- Home
- Entertainment
- రాహుల్ సిప్లిగంజ్ కాబోయే భార్య హరిణ్యా రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? పొలిటికల్ ఫ్యామిలీకి అల్లుడిగా ఆస్కార్ సింగర్
రాహుల్ సిప్లిగంజ్ కాబోయే భార్య హరిణ్యా రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? పొలిటికల్ ఫ్యామిలీకి అల్లుడిగా ఆస్కార్ సింగర్
టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తానుప్రేమించిన అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. ఇంతకీ రాహుల్ పెళ్లి చేసుకోబోయే హరిణ్యారెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం
టాలీవుడ్‌కి స్టార్ సింగర్, బిగ్ బాస్ విజేత, ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ పాట గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. చాలా కాలంగా ప్రేమిస్తూ వస్తోన్న తన ప్రేయసి హరిణ్యా రెడ్డితో రీసెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ నిశ్చితార్థ వేడుక ఆగస్టు 17, ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారు. వేడుక సింపుల్‌గా, కుటుంబ సమాజం మధ్య జరిగినా, రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
KNOW
హరిణ్యా రెడ్డి ఎవరు?
రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇక స్టార్ సింగర్ పెళ్లి చేసుకోబోయే హరిణ్యా రెడ్డి ఎవరు? అని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమె గురించి తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో, రాహుల్ అభిమానుల్లో పెరిగింది. ఇంతకీ ఎవరు హరిణ్యా రెడ్డి. ఆమె పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన సెలబ్రిటీ. ఇప్పటికే హిరణ్యాకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 15,000 మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. రాహుల్ సిప్లిగంజ్ కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. రాహుల్ తో పెళ్లి తరువాత ఆమె ఫాలోవర్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం కొంతకాలంగా కొనసాగుతోందని వారి సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
హరిణ్యా రెడ్డి రాజకీయ నేపథ్యం
హరిణ్యా రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినట్టు సమాచారం. ఆమె తెలుగు దేశం పార్టీకి దగ్గరగా ఉన్న కుటుంబానికి చెందినది. టీడీపీ సీనియర్ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (NUDA) ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్యా రెడ్డి. ఈ కుటుంబం మొత్తం నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.ఈ విషయాన్ని స్వయంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు. “ఆస్కార్ అవార్డు గెలుచుకున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో మా అన్న కూతురు హరిణ్యా రెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో పెద్దల ఆశీర్వాదాలతో ఘనంగా జరిగింది” అంటూ ఆయన నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేశారు.
రాహుల్ కెరీర్, సక్సెస్
రాహుల్ సిప్లిగంజ్ తన సంగీత ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించాడు. అతని గాత్రంలో పాడిన “నాటు నాటు” పాట ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు పాటగా చరిత్రలో నిలిచింది. అంతే కాదు ఆస్కార్ స్టేజ్ పై కూడా రాహుల్ తన గాత్రంతో హాలీవుడ్ ను మెప్పించాడు. ఇక తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొని విన్నర్ గా బయటకు వచ్చాడు రాహుల్. సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన ఈ గాయకుడు, టాలీవుడ్ టాప్ సింగర్స్ లో ఒకరిగా కొనసాగుతున్నాడు. చాలా కింది స్థాయి నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఎదుగుతూ వచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. అంతే కాదు రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం నుంచి సత్కారం కూడా అదుకున్నాడు రాహుల్. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాహుల్ ప్రస్తావన తీసుకువచ్చి, ప్రత్యేక ప్యాకేజ్ ను కూడా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి స్టార్ సింగర్ కు కోటి రూపాయలు కానుకను అందించారు. ఇలా ఎన్నో విజయాలు చూసిన ఈ సింగర్ ఒక ఇంటివాడు అవుతుండటంతో సినీ,రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి.