MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • `మగధీర` కలెక్షన్ల విషయంలో మోసం.. అల్లు అరవింద్‌పై ఊగిపోయిన రాజమౌళి.. అసలేం జరిగింది?

`మగధీర` కలెక్షన్ల విషయంలో మోసం.. అల్లు అరవింద్‌పై ఊగిపోయిన రాజమౌళి.. అసలేం జరిగింది?

రాజమౌళి ఫస్ట్ హిస్టారికల్ మూవీ `మగధీర`. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నిర్మాత అల్లు అరవింద్‌ చేసిన మోసంపై రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 30 2024, 09:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో `మగధీర` ఒకటి. 2009లో విడుదలైన ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన కాజల్‌ హీరోయిన్‌గా చేసింది. శ్రీహరి ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రాజమౌళి మైథలాజికల్‌ స్టయిల్‌లో చేసిన తొలి చిత్రమిది. నాలుగు వందల సంవత్సరాల తర్వాత మళ్లీ పుట్టడం అనే కాన్సెప్ట్ తో ప్రజెంట్‌ డేస్ ని, ఫాంటసీ మైథలాజికల్‌ అంశాలకు ముడిపెడుతూ తెరకెక్కించిన తీరు అదిరిపోయింది. విజువల్‌ వండర్ గా నిలిచింది. ఈ సినిమాతో రామ్‌ చరణ్‌ స్టార్‌ హీరో అయ్యాడు.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే ఈ సినిమా సమయంలో చోటు చేసుకున్న సంఘటనని పంచుకున్నారు రాజమౌళి. అల్లు అరవింద్‌ చేసిన పని తనకు ఎంత కోపం తెప్పించిందో తెలిపారు. ఆ సమయంలో కలెక్షన్ల కంటే ఎన్ని రోజులు ఆడిందనే లెక్కలు ఉండేవి. ఎంత ఎక్కువ రోజులు ఎక్కువ సెంటర్లలో అంత పెద్ద హిట్‌గా పరిగణించే రోజులు. ఇండస్ట్రీ వర్గాలు, నిర్మాతలు, అభిమానులు కూడా వాటినే ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. హీరోల మధ్య అదే పోటీగా ఉండేవి. 

35

 అయితే రాజమౌళికి అది నచ్చేది కాదు. ఒక స్థాయికి బాగానే ఆడుతుంది. కానీ ఆ తర్వాత మరీ బలవంతంగా ఆడిస్తుంటారనే ఫీలింగ్‌ తనని వెంటాడేదట. `సింహాద్రి`కి కూడా అలానే చేశారట.   అది ఆయనకు నచ్చలేదు. దీన్ని మార్చేయాలని భావించాడు. ఆ సమయంలోనే రామ్‌ చరణ్‌తో అల్లు అరవింద్‌ ప్రొడక్షన్‌లో `మగధీర` సినిమా చేశాడు రాజమౌళి. సినిమా షూటింగ్‌ టైమ్ లో నిర్మాత అల్లు అరవింద్‌తో ఈ చర్చ వచ్చింది. మనం మాత్రం ఇలాంటివి వేయోద్దు అన్నారట రాజమౌళి. దానికి అల్లు అరవింద్‌ కూడా ఓకే చెప్పారు. ఆయన కూడా ఇలాంటివి అవసరం లేదని ఇదొక బ్యాడ్‌ ట్రెండ్‌ ని ఫాలో అవుతున్నామని ఆయన కూడా అన్నారట. `మగధీర`కి అలా చేయోద్దనుకున్నారు.

45

ఆ ప్రకారంగానే `మగధీర` విడుదలై బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. అప్పటి వరకు హైయ్యెస్ట్ సినిమా రికార్డుని బ్రేక్‌ చేసి డబుల్, త్రిబుల్‌ చేసింది. దీంతో అంతా ఖుషీ అయ్యారు. నిర్మాతలు, రాజమౌళి, రామ్‌ చరణ్‌, చిరంజీవి ఇలా అంతా హ్యాపీగా ఉన్నారు. ఆ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది. ఇక నెమ్మదిగా సినిమా పోస్టర్లపై ఇన్ని రోజు, అన్ని రోజులు అని వేస్తున్నాడట నిర్మాత అల్లు అరవింద్‌. కలెక్షన్లు కాకుండా డేస్‌కి సంబంధించిన పోస్టర్లు వేశారట. అంతేకాదు వంద రోజులు సెంటర్లు పెంచి పోస్టర్లలో వేస్తున్నారట. 
 

55

ముందు అనుకున్నాం కదా మళ్లీ ఇలా డేస్‌ వేస్తున్నారేంటి?  అది నచ్చలేక అల్లు అరవింద్‌పై ఊగిపోయాడట రాజమౌళి. దీంతో నిర్మాత స్పందిస్తూ, నాక్కూడా నచ్చడం లేదు రాజమౌళి. కానీ ఫ్యాన్స్ నుంచి చాలా ప్రెజర్‌ ఉంది. తప్పడం లేదన్నాడట. అలా పోటీ పెరిగి రాంగ్‌ గా లెక్కలు చూపిస్తున్నారని వాపోయాడు రాజమౌళి. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్‌ బాబుతో చేయబోతున్న సినిమాపై వర్క్ చేస్తున్నారు. ఇది త్వరలో ప్రారంభం కానుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Recommended image2
Folk Song: ప్యారడైజ్‌ మూవీలో దుమ్ములేపుతున్న తెలంగాణ ఫోక్‌ సాంగ్‌.. రేపు థియేటర్లు ఊగిపోవాల్సిందే
Recommended image3
Irumudi OTT Date: రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved