- Home
- Entertainment
- జైల్లో ఎన్టీఆర్, నాయకుడంటూ ఖైదీల నినాదాలు... లేపేసిన ఆ సీన్ పడుంటే... ఆర్ఆర్ఆర్ నటుడు చెప్పిన షాకింగ్ నిజాలు
జైల్లో ఎన్టీఆర్, నాయకుడంటూ ఖైదీల నినాదాలు... లేపేసిన ఆ సీన్ పడుంటే... ఆర్ఆర్ఆర్ నటుడు చెప్పిన షాకింగ్ నిజాలు
ఆర్ ఆర్ ఆర్ మూవీలో చరణ్ క్యారెక్టర్ కి రాజమౌళి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనే చర్చ సోషల్ మీడియాలో ఇంకా జరుగుతూనే ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మేరకు కామెంట్స్ చేస్తున్నారు. తమ వాదనలు వినిపిస్తున్నారు.

RRR Movie
నిజం చెప్పాలంటే వారు దర్శకుడు రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ లో ఒకరు మూవీలో కొమురం భీమ్ పాత్ర ఎలివేట్ అయ్యే సన్నివేశాలు లేపేశారని ఆరోపణలు చేస్తున్నారు. దానికి ఋజువుగా ఆ మూవీలో నటించిన ఓ యాక్టర్ ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలకు సంబంధించిన వీడియో షేర్ చేశారు.
ఇంతకీ ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)మూవీలో నటించిన ఆ నటుడు ఏం చెప్పాడంటే... నేను ఎన్టీఆర్ తో ఓ సన్నివేశంలో నటించాను. తర్వాత నాకు ఎనిమిది నెలల తర్వాత కాల్ వచ్చింది. అప్పుడు నన్ను అజయ్ దేవ్ గణ్ ఎపిసోడ్స్ లో నటించడానికి పిలిచారు. గతంలో ఎన్టీఆర్ తో నటించిన సన్నివేశానికి ఇది కొనసాగింపా? అని నేను అడిగాను.
RRR Movie
కాదు ఆ సన్నివేశం డైరెక్టర్ రాజమౌళి తీసేశారు. ఇది ఫ్రెష్ గా అజయ్ దేవ్ గణ్ తో మీకు సీన్స్ ఉంటాయని చెప్పారు. ఇక ఎడిటింగ్ లో తీసేసిన ఎన్టీఆర్ సన్నివేశం గురించి చెప్పాలంటే... మేమంతా తోటి ఖైదీలుగా జైల్లో ఉంటాము. అప్పుడు బాగా దెబ్బలు తిని, గాయాలతో ఉన్న ఎన్టీఆర్ ని జైల్లోకి తీసుకొచ్చి పడేసి వెళ్ళిపోతారు.
RRR Movie
అప్పుడు మేమందరం పరుగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వెళతాం. ఆయన అలా కూర్చొని ఉంటారు. మేమేమో ఇలా బ్రిటీష్ వాళ్ళపై పోరాటం చేస్తుంటే, మీరేమో వాళ్ళను కొట్టి ఉచ్చపోయించారు. ఇకపై మీరే మా నాయకుడు అంటూ జైల్లో ఉన్న ఖైదీలు అందరూ అరుస్తారు. ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చే సన్నివేశం అది. ఆ సీన్ పడుంటే మాములుగా ఉండేది కాదు.
RRR Movie
ఆ సన్నివేశం కోసం నేను ఎన్టీఆర్ తో రెండు రోజులు పనిచేశాను. అది గొప్ప సన్నివేశం అంటూ... ఆ నటుడు చెప్పుకొచ్చారు. మరి ఎన్టీఆర్ పాత్రకు హైప్ తెచ్చే ఇలాంటి అద్భుత సన్నివేశం రాజమౌళి తొలగించారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
RRR Movie
మరోవైపు రాజమౌళి (Rajamouli)ని సమర్థిస్తున్నారు. ఇక యాంటీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళిని నిందించడాన్ని తప్పుబడుతున్నారు. రాజమౌళి లేకపోతే ఎన్టీఆర్ కి కెరీర్ లేదు.ఎన్టీఆర్ కి ఇన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రాజమౌళిని తిడతారా అంటూ... మండిపడుతున్నారు. మొత్తంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఒకరకంగా రాజమౌళికి తలనొప్పులు తెచ్చిపెట్టింది.