- Home
- Entertainment
- సుమ అందుకే ఇద్దర్ని కన్నది, లేదంటే వరుసగా... కొడుకు ముందే పరువు తీసేసిన రాఘవేంద్రరావు!
సుమ అందుకే ఇద్దర్ని కన్నది, లేదంటే వరుసగా... కొడుకు ముందే పరువు తీసేసిన రాఘవేంద్రరావు!
బబుల్ గమ్ మూవీతో యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న దర్శకుడు రాఘవేంద్రరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Bubble Gum Trailer launch event
బబుల్ గమ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ముఖ్య అతిథులుగా రానా, రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, సుమ కనకాల, రాజీవ్ కనకాల హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ... ''ట్రిపుల్ ఆర్ భారీ విజయం సాధించింది. ఇవాళ ఇక్కడ రానా, రాజీవ్, రవికాంత్, రావిపూడి, రాఘవేంద్రరావు ఇలా అనేక ఆర్ లు ఉన్నాయి.
Bubble Gum Trailer launch event
కాబట్టి బబుల్ గమ్ ఇంకెంత పెద్ద విజయం సాధిస్తుందో. సుమ మొహం అప్పుడే వెలిగిపోతుంది. సుమ మాస్టర్ ప్లాన్స్ వేస్తుంది. మా సెట్ లోనే సుమ, రాజీవ్ పెళ్లి జరిగింది. ఆ సెట్లో 'అబ్బో జనం అబ్బబ్బో జనం ఇలా అయితే ఎలా భోజనం' అనే పాటలో నటించింది.
Bubble Gum Trailer launch event
జనాభా ఎక్కువైతే ఎంత ప్రమాదమో తెలియజేసే ఆ పాటలో నటించిన కారణంగానే సుమ ఇద్దరు పిల్లలను కన్నది. లేదంటూ వరుసగా...'' అంటూ పర్సనల్ మేటర్ టచ్ చేశాడు. సుమ కొడుకు ముందే ఆయన అలా మాట్లాడటంతో వేదిక మీద వాళ్ళందరూ నవ్వులు గట్టిగా నవ్వేశారు.
Bubble Gum Trailer launch event
రాఘవేంద్రరావు ఇంకా మాట్లాడుతూ... ''ఈ రోజుల్లో ముద్దు సీన్ లేకపోతే సినిమా ఆడదు. ఈ సినిమాలో చాలా ముద్దు సీన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా బాగా ఆడుతుంది. హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. ట్రైలర్ నచ్చింది. బబుల్ గమ్ ఎలా అయితే మెల్లగా పెరుగుతూ టఫ్ అని పేలుతుందో... ఈ చిత్రం కూడా మెల్లగా పుంజుకుని సూపర్ హిట్ కొడుతుంది'', అన్నారు.
Bubble Gum Trailer launch event
బబుల్ గమ్ చిత్రంతో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్నాడు. రోషన్ కి జంటగా మానస చౌదరి నటిస్తుంది. రవికాంత్ ఈ చిత్ర దర్శకుడు. ట్రైలర్ రియలిస్టిక్ గా ఉంది.
అల్ట్రా మోడ్రెన్ అమ్మాయికి మిడిల్ క్లాస్ అబ్బాయికి మధ్య జరిగే లవ్ డ్రామానే బబుల్ గమ్. ఈ చిత్రం డిసెంబర్ 29న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.