- Home
- Entertainment
- Brahmamudi: నడిరోడ్డున పడ్డ స్వప్న బ్రతుకు.. భార్యని పుట్టింటికి తీసుకువెళ్ళనున్న రాజ్!
Brahmamudi: నడిరోడ్డున పడ్డ స్వప్న బ్రతుకు.. భార్యని పుట్టింటికి తీసుకువెళ్ళనున్న రాజ్!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని దోచుకుంటూ మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది. ఆకాశానికి నిచ్చెన వేస్తూ తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్న ఒక స్వప్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నా కొడుకు ఆవేశానికి కారణం ఏంటో చెప్పు అంటుంది అపర్ణ. నేను కూడా అదే అడుగుతున్నాను మీ ఆవేశానికి కారణం ఏంటి అని రాజ్ ని అడుగుతుంది కావ్య. నీకు తెలియదా ఎంత బాగా నటిస్తున్నావు మీ కుటుంబమే అంత అంటూ వెటకారంగా మాట్లాడుతాడు రాజ్. నిందించే ముందు నిరూపించండి అంటుంది కావ్య. స్వప్న ఎక్కడ ఉందో తెలిసి తీసుకురావడానికి నేను వెళ్ళాను. కానీ ఈ మోసగత్తే ముందే వాళ్ళ అక్కకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పించేసింది అంటాడు రాజ్. నాకేం అవసరం అంటుంది కావ్య. తప్పు చేసింది స్వప్న కాదు నువ్వు తనని తప్పించేసి ఆ ప్లేస్లో నువ్వు పెళ్లి పీటల మీద కూర్చున్నావు అంటాడు రాజ్.
ఏ చెల్లి అయినా అక్క పెళ్లి చెడగొడుతుందా పైగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అంటున్నారు నా గొయ్యి నేనే ఎందుకు తవ్వుకుంటాను అంటుంది కావ్య.వాళ్ల అక్క కోసం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళింది అలాంటి అమ్మాయి ఎందుకు వాళ్ళ అక్కని తప్పించేస్తుంది అంటూ వెనకేసుకొస్తుంది చిట్టి. నిజంగానే వాళ్ళ అక్క దొరకాలి అనుకుంటే నేను తీసుకొస్తానని వెళ్లాను కదా అప్పటిదాకా ఆగకుండా ఎందుకు హోటల్ కి వస్తుంది అంటాడు రాజ్. నేను ఏ తప్పు చేయలేదు అని కావ్య అంటే ఏ తప్పు చేయకపోతే నన్ను చూసి ఎందుకు పారిపోవాలి అనుకున్నావు అంటాడు.
నేను దుగ్గిరాల వాళ్ళ కోడల్ని అందుకే అలా చేశాను మీ ఆవేశం సంగతి నాకు తెలుసు. మీరు అంత ఆవేశంతో వెళ్లారు ఈ ఇంటి వారసుడు రోడ్డెక్కి ఒక ఆడపిల్లని అవమానిస్తూ ఉంటే చూసేవాళ్ళు చూస్తూ ఊరుకుంటారా, పోయేది ఎవరి పరువు అంటూ నిలదీస్తుంది కావ్య. ఆవేశం వలన వివేకం విజ్ఞత అన్ని నశిస్తాయి అప్పుడు ఎవరి వంశ గౌరవం నశిస్తుంది, అందుకే ఆ గొడవ ఆపడం కోసం నేను అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చాక అక్క లేదని తెలిసింది అప్పుడు మీ కంటపడితే అంతమంది ముందు ఇలాగే అవమానిస్తారని మీ కంట పడకూడదు అనుకున్నాను కర్మకొద్దీ మీకు దొరికిపోయాను.
అయినా మా అక్క ఇష్ట ఇష్టాలు తెలుసుకోకుండా మీరు దగా పడ్డారు అందుకు మిమ్మల్ని చూస్తే బాధనిపించింది. ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టి మీరు బాధపడుతున్నారు నేను బాధపడుతున్నాను దయచేసి నన్ను మాత్రమే దోషిని చేయకండి. ఇంతమంది ముందు నన్ను నేల మీదకి తోసి నన్ను దారుణంగా అవమానించారు ఈ అవమానాన్ని నేను జన్మలో మర్చిపోలేను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు బొమ్మలికి రంగులు సరిగ్గా లేవు బొమ్మలలో కళలేదు అంటూ విసుక్కుంటాడు బొమ్మలు కొనే వ్యక్తి. అమ్మాయి లేదు అత్తారింటికి వెళ్లిపోయింది నాకు వయసు అయిపోయింది కదా అందుకే కుంచె వణుకుతుంది అంటాడు కృష్ణమూర్తి.
అలా అని మేము నష్టపోలేము కదా అంటూ డబ్బులు తగ్గించి ఇస్తాడు అవతలి వ్యక్తి. కావ్య ఈ ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత బొమ్మల్లోనూ జీవం పోయింది ఇంట్లోనూ జీవం పోయింది అంటుంది కావ్య వాళ్ళ పెద్దమ్మ. అంతలోనే కోపంగా వచ్చిన కనకం, స్వప్న విషయం అంతా చెప్తుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటూ కనకాన్ని తిడతాడు కృష్ణమూర్తి. నేను దానికి మంచి జీవితం ఇవ్వటం కోసం అబద్దాలు చెప్పాను. అంతేకానీ ఎప్పుడూ తప్పుడు దారిలో నడవలేదు అంటుంది కనకం. ఇంకాపు మీ ఇద్దరూ చేసినా వెదవ పనులకి నా కూతురు అత్తారింట్లో గౌరవం లేకుండా బతుకుతుంది ఇదంతా స్వప్న వల్లే అంటూ స్వప్నకి శాపనార్థాలు పెట్టి కోపంగా వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి.
మరోవైపు గుడి ముందు కూర్చున్న స్వప్న రాహుల్ మీద కోపంతో రగిలిపోదు అతనికి ఫోన్ చేస్తుంది.నువ్వు ఇలా పదేపదే ఫోన్ చేస్తే ఇంట్లో ఎవరికైనా దొరికిపోతాను అంటూ కోపంగా మాట్లాడుతాడు రాహుల్. ముందు నా పరిస్థితి ఆలోచించు నీవల్ల రోడ్డు మీద పడ్డాను అంటుంది స్వప్న. గట్టిగా మాట్లాడితే ఇంటికి వచ్చనా వచ్చేస్తుంది అనుకుంటూ నీ పరిస్థితి నాకు తెలుసు కానీ ఇంట్లో పరిస్థితులేమీ బాగోలేదు మీ చెల్లెలు రాజ్ ని రెచ్చగొట్టి నీ దగ్గరికి పంపించింది.
ఈ టైంలో మన గురించి చెప్తే ఇంట్లో అందరూ మన మీద రివర్స్ అవుతారు అంటూ స్వప్న ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా రాజ్ వస్తున్నాడు అంటూ కంగారుగా ఫోన్ పెట్టేసి స్వప్నని ఎలాగైనా వదిలించుకోవాలి అనుకుంటాడు రాహుల్. మరోవైపు రాజ్ వెళ్లే లోపు అక్క తప్పించుకుంది అంటే ఈ ఇంట్లో వాళ్లే ఎవరో అక్కకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి ఎవరై ఉంటారు అంటూ ఆలోచనలో పడుతుంది కావ్య.
తరువాయి భాగంలో వాళ్ల అమ్మతో ఫోన్లో మాట్లాడటం మొదలుపెడితే పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో నాకు తెలుసు అంటుంది అపర్ణ. అందుకే ఫోన్లో కాకుండా నేనే నేరుగా ఆమెని వాళ్ళ పుట్టింటికి తీసుకువెళ్తాను అంటాడు రాజ్.