SVP Movie: సర్కారు వారి పాటపై రాఘవేంద్ర రావు రివ్యూ.. మహేష్ నటనపై కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ రావడం లేదు.
Raghavendra Rao
దర్శకుడు పరశురామ్ మంచి కమర్షియల్ అంశాలతో బ్యాంకు రుణాలు, ఈఎంఐ లపై , మధ్యతరగతి ప్రజల డబ్బుపై సందేశం ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సర్కారు వారి పాట చిత్రాన్ని సెలెబ్రెటీల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సర్కారు వారి పాట చిత్రంపై తనదైన శైలిలో స్పందించారు. ఆ చిత్రానికి తన రివ్యూ ఇచ్చారు. 'మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో ఎనెర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అలాగే అతడి కామెడీ టైమింగ్ ఫాంటాస్టిక్ గా ఉంది అంటూ ట్వీట్ చేశారు.
Image: Still from 'Sarkaru Vaari Paata' trailer
మహేష్ బాబు ఇండస్ట్రీకి మెయిన్ స్ట్రీమ్ హీరోగా పరిచయం అయింది రాఘవేంద్ర రావు దర్శకత్వంలోనే. రాజకుమారుడు చిత్రం రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కి విజయం సాధించింది. ఆ తర్వాత మహేష్ బాబు వెనుదిరిగి చూసుకోలేదు. ఒక్కడు చిత్రంతో స్టార్ గా అవతరించిన మహేష్.. పోకిరితో ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఎదిగారు.
Image: Still from 'Sarkaru Vaari Paata' trailer
సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు నటించిన చిత్రం ఇదే.. పోకిరి తర్వాత అలాంటి కామెడీ టైమింగ్ తో మహేష్ నటించడం ఇదే తొలిసారి. అయితే కొంత మిక్స్డ్ టాక్ కూడా ఉన్న నేపథ్యంలో సర్కారు వారి పాట చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో వేచి చూడాలి.
ఈ చిత్రంలో సముద్రఖని విలన్ రోల్ లో నటించారు. ఇక సర్కారు వారి పాట తర్వాత మహేష్ నటించబోయే చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఆల్రెడీ ఈ చిత్రం ప్రారంభం అయింది. త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నారు.