితో సినిమా చేసిన తరువాత వచ్చిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. అయితే రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ తరువాత ఆ సెంటిమెంట్ కాస్త బ్రేక్ అయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ కు ఆచార్య, గేమ్ ఛేంజర్ తో డిజాస్టర్ సినిమాలు పడ్డాయి. కాని ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయ్యిందా లేదా తెలియదు కానీ. మహేష్ బాబు ఫ్యాన్స్ లో కాస్త సంతోషం, కాస్త భయం ఉన్నాయి.
రాజమౌళి జాతకంలో ఏముంది
రాజమౌళి ఒక సినిమా చేస్తే.. అది ఆయనకు బాగా కలిసి వస్తుంది. 10 పైసలు పెడితే పది రూపాయల లాభం తెచ్చిపెడుతుంది. అది రాజమౌళి జాతక ప్రభావం అంటున్నాడు ప్రముఖ సినిమా జ్యోతీష్య నిపుణులు వేణు స్వామి. అవును ఆయన గతంలో చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయం వెల్లడించారు. రాజమౌళికి లగ్నంలో బుదుడు ఉండటం వల్ల ఆయన ఏ సినిమా చేసినా కలిసి వస్తుంది. కాని ఆయనతో సినిమా చేసినవారికి మాత్రం చెప్పలేము అన్నారు. రాజమౌళికి మాత్రమే ఏ సినిమాను అయినా సక్సెస్ వైపు తీసుకెళ్లే యోగం ఉంది. అలాంటి సినిమాలు ఇంకెవరైనా తీస్తే అవిడిజాస్టర్ అవ్వక తప్పదట. ఈ విషయాన్ని వేణు స్వామి వెల్లడించారు.
రాజమౌళి హవా ఎంత వరకూ..
రాజమౌళి ఇలా ఎన్ని సినిమాలు చేసినా ఆయనకు ఆ యోగం ఉందని వేణు స్వామి అన్నారు. ఇంకా పదైళ్లైనా ఆయన జాతకంలో తిరుగు ఉండదన్నారు. ఆయనతో చేసిన హీరోల పరిస్థితి ఎలా ఉన్నా.. రాజమౌళికి మాత్రం ఎంత డబ్బు పడితే అంతకు పదిరెట్లు లాభం వస్తుందన్నారు. అప్పట్లో ఈ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నాడు రాజమౌళి. దాదాపు 1000 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమా షూటింగ్ రీసెంట్ గా కెన్యా షెడ్యును ను కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో లాంగ్ షెడ్యుల్ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.