సౌత్ సినిమాలపై నోరు పారేసుకున్న హీరోయిన్, రాధికా ఆప్టే సంచలన కామెంట్స్ ..
సౌత్ ఇండియాన్ సినిమాలపై నోరు పారేసుకుంది స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే. ఇక్కడి నిమాల్లో నటించేటప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాలను 'రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు
సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా తయారయ్యింది స్టార్ హీరోయిన్ రాధికా అప్టే . తన కామెంట్స్ తో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఆమె సౌత్ సినిమాలపై చేసిన కామెంట్స్ హిట్ పుట్టిస్తున్నాయి. దక్షిణాది సినిమాల్లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించింది రాధిక.
'మీ ఇంట్లో వాళ్లకు కూడా ఇలాగే చెబుతారా?'
సినిమాలో ఆకర్షణీయంగా కనిపించడం కోసం తన ఛాతీ, పిరుదుల భాగంలో ప్యాడ్లు పెట్టమని అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్పేవారని, అది చాలా అసౌకర్యంగా ఉండేదని రాధికా ఆప్టే వెల్లడించారు.ప్యాడింగ్ పెట్టమని అడిగినప్పుడు చాలా కోపం వచ్చేదని, 'మీ ఇంట్లో అమ్మ, చెల్లెళ్లకు కూడా ఇలాగే ఎక్కువ ప్యాడ్లు పెట్టమని చెబుతారా?' అని అడగాలనిపించేదని రాధికా ఆప్టే అన్నారు.
నాలుగు కిలోల బరువు పెరిగినందుకు..
ఒక ట్రిప్ తర్వాత కేవలం నాలుగు కిలోల బరువు పెరిగినందుకు, 'లావుగా ఉన్నారు' అని చెప్పి తనను ఒక సినిమా నుండి తొలగించారని రాధికా ఆప్టే తన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తనను దృష్టిలో పెట్టుకుని రాసిన కథలోనే, బరువు పెరిగాననే కారణంతో తనను తిరస్కరించారని, ఆ తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రాధికా ఆప్టే అనుభవాలు
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే, 'కబాలి' వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన కొన్ని ఇబ్బందికరమైన సంఘటనల గురించి బహిరంగంగా మాట్లాడారు. ఒక్కప్పుడు ఆర్ధిక పరిస్థితి బాగోలేక సౌత్ సినిమాల్లో నటించానని. కానీ ఇక్కడి తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయన్నారు. సౌత్ సినిమాల గురించి రాధికా మాట్లాడటం ఇది మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు.
అసభ్యకరమైన కామెంట్లు చేసేవారు..
20 ఏళ్ళ క్రితం ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని సౌత్ సినిమాల్లో నటించాల్సి వచ్చిందని, అప్పుడు షూటింగ్ సెట్స్‌పై ఉన్న పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండేవని రాధికపేర్కొన్నారు. ఒక చిన్న ఊరిలో జరిగిన షూటింగ్ సమయంలో సెట్ అంతా మగవారే ఉండేవారని, అక్కడ తన శరీరాకృతి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారని రాధిక వెల్లడించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నారు. రకరకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు.

