MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raghu Kunche: చక్రి మంచితనమే తనని చంపేసింది.. చివరి రోజుల్లో తన పడ్డ నరకయాతన ఎలా ఉండేదంటే.!

Raghu Kunche: చక్రి మంచితనమే తనని చంపేసింది.. చివరి రోజుల్లో తన పడ్డ నరకయాతన ఎలా ఉండేదంటే.!

Raghu Kunche: దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణం వెనుక ఉన్న అసలు కారణాలను రఘు కుంచె వెల్లడించారు. అలాగే తన కొత్త సినిమా 'గేదల రాజు' విశేషాలు, స్ట్రెస్ లేని జీవితం గురించి ఆయన పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 01 2026, 07:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రఘు కుంచె మనోగతం
Image Credit : Pinterest

రఘు కుంచె మనోగతం

తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న రఘు కుంచె.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఆప్తమిత్రుడు చక్రి గురించి పలు సంచలన విషయాలను వెల్లడించారు. అలాగే త్వరలో విడుదల కానున్న తన చిత్రం 'గేదల రాజు' గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అన్నదాతగా చక్రి
Image Credit : Pinterest

అన్నదాతగా చక్రి

చక్రి ఎంత గొప్ప మనసున్న వ్యక్తి అంటే, ఆయన ఆఫీస్‌కు ఎవరు వచ్చినా ఖాళీ కడుపుతో వెళ్లేవారు కాదు. ప్రతిరోజూ దాదాపు 30 నుంచి 50 మందికి పైగా అక్కడ భోజనాలు చేసేవారని.. అందుకే ఆ ఆఫీస్‌కు తామంతా 'చక్రి సత్రం' అని పేరు పెట్టుకున్నామని రఘు కుంచె గుర్తు చేసుకున్నారు.

35
చక్రి మరణంపై వస్తున్న రూమర్లకు క్లారిటీ
Image Credit : Pinterest

చక్రి మరణంపై వస్తున్న రూమర్లకు క్లారిటీ

చక్రి విపరీతంగా తాగి చనిపోయారనే వార్తల్లో నిజం లేదని రఘు కుంచె స్పష్టం చేశారు. ఆయన మరణానికి ప్రధాన కారణం ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లని తెలిపారు. విపరీతమైన పని ఒత్తిడి, సరిగ్గా నిద్ర లేకపోవడం, అకాల భోజనాల వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నదని వివరించారు. చివరి దశలో ఆయన తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డారని, రెండు అడుగులు వేయడానికే ఆయాసం వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు.

45
స్ట్రెస్ లేని జీవితం గడపండి
Image Credit : Pinterest

స్ట్రెస్ లేని జీవితం గడపండి

చక్రి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత తరానికి రఘు కుంచె ఒక ముఖ్యమైన సూచన చేశారు. ప్రతి చిన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఒత్తిడి పెంచుకోవద్దని, ఆ ఒత్తిడే షుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ లాంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.

55
'గేదల రాజు'గా కొత్త అవతారం
Image Credit : Pinterest

'గేదల రాజు'గా కొత్త అవతారం

ఏప్రిల్ 17న విడుదల కానున్న 'గేదల రాజు' సినిమాలో రఘు కుంచె ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన నటనతో పాటు సంగీత దర్శకుడిగా మూడు పాటలు కూడా అందించారు. అందులో 'ఏం చేయమంటావో' అనే మెలోడీ సాంగ్ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉందని సంతోషం వ్యక్తం చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది కేవలం సౌండ్ కాదని, అది సినిమాలో ఒక పాత్ర లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.

దర్శకుడు చైతన్య మోటూరి ఈ సినిమా కోసం తన ఆస్తులను సైతం పణంగా పెట్టి కష్టపడ్డారని, ఆ కష్టం వెండితెరపై కనిపిస్తుందని రఘు కుంచె తెలిపారు. సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా ఈ సినిమా తనకు గొప్ప పేరు తెస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని తిట్టినవాళ్ళెవరూ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు.. వివి వినాయక్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Chiranjeevi: పాండీబజార్‌లో అందరి ముందు అవమానం.. చిరంజీవి లైఫ్‌ని మార్చిన సంఘటన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved