MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అతడి ముందు హృతిక్ రోషన్ ఎందుకూ పనికిరాడు..దిగజార్చేలా రాజమౌళి, అల్లు అర్జున్ ఎందుకు కామెంట్స్ చేశారంటే

అతడి ముందు హృతిక్ రోషన్ ఎందుకూ పనికిరాడు..దిగజార్చేలా రాజమౌళి, అల్లు అర్జున్ ఎందుకు కామెంట్స్ చేశారంటే

ఇండియన్ స్క్రీన్ పై హృతిక్ రోషన్ ఒక సూపర్ హీరో. బాలీవుడ్ స్టార్ అయినప్పటికీ హృతిక్ రోషన్ క్రేజ్ సౌత్ లో కూడా అద్భుతంగా ఉంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 28 2024, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇండియన్ స్క్రీన్ పై హృతిక్ రోషన్ ఒక సూపర్ హీరో. బాలీవుడ్ స్టార్ అయినప్పటికీ హృతిక్ రోషన్ క్రేజ్ సౌత్ లో కూడా అద్భుతంగా ఉంది. హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సిరీస్, ధూమ్ 2, వార్ ఇలా యాక్షన్ మూవీస్ అన్నీ సౌత్ లో అదరగొట్టాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అలాంటి హృతిక్ రోషన్ కి టాలీవుడ్ లో ఒకసారి అవమానం జరిగింది. ఆ అవమానం జరిగింది ఎవరివల్లో కాదు.. స్వయంగా దర్శకధీరుడు రాజమౌళి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వల్లే. టాలీవుడ్ స్టార్ హీరోని పొగిడే క్రమంలో రాజమౌళి, అల్లు అర్జున్.. హృతిక్ రోషన్ ని దిగజార్చుతూ కామెంట్స్ చేశారు. 

36

ఈ సంఘటన జరిగింది చాలా ఏళ్ళ క్రితం. ప్రభాస్ నటించిన బిల్లా చిత్రం మంచి విజయం సాధించింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో చెప్పుకోదగ్గ చిత్రం అంటే బిల్లానే. ఈ మూవీలో ప్రభాస్, కృష్ణంరాజు కలసి నటించడంతో రెబల్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. 

46

ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకకి రాజమౌళి, అల్లు అర్జున్ అతిథులుగా హాజరయ్యారు. రాజమౌళి మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం ధూమ్ 2 చిత్రం విడుదలయింది. ఆ చిత్రం చూశాక అలాంటి సినిమాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం.. హృతిక్ రోషన్ లాంటి హీరో మనకి లేడా అని అనుకున్నా. చాలా బాధగా ఉండేది. ఇప్పుడు బిల్లా చిత్ర పోస్టర్స్, ట్రైలర్ లో ప్రభాస్ ని చూస్తుంటే.. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ ఎందుకు పనికిరాడు అనిపిస్తోంది అని రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

56

ఆ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడారు. ఒక్క మాట చెప్పాలనిపిస్తోంది.. మా ఫ్యామిలీ నుంచి కాకుండా ఇతర హీరోల్లో నా ఫెవరేట్ హీరో ప్రభాస్ అని అల్లు అర్జున్ తెలిపారు. ప్రభాస్ చూడడానికి చాలా బావుంటాడు. ఆరడుగుల కటౌట్. అద్భుతంగా ఫైట్స్ చేస్తాడు. 

66

రాజమౌళి గారు చెప్పింది నిజమే.. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ దేనికీ పనికిరాడు అంటూ బన్నీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ అద్భుతమైన హీరో మాత్రమే కాదు అంతకి మించి గొప్ప మనిషి అంటూ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Leak: రిలీజ్‌కు ముందే ట్రైలర్ లీక్, రామాయణ టీమ్ కు బిగ్ షాక్..
Recommended image2
National Awards: అత్యధిక నేషనల్ అవార్డులు గెలిచిన 9 మంది స్టార్స్ వీళ్లే.. టాప్‌లో మన సౌత్ యాక్టర్
Recommended image3
Sai Pallavi: సీత పాత్ర చేయాలంటే సాయి పల్లవి ఎంత భయపడిందో తెలుసా? చివరకు ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved