MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Puneeth Rajkumar: రాజ్‌కుమార్‌ హీరోలను వెంటాడుతున్న `గుండెపోటు`.. పునీత్‌ హార్ట్ ఎటాక్‌కి కారణమదేనా?

Puneeth Rajkumar: రాజ్‌కుమార్‌ హీరోలను వెంటాడుతున్న `గుండెపోటు`.. పునీత్‌ హార్ట్ ఎటాక్‌కి కారణమదేనా?

లెజెండరీ నటుడు రాజ్‌కుమార్‌ ఫ్యామిలీని గుండెపోట్లు వెంటాడుతున్నాయా? అప్పుడు రాజ్‌కుమార్‌, మొన్న శివరాజ్‌కుమార్, ఇప్పుడు పునీత్‌ రాజ్‌కుమార్. గుండె పోటు ఇప్పుడు అభిమానులను భయాందోళనకు గురి చేస్తుంది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 29 2021, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

లెజెండరీ నటుడు రాజ్‌కుమార్‌(Raj kumar) మూడో కుమారుడు, శాండల్‌వుడ్‌ పవర్ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar) గుండెపోటుకి గురై శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్‌ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ ఫ్యామిలీని హార్ట్ ఎటాక్‌ అనే సమస్య వెంటాడుతుందా;? అనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది. రియల్‌ లైఫ్‌లో జరిగిన సంఘటనలతో కంపేర్‌ చేస్తూ అభిమానులు, సినీ వర్గాలు సైతం ఈ విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

Rajkumar కన్నడనాట సూపర్‌స్టార్‌గా ఎదిగారు. వెలిగారు. కన్నడ చిత్ర పరిశ్రమలో లెజెండరీ నటుల్లో ఆయన ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమని కొన్ని ఏళ్లపాటు ఏలారాయన. కన్నడ కంఠీరవగా, కన్నడ కల్చర్‌కి ఐకాన్‌గా నిలిచారు. విశేషమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని, ఇమేజ్‌ని సొంతం చేసుకుని నట సార్వభౌమగా పేరుతెచ్చుకున్న రాజ్‌కుమార్‌ 77 ఏళ్ల వయసులో గుండెపోటుకి గురయ్యారు. 2006 ఏప్రిల్‌ 12న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. 

35

ఆ తర్వాత 2015లో ఆయన పెద్ద కుమారుడు శివరాజ్‌ కుమార్‌(Shiva Rajkumar) గుండెపోటుకి గురయ్యారు. ఆయన హార్ట్ స్టోక్ కి గురై కోలుకున్నారు. ఎలాంటి ప్రాణపాయం లేకుండా సురక్షింగా బయటపడ్డారు. అయితే చాలా ఆరోగ్యంగా ఉండే Shiva Rajkumar గుండెపోటుకి గురవడం అందరిని ఆశ్చర్యానికి, షాకి కి గురిచేసింది. ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

45

ఇప్పుడు రాజ్‌కుమార్‌ మూడో కుమారుడు, కన్నడ పవర్ స్టార్‌ Puneeth Rajkumar హార్ట్ ఎటాక్‌కి గురయ్యారు. మార్నింగ్‌ జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న సమయంలో ఆయన హార్ట్ స్ట్రోక్ కి గురయ్యారు. ఆయనకు తీవ్రంగా స్ట్రోక్‌ రావడంతో తన ఇంటికి సమీపంలోని విక్రమ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అభిమానులను తీవ్రమైన విషాదంలో ముంచెత్తారు. అప్పుడు రాజ్‌కుమార్‌ గుండెపోటుతో చనిపోవడం, శివరాజ్‌కుమార్‌కి కూడా గుండెపోటు రావడం, ఇప్పుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ సైతం హార్ట్ స్ట్రోక్‌తోనే కన్నుమూయడం బాధాకరం. 

55
puneeth rajkumar workout

puneeth rajkumar workout

ఇదిలా ఉంటే పునీత్‌ రాజ్‌కుమార్‌కి హార్ట్ ఎటాక్‌ రావడానికి కారణాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అతి వర్కౌటే ఆయన ప్రాణాలు తీసిందంటున్నారు. ప్రస్తుతం పునీత్‌ `జేమ్స్` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన బాడీ బిల్డర్‌గా కనిపించబోతున్నారట. బాడీ బిల్డర్‌గా కనిపించేందుకు, ఫిట్‌గా, కండలు తిరిగిన దేహంతో కనిపించేందుకు ఆయన అతిగా వర్కౌట్‌ చేయడం వల్లే హార్ట్ ఎటాక్‌ వచ్చిందని భావిస్తున్నారు వైద్యులు. సరైన డైట్‌ తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. పునీత్‌కి గుండెపోటు రావడానికి పరిమితి మించిన వర్కౌటే కారణమంటున్నారు. 

related news: Puneeth Rajkumar Dead: పునీత్‌ చివరి పోస్ట్ వైరల్‌, శివన్న ఎమోషనల్‌.. జీవిత సత్యాలు..

related news: puneeth rajkumar death; రియల్‌ పవర్‌స్టార్‌గా పునీత్‌ ఎదగడానికి కారణాలివే.. తెలిస్తే ఫ్యాన్‌ అయిపోతారు..

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Recommended image2
Balakrishna: విజయశాంతిపై కోపంతో తన సినిమాని తానే ఫ్లాప్‌ చేసుకున్న బాలయ్య.. ఎన్బీకేలో ఈ యాంగిల్‌ కూడా ఉందా ?
Recommended image3
Anirudh Kavya Maran Wedding: స్టేజ్‌పై 'కల్యాణ వయసు' పాట పాడిన అనిరుధ్.. 'కావ్యా' అంటూ అరిచిన అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved