Brahmamudi: ఆస్తి పంపకాలు చేయమంటూ షాకిచ్చిన స్వప్న.. అసలు నిజాన్ని చెప్పేసిన రాజ్!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ఉమ్మడి కుటుంబం విడిపోకూడదని తపన పడుతున్న ఒక కుటుంబ పెద్ద కథ ఈ సీరియల్. ఇక ఈరోజు నవంబర్ 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో కుటుంబ సభ్యులందరూ హాల్లో సమావేశం అవుతారు. మీ తాతయ్య మీతో తన నిర్ణయాన్ని చెప్పాలనుకుంటున్నారు దీనివలన ఎవరు బాధపడినా కూడా ఆయన నిర్ణయాన్ని ఒప్పుకొని తీర వలసిందే అంటుంది చిట్టి. ఆ తర్వాత సీతారామయ్య ఏదో మాట్లాడుతూ ఉండగా కోర్టులో శిక్ష పడిన వాళ్ళకి కూడా ఆఖరి కోరిక ఉంటుంది అలాగే మీరు తీర్పు చెప్పే ముందు నా మాటలు కొంచెం వినండి అంటూ మాట్లాడటం మొదలుపెడతాడు రాహుల్.
పెళ్ళికి ముందు నేను తప్పులు చేశాను నిజమే కాదనను కానీ పెళ్లి అయిన తర్వాత స్వప్నకి ఎలాంటి లోటు రానివ్వలేదు అలాంటిది తను నన్ను మోసం చేసింది, నన్నే కాదు మన కుటుంబం మొత్తాన్ని మోసం చేసింది అలాంటి తనతో నేను కాపురం చేయటానికి సిద్ధంగా లేను తనని బయటికి పంపించేయండి అంటాడు. నీ అభిప్రాయం కూడా అదేనా అని రుద్రాణిని అడుగుతాడు సీతారామయ్య.
అవును నాన్న ఇంతకన్నా మంచి సొల్యూషన్ లేదు అంటుంది రుద్రాణి. అప్పుడు అపర్ణ కూడా ఇద్దరు అక్క చెల్లెలకి కోడలుగా ఉండే అర్హత లేదు, పంపించేయాలంటే స్వప్నతో పాటు కావ్య ని కూడా బయటికి పంపించేయండి రాజ్ కి విడాకులు ఇప్పిద్దాం అంటుంది అపర్ణ. నన్ను బయటకు పంపించేయాలి అంటే నాతో పాటు రుద్రాణి గారిని రాహుల్ ని కూడా బయటికి లాగుతాను అంటుంది స్వప్న. అప్పుడు సుభాష్ కలుగజేసుకొని అసలు ఈ గొడవ ప్రారంభమైంది..
రాహుల్ తో కాబట్టి రాహుల్, రుద్రాణి కూడా ఇంట్లోంచి బయటికి పోవాలి అప్పుడే ఇంటికి పట్టిన దరిద్రం వదిలేస్తుంది అంటాడు. వెళ్ళిపోతాము మా ఆస్తి మాకు పని చేయండి అంటుంది స్వప్న. పంచడానికి నీ పుట్టింటి నుంచి ఏమాత్రం తీసుకు వచ్చావు ఆస్తి, మీ అత్త తన అత్తింటి నుంచి ఏమాత్రం ఆస్తి తీసుకు వచ్చింది. తనకే దిక్కులేదు ఆ మాటకు వస్తే అసలు తను ఈ ఇంటి ఆడబడుచే కాదు అంటుంది అపర్ణ. చూసావా నాన్న వదినా ఎంత మాట అంటుందో నాకు దిక్కు లేదా..
నన్ను పెంచి పెద్ద చేసి నాకు ఇష్టం లేకపోయినా ఒకడితో బలవంతంగా పెళ్లి చేసి పంపించారు. వాడే బాగుంటే నేనెందుకు ఇక్కడ ఉంటాను. అయినా ఆస్తి పంపకాల దగ్గరికి వచ్చేసరికి ఈ ఇంటి ఆడపడుచుని కాకుండా పోతానా, అంతవరకు వస్తే నేను కూడా ఊరుకునేది లేదు అంటూ రెచ్చిపోతుంది రుద్రాణి.
ఇదంతా చూస్తున్న సీతారామయ్య బాధతో కుప్పకూలిపోతాడు. అప్పుడు అందరూ కంగారుపడి అతన్ని సోఫాలో కూర్చోబెడతారు. ఆస్తి పంపకాల దగ్గరికి వచ్చేసరికి నువ్వు కూడా నటించడం మొదలు పెట్టావా నాన్న అంటూ నిష్టూరంగా మాట్లాడుతుంది రుద్రాణి. అప్పుడు కోపంతో రుద్రాణిని నోరు ముయ్యమంటాడు రాజ్.
అసలు తాతయ్య పరిస్థితి తెలుసా, తాతయ్య ఎంత కాలం బతుకుతారో తెలుసా అంటూ సీతారామయ్య క్యాన్సర్ సంగతి చెప్పేస్తాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. చిట్టి నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావ, నువ్వు సంపాదించిన ఆస్తి అంతా ధారపోసి అయినా నిన్ను బ్రతికించుకుంటాను అని ఏడుస్తుంది. ఈ గొడవలు అన్నీ చూసి నీ ప్రాణాలు మీదికి తెచ్చుకుంటావా, పోతే నీ కన్నా ముందు నేనే పోవాలి అంటుంది చిట్టి.
అప్పుడు సీతారామయ్య మాట్లాడుతూ మీ కుటుంబం ఎప్పుడూ ఉమ్మడిగా ఉండాలని కోరుకున్నాను అలాంటిది ఇంటి కోడల్ని పంపించేసి మనవళ్ల కాపురాలు కూల్చేస్తాం అంటున్నారు. మనవరాళ్ళు ఇద్దరినీ క్షమించమని చెప్తాము అనుకున్నాను కానీ ఎవరి నిర్ణయాలు వారు చెప్తున్నారు అంటూ బాధపడతాడు సీతారామయ్య. ఇక్కడ నీ నిర్ణయమే చెల్లుతుంది బావ అంటూ చిట్టి మిగిలిన వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడుతుంది.
మనం ఆ మహావృక్షం నీడలో పెరుగుతున్న వాళ్ళం ఆయన మాటకి ఎదురు లేదు ఈ ఇంట్లో నుంచి ఎవరు ఎవరిని బయటికి పొమ్మనే హక్కు లేదు అంటుంది. అప్పుడు సీతారామయ్య మనవరాళ్లిద్దరినీ పక్కన కూర్చోబెట్టుకుని స్వప్నని ఆవేశం తగ్గించుకోమని చెప్తాడు. అలాగే రాజ్ ని పక్కన కూర్చోబెట్టుకొని ఇన్నాళ్లు కావ్యతో బలవంతంగా కాపురం చేసావని తెలుసు.
కానీ తనని మనస్ఫూర్తిగా భార్యగా స్వీకరించు అని రాజ్ చేతిలో కావ్య చేతిని పెడతాడు. తరువాయి భాగంలో తనతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్న భర్తతో గొడవ జరిగిన ప్రతిసారి మాట్లాడటం మానేస్తే బంధం దూరమైపోతుంది అంటుంది కావ్య. దూరం కావాలని కోరుకుంటున్న బంధం ఏమైపోతే నాకేంటి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్.