- Home
- Entertainment
- 4 వ తరగతి చదివి, 450 సినిమాల్లో నటించిన తోపు తెలుగు హీరోయిన్, అనుమానస్పదంగా మరణించిన నటి ఎవరో తెలుసా?
4 వ తరగతి చదివి, 450 సినిమాల్లో నటించిన తోపు తెలుగు హీరోయిన్, అనుమానస్పదంగా మరణించిన నటి ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్నంత వరకే పట్టించుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల పరిస్థితి చెప్పలేము. ఒకప్పుడు స్టార్ గా వెలుగు వెలిగిన ఒక హీరోయిన్ కేవలం 4 వ తరగతి చదివి, 450 సినిమాల్లో నటించిన హీరోయిన్ , అనుమానస్పదంగా మరణించిన నటి ఎవరో తెలుసా?

4 వ తరగతి చదివి, 450 సినిమాల్లో
ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఎంత ఉన్నా.. కొంత మంది హీరోయిన్ల పరిస్థితి ఆ కాలంలో దారుణంగానే ఉండేది. భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటూ బిజీ స్టార్ గా ఉన్నా కానీ,. ఐటమ్ గర్ల్ అంటూ ట్యాగ్ లైన్ వేయడంతో, స్టార్ హీరోయిన్ల సరసన నిలవలేకపోయింది ఒ నటి. కుర్రకారును ఉర్రూతలూగించిన ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్స్ తో టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది బ్యూటీ. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన ఆమె, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఇంతకీ ఆమెఎవరో కాదు సిల్క్ స్మిత.
తెలుగు నటి సిల్క్ స్మిత
తెలుగు, తమిళం, మలయాళం భాషలతో పాటు దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో ట్విస్ట్ లు. వడ్లపాటి విజయలక్ష్మి పేరుతో 1960లో ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబంలో జన్మించింది సిల్క్ స్మిత. నాలుగో తరగతి వరకే చదువకున్న ఆమె స్థోమత లేకపోవడం వలన చదువు మానేసింది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవ్వడంతో 14వ ఏటనే తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా పెళ్లి చేశారు. అయితే భర్త వలన కలిగిన హింసను తట్టుకోలేక, రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకొని చెన్నైకి వెళ్లింది.
సిల్క్ స్మితగా మారిన విజయలక్మి
చెన్నైలో జీవనోపాధి కోసం మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ, సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1979లో విడుదలైన మలయాళ చిత్రం ‘ఇనాయే తేడి’ సిల్మ్ స్మిత ఫస్ట్ మూవీ. 1980లో వచ్చిన తమిళ సినిమా ‘వండిచక్కరం’ ఆమెకు భారీ గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘సిల్క్’ పాత్ర వలననే ఆమెకి 'సిల్క్ స్మిత' అనే పేరు స్థిరపడింది. ఆ సమయంలో హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాకపోయినా, గ్లామర్ రోల్స్, బోల్డ్ సీన్లు, ఐటెమ్ సాంగ్స్‌లో నటిస్తూ యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది సిల్క్ స్మిత.
స్టార్ హీరోయిన్లను మించి రెమ్యునరేషన్
తన సినీ కెరీర్‌లో సుమారు 450కి పైగా సినిమాల్లో నటించింది. 1980ల చివరి నాటికి ఒక్కో సినిమాకు 1 లక్ష వరకు పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకుంది. ఇది అప్పటి స్టార్ హీరోయిన్లకన్నా ఎక్కువే.ఆమె అన్ని దక్షిణ భారతీయ భాషలలో నటించినా, స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు రాలేదు. సిల్క్ స్మిత నటనలో ఎన్నో రకాల పాత్రలను పోషించినా, ఆమె పై ఐటమ్ గర్ల్ గా ముద్ర పడింది. అయినా ఆమె సినీ ప్రయాణం ఆపలేదు. అయితే సినీ కెరీర్ ఎంత విజయవంతంగా సాగిందో, వ్యక్తిగత జీవితం అంతగా సాఫీగా సాగలేదు.
సిల్క్ స్మిత బయోపిక్ మూవీ
లవ్ ఫెయిల్యూర్స్, ఆర్థిక మోసాలు, ఒంటరితనం వంటి సమస్యలతో డిప్రెషన్‌కు లోనయ్యింది సిల్మ్ స్మిత. 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందింది. అప్పటికి ఆమె వయసు 35 సంవత్సరాలు మాత్రమే. ఆమె రాసినట్లు భావించే సూసైడ్ నోట్ దొరికినప్పటికీ, దాని విషయాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియవు. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో 2011లో 'ది డర్టీ పిక్చర్' అనే చిత్రం తీశారు. విద్యా బాలన్ నటించిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా సంచలనం సృస్టించింది. మూవీ సూపర్ హిట్ అయింది కానీ.. సిల్క్ స్మిత కుటుంబ సభ్యులు ఇందులో ఆమెను తక్కువ చేసి చూపించారని అభ్యంతరం తెలిపారు.
మరణం తరువాత కూడా క్రేజ్
సిల్క్ స్మిత మరణానంతరం కూడా ఆమెకు ఉన్న క్రేజ్‌ను కొన్ని చిత్ర నిర్మాతలు ఉపయోగించుకున్నారు. ఆమె నటించిన మలయాళ చిత్రం ‘లయణం’ను హిందీలో ‘రేష్మ్ కీ జవానీ’గా డబ్ చేసి, 2002లో విడుదల చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. సిల్క్ స్మిత ఒక వెలుగు వెచ్చని చిరునవ్వుతో వచ్చినా, ఆ చిరునవ్వు వెనక దాగిన బాధలను, ఒంటరితనాన్ని మాత్రం ప్రపంచం గమనించలేదు. ఆమె జీవితం పేదరికం నుండి సినీ ప్రముఖంగా ఎదిగిన ప్రయాణమే కాకుండా, అర్ధాంతరంగా ముగిసిన ఒక ఆత్మ కథ. ఆమె మరణం వెనుక నిజం ఇప్పటికీ వీడని చిక్కుముడిలా అలాగే ఉండిపోయింది.