- Home
- Entertainment
- Brahmamudi: పుట్టింటి మొహం చూడనంటున్న కావ్య.. భార్య చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న రాజ్!
Brahmamudi: పుట్టింటి మొహం చూడనంటున్న కావ్య.. భార్య చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న రాజ్!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. పుట్టింటి కోసం తపన పడుతున్న ఒక కూతురి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు చేసిన పనికి నాకు చాలా సంతోషంగా ఉంది. నీకేం కావాలో చెప్పు అన్ని ఇచ్చేస్తాను మంచి మూడ్ లో ఉన్నాను అంటాడు రాహుల్. ఇదే మంచి అవకాశం అనుకొని మత్తులో ఉన్న రాహుల్ తో కమిట్ అవుతుంది స్వప్న.తెల్లారి లేచి చూసేసరికి విషయం అర్థం చేసుకుని చిరాకు పడిపోయి వెళ్ళిపోతాడు రాహుల్. మొత్తానికి అనుకున్నది సాధించాను అని ఆనందపడిపోతుంది స్వప్న.
మరోవైపు భర్త దగ్గరికి వచ్చి పుట్టింటికి వెళ్తాను మా వాళ్ళకి అవసరం తీరింది కానీ ఇంకా కష్టం తీరలేదు అంటుంది కావ్య. నిన్ను వెళ్ళొద్దని చెప్పను కానీ నిన్నే గొడవ జరిగింది కదా ఇదంతా అవసరమా అంటాడు రాజ్. నాకు వెళ్లాలని లేదు కానీ తప్పదు అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య. ఇదంతా అనుకోకుండా రాహుల్ వింటాడు. ఇదేదో నాకు పనికొచ్చేది లాగా ఉంది అనుకుంటాడు. మరోవైపు పెద్ద కాంటాక్ట్ పోయినందుకు బాధపడుతూ ఉంటారు కృష్ణమూర్తి వాళ్ళు.
ఇంతలోనే కాంట్రాక్టర్ వచ్చి ఈ కాంటాక్ట్ మీకే వస్తుంది అని చెప్పేసరికి షాక్ అవుతారు. ఎందుకు షాక్ అవుతున్నారు కావ్య ఏమి చెప్పలేదా అంటాడు అతను. కావ్య మీతో మాట్లాడిందా ఏమంది అని అయోమయంగా అడుగుతాడు కృష్ణమూర్తి. తను ఇక్కడికి వచ్చి పని చేస్తానంది. మీకు అడ్వాన్స్ ఇమ్మంది అని చెప్తాడు కాంట్రాక్టర్. అలా చేయటానికి తను ఒప్పుకున్నా నేను ఒప్పుకోను అంటాడు కృష్ణమూర్తి. అప్పుడే వచ్చిన కావ్య ఎందుకు ఒప్పుకోరు అంటూ గట్టిగా ప్రశ్నిస్తుంది.
కాంట్రాక్టర్ తో నేను ఈ కాంట్రాక్ట్ పూర్తి చేస్తాను మీరు మా నాన్నగారికి అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పడంతో అతను అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తరువాత అక్క పెళ్లి కోసమే కదా ఇంత అప్పు చేసింది. అయితే ఆ పెళ్లి నాకు జరిగింది. అందుకని అప్పు తీర్చవలసిన బాధ్యత నాదే కదా అంటుంది కావ్య. అది మా బాధ్యత అయినా నువ్వు ఇప్పుడు గొప్పింటి కోడలివి నువ్వు ఇలా చేస్తే నీ కాపురంలో కలతలు వస్తాయి అని కోప్పడతాడు కృష్ణమూర్తి. సరే అయితే నేను ఆ ఇంటి కోడలినే కదా ఇక ఈ ఇంటికి ఏమీ కాను కదా.. ఇకమీదట ఈ ఇంటి మొహం చూడను అంటూ వెళ్ళిపోబోతుంది కావ్య.
ఇంట్లో వాళ్ళందరూ కృష్ణమూర్తిని మందలించటంతో కృష్ణమూర్తి కావ్యని ఆపి సగం చచ్చి ఒప్పుకుంటున్నాను. ఒకవేళ అత్తింట్లో ఏమైనా సమస్య వస్తే అప్పుడు ఈ పని మానేయాలి అంటాడు కృష్ణమూర్తి. సమస్య ఏమి రాదు.. నేను నా భర్తకి చెప్పే వచ్చాను అని కావ్య చెప్పడంతో ఇంట్లో అందరూ ఆనందపడతారు. మరోవైపు రాజ్ ఇంట్లో అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. కావ్య లేకపోవడంతో మహారాణి ఇంకా లెగలేదా అని అడుగుతుంది రుద్రాణి. నా కోడల్ని అలా అంటావా అని గొడవకి దిగుతుంది ధాన్యలక్ష్మి.
మీ ఇద్దరూ కాసేపు ఆగండి ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు అని మందలిస్తుంది చిట్టి. అప్పుడే వచ్చిన రాజ్ భార్య పుట్టింటికి వెళ్ళింది అని చెప్పటం ఎలా అని సతమతమవుతూ ఉంటాడు. అంతలోనే ప్రకాష్ ఏదో మాట్లాడుతుంటే ఇందాక కావ్య నీ దగ్గరికి వచ్చింది కదా బాబాయ్.. పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పింది కదా అని బాబాయ్ మతిమరుపు ని వాడుకుంటాడు రాజ్. నిన్నే అంత పెద్ద గొడవ జరిగింది కదా ఇప్పుడు మళ్ళీ వెళ్లడం అవసరమా.. అయినా చెప్పి వెళ్ళొచ్చు కదా అంటుంది అపర్ణ.
తన భర్తకి చెప్పి వెళ్ళింది కదా అయినా ఎందుకు చిన్న విషయాన్ని పెద్ద చేస్తావు అంటూ భార్యని మందలిస్తాడు సుభాష్. సీన్ కట్ చేస్తే కృష్ణమూర్తి ఇంట్లో అందరూ ఆనందంగా బొమ్మలు ప్రిపేర్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. తరువాయి భాగంలో కావ్య మట్టి తొక్కడాన్ని మీడియాలో చూసి రాజ్ ఇంట్లో అందరూ షాక్ అవుతారు. దుగ్గిరాల ఫ్యామిలీకి అసలు మనసే లేదా డబ్బుల కోసం దినసరి కూలీగా మారిన ఆ ఇంటి కోడలు అంటూ మీడియాలో న్యూస్ వస్తుంటే కోపంతో రగిలిపోతాడు రాజ్.