మహేష్ బాబు, రాజమౌళి మూవీ టైటిల్ ఇదేనా.. నిజమైతే ఇంతకన్నా పెద్ద షాక్ ఇంకొకటి ఉండదు
రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టైటిల్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ 29
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ 29. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఇదే తొలి చిత్రం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో రాజమౌళి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మహేష్ మూవీతో గ్లోబల్ రిలీజ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఈ మూవీ అత్యంత భారీ స్థాయిలో 1000 కోట్లతో తెరకెక్కుతోంది. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది.
నవంబర్ లో అప్డేట్
రాజమౌళి ఈ చిత్రాన్ని గ్లోబ్ ట్రాట్టర్ అని అభివర్ణిస్తున్నారు. ఇటీవలే కెన్యాలో కీలకమైన షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. నవంబర్ లో ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఉంటుందని రాజమౌళి ఇటీవల అనౌన్స్ చేశారు. అయితే ఆ అప్డేట్ ఏంటనేది ఇంకా బయటపెట్టలేదు. అందుతున్న సమాచారం మేరకు టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ లాంటివి ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ టైటిల్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ చిత్రానికి రాజమౌళి అండ్ టీం 'వారణాసి' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మూవీ టైటిల్ ఇదేనా
ఇదే కనుక నిజమైతే రాజమౌళి తీసుకున్న నిర్ణయం షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కావాలంటే టైటిల్ యూనిక్ గా ఉండాలి. గ్లోబల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. కానీ వారణాసి అనేది ఇండియన్ ఆడియన్స్ కి అప్పీలింగ్ గా ఉండొచ్చు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైన టైటిల్. అలాంటప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారు అనే ప్రశ్న తలెత్తుతోంది.
హిందూ పురాణాలకి సంబంధించిన అంశాలు
ఈ మూవీలో హిందూ పురాణాలకి సంబంధించిన అంశాలు, ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయని ముందు నుంచే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీలుక్ లో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. మహేష్ బాబు మెడలో నంది, త్రిశూలం, డమరుకం కనిపించాయి.
ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ
ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఒక జానపద పాటని కూడా కంపోజ్ చేశారట. ఈ సాంగ్ అత్యంత భారీగా, సినిమాలో ఆకట్టుకునే అంశాల్లో ఒకటిగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఏ విధంగా భారతీయ సంస్కృతికి సంబంధించిన అంశాలని గ్లోబల్ స్థాయిలో తెరకెక్కించే ఫారెస్ట్ అడ్వెంచర్ కథలో రాజమౌళి ఎలా ఇన్వాల్వ్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.