Brahmamudi: అప్పు కి ఐ లవ్ యు చెప్పి షాకిచ్చిన కళ్యాణ్.. హైడ్రామా కి తెర తీసిన రాహుల్!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది. కట్టుకున్న పెళ్ళాన్ని వదిలించుకోవడానికి కుట్రలు పన్నుతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో కాక్రోచ్ అంటే మీకు అంత భయమా అని భర్తని ఆటపట్టిస్తుంది కావ్య. అంతలేదు కావాలంటే నా బలాన్ని రుజువు చేసుకుంటాను అంటాడు రాజ్. అయితే పది నిమిషాల పాటు నన్ను ఎత్తుకొని కిందకి దించకుంటే మీరు బలవంతులే అంటుంది కావ్య. సరే అని ఆమెని ఎత్తుకుంటాడు రాజ్. నేను ఊరికే అన్నాను దించండి అంటుంది కావ్య. పందెం అంటే పందెమే, 10 నిమిషాలు అయిందా చెప్పు దించుతాను అంటాడు రాజ్.
అయింది దించండి అంటుంది కావ్య. చూసావా నా బలం ఇప్పటికైనా ఒప్పుకో అని చెప్పి వెళ్లి పడుకుంటాడు రాజ్. అప్పుడు భర్తని చూస్తూ మీరు నా మీద ప్రేమను పెంచుకుంటున్నారు కానీ చెప్పటానికి ఈగో అడ్డు వస్తుంది. మూడు నెలల్లో ఎలాగైనా మీ ప్రేమని బయటకి తీస్తాను అనుకుంటుంది కావ్య. మరోవైపు అప్పు కళ్యాణ్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అతను అనామికతో మాట్లాడుతూ ఉండటం వల్ల అప్పు ఫోన్ని ఎవాయిడ్ చేస్తాడు.
మళ్లీ బ్రో అనుకుంటూ వస్తాడు కదా అప్పుడు చెప్తాను వాడి పని అని కోపంగా అనుకుంటుంది అప్పు. తర్వాత సీన్ లో రాజ్ స్కిప్పింగ్ చేస్తూ ఉంటాడు. సీతారామయ్య దంపతులకు కాఫీ ఇచ్చిన కావ్య భర్త దగ్గరికి వెళ్లి నన్ను ఎత్తుకున్నప్పుడు నిన్న ఆయాసం వచ్చింది అందుకే ఎక్సర్సైజులు చేస్తున్నారా అని అడుగుతుంది. అలా ఏం లేదు నేను ఫిట్ గా ఉన్నాను అందుకే ఒకేసారి వందసార్లు స్కిప్పింగ్ చేశాను, నువ్వైతే అసలు చేయలేవు అంటాడు రాజ్.
నాతో పోటీ పడకండి, నేను స్కిప్పింగ్ బాగా ఆడతాను. కావాలంటే పోటీ పెట్టుకుందాం అంటుంది కావ్య. నీతో నాకు పోటీ ఏంటి అంటాడు రాజ్. కానీ రాజ్ ని రెచ్చగొట్టి పోటీలో పాల్గొనే లాగా చేస్తారు సీతారామయ్య దంపతులు. రాజ్ ని సీతారామయ్య, కావ్య ని చిట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఆటలో కావ్య గెలుస్తుంది. ఏంటి రాజ్ భార్య చేతిలో ఓడిపోయావు అంటాడు సీతారామయ్య. ఆయన ఓడిపోలేదు తాతయ్య, నేను గెలిచాను అంతే అని భర్తని వెనకేసుకొస్తుంది కావ్య.
వాళ్ళిద్దరూ స్కిప్పింగ్ చేయటానికి చూసి భరించలేక పోతారు అపర్ణ, రుద్రాణి. ఏంటి గెలిచానని సంతోష పడిపోతున్నావా నిన్ను ఎప్పటికైనా ఓడించి తిడతాను అంటాడు రాజ్. వెయిట్ చేస్తూ ఉంటాను అంటుంది కావ్య. మరోవైపు ఇంటి అప్పు కోసం కృష్ణమూర్తి ఇంటికి వస్తాడు సేట్. అతడు తనకు చేసిన మోసాన్ని గుర్తుచేసుకొని నీకు వడ్డీ ఇవ్వను, ఏమీ ఇవ్వను అంటూ అతని మీద పడి పీక విసుగుతుంది కనకం. ఆమెని వారించి వెనక్కి లాగుతారు అన్నపూర్ణమ్మ, కృష్ణమూర్తి.
రెండు రోజుల్లో నీ డబ్బు నీ మొహం కొడతాను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనే కేకలు వేస్తుంది కనకం. నువ్వన్నట్టే రెండు రోజుల్లో వస్తాను అప్పుడు డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఇల్లు స్వాధీనం చేసుకుంటాను అని చెప్పి బెదిరించి వెళ్ళిపోతాడు సేటు. అప్పుడు భయపడిన కనకం నిజంగానే మన డబ్బులు మనకు వస్తాయి కదా అని భర్తని అడుగుతుంది. ముందు గొడవ చేయటం ఎందుకు తర్వాత భయపడటం ఎందుకు. అయినా డబ్బులు వస్తాయిలే అని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి.
ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని లోపలికి వెళ్ళిపోతుంది కనకం. ఆమె ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది అన్నపూర్ణమ్మ. మరోవైపు కళ్యాణ్ దగ్గరికి వచ్చిన అప్పు అతను చెప్పేది వినిపించుకోకుండా కర్రతో కొడుతుంది. సడన్గా ఐ లవ్ యు అంటాడు కళ్యాణ్. ఒక్కసారిగా షాక్ అవుతుంది పప్పు. చూసావా ఎలా షాక్ అయ్యావో నిన్న నాకు అనామిక పెళ్లి కార్డు చేతిలో పెడితే అలాగే షాక్ అయ్యాను అందుకే రాలేకపోయాను అంటాడు కళ్యాణ్. అదంతా నాకు అనవసరం. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు.
అలాంటప్పుడు నీతో ఎందుకు మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు. నిజం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు ఏంటి అనుకుంటాడు కళ్యాణ్. మరోవైపు స్వప్న కి రింగ్ ఇస్తాడు రాహుల్. ఏంటి ఇంత చేంజ్ అంటుంది స్వప్న. ఇన్నాళ్లు మారలేదు అని బాధ పడ్డావు ఇప్పుడు మారితే ఎందుకు మారాను అంటున్నావు అంటాడు రాహుల్. అలా అని కాదు కానీ నాకు సర్ప్రైజింగ్ గా ఉంది అని ఆ రింగ్ తీసుకోబోతుంది స్వప్న. ఇంతలో కిడ్నాపర్ ఆమె తలకి గన్ గురి పెడతాడు.
తరువాయి భాగంలో రాహుల్ తల బద్దలు కొట్టినట్టుగా యాక్ట్చేసి స్వప్నని తీసుకువెళ్లిపోతాడు కిడ్నాపర్. విషయం తెలుసుకున్న సీతారామయ్య కుటుంబం రాహుల్ ఉన్న హాస్పిటల్ కి వెళ్తారు. నన్ను కొట్టి స్వప్నని నాకెళ్ళిపోయారు స్వప్నని రక్షించుకోలేకపోయాను అంటూ దొంగ కన్నీరు కారుస్తాడు రాహుల్.