MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • చిరంజీవి చేయకుండా ఉండాల్సిన 7 సినిమాలు ఏవో తెలుసా, కెరీర్ కి మచ్చగా మిగిలినవి ఇవే

చిరంజీవి చేయకుండా ఉండాల్సిన 7 సినిమాలు ఏవో తెలుసా, కెరీర్ కి మచ్చగా మిగిలినవి ఇవే

చిరంజీవి కెరీర్ లో మరిచిపోదగ్గ చిత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ చిత్రాలని చిరంజీవి అసలు చేయకుండా ఉండాల్సింది అని ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటారు. ఆ మూవీ ఏంటి, అభిమానులు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 08 2025, 08:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Chiranjeevi Flop Movies
Image Credit : Asianet News

Chiranjeevi Flop Movies

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. నటనతో, డ్యాన్సులతో మెప్పించారు. తనకి తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు అన్నట్లు కొన్ని చిత్రాల్లో చిరంజీవి పెర్ఫార్మెన్స్ అందించారు. అదే విధంగా చిరంజీవి కెరీర్ కి మచ్చ తెచ్చిన చిత్రాలు కూడా ఉన్నాయి. కొన్ని చిత్రాలని చిరంజీవి చేయకుండా ఉండాల్సింది అని ఫ్యాన్స్ భావించే మూవీస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ఎస్పీ పరశురాం 
Image Credit : our own

ఎస్పీ పరశురాం 

జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదలైన నాలుగేళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం ఎస్పీ పరశురాం. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఫ్యాన్స్ ఆశలపై ఈ చిత్రం నీళ్లు చల్లింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కిన ఎస్పీ పరశురాం దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. 

38
అల్లుడా మజాకా 
Image Credit : Asianet News

అల్లుడా మజాకా 

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్. ఈవీవీ సత్యనారాయణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీ హిట్టయినప్పటికీ చిరంజీవి బూతు సినిమాలో నటించారు అనే చెడ్డపేరు వచ్చింది. కోటి సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. కానీ చిరంజీవి.. హీరోయిన్లు రమ్యకృష్ణ, రంభ.. అత్త పాత్రలో నటించిన లక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు డబుల్ మీనింగ్ తో, అసభ్యంగా ఉంటాయి. ఈ మూవీ అనేక వివాదాలకు కారణం అయింది. 

48
బిగ్ బాస్ 
Image Credit : Asianet News

బిగ్ బాస్ 

చిరంజీవికి గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ బాపినీడు. అలాంటి డైరెక్టర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన మరో మూవీ బిగ్ బాస్. ఈ చిత్రం కూడా భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ మూవీలో రోజా, మాధవి హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి కెరీర్ లో మరచిపోదగ్గ చిత్రాల్లో బిగ్ బాస్ ఒకటి. 

58
మృగరాజు 
Image Credit : Asianet News

మృగరాజు 

చిరంజీవికి, గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన చూడాలని ఉంది చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీపై తప్పనిసరిగా భారీ అంచనాలు ఉంటాయి. అలా భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది మృగరాజు మూవీ. అప్పట్లోనే ఈ చిత్రాన్ని 15 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించారు. ఈ మూవీలో ఒక్క సెట్ కోసం 75 లక్షలు.. ఆమ్స్టర్ డామ్ ని రీ క్రియేట్ చేయడం కోసం 30 లక్షలు ఖర్చు చేయడం పెద్ద సంచలనం. కానీ ఈ మూవీ దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో సిమ్రన్, సంఘవి హీరోయిన్లుగా నటించారు. 

68
శంకర్ దాదా జిందాబాద్ 
Image Credit : Asianet News

శంకర్ దాదా జిందాబాద్ 

శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రానికి సీక్వెల్ గా శంకర్ దాదా జిందాబాద్ తెరకెక్కించారు. ప్రభుదేవా దర్శకుడు. ఈ మూవీ ఉండే సందేశాత్మక అంశాలు ప్రేక్షకులకు ఏమాత్రం ఎక్కలేదు. బోరింగ్ సన్నివేశాలతో ఈ మూవీ ఫ్లాప్ అయింది. 

78
ఆచార్య 
Image Credit : Facebook/Chiranjeevi konidela

ఆచార్య 

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ డిస్సప్పాయింట్మెంట్. ఈ మూవీలో చిరంజీవి, రాంచరణ్ కలిసి నటించారు. ఈ మూవీ కథ, కథనం ఏమాత్రం వర్కౌట్ కాలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది. 

88
భోళా శంకర్ 
Image Credit : our own

భోళా శంకర్ 

మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కింది. ఈ మూవీ రిలీజైనప్పుడు జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఈ మూవీలో చిరంజీవి నటించిన ఫన్ రొమాంటిక్ సీన్స్ దారుణంగా ఉంటాయి. ఫలితంగా ఈ చిత్రం చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
విజయ్ దేవరకొండ లగ్జరీ హౌస్ లోపలి ఫోటోలు చూశారా, రౌడీ హీరోకి ప్రాణంగా మారిపోయిన మరో ఫ్యామిలీ మెంబర్
Recommended image2
50 ఏళ్ళ వయసులో తండ్రులైన వారు టాలీవుడ్‌ లో ఇంతమంది ఉన్నారా, షాకింగ్ లిస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved