MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • శోభన్ బాబును బన్ను బాబు అని ముద్దుగా పిలిచే హీరోయిన్ ఎవరో తెలుసా?

శోభన్ బాబును బన్ను బాబు అని ముద్దుగా పిలిచే హీరోయిన్ ఎవరో తెలుసా?

వెండితెర అందగాడు, సోగ్గాడు శోభన్ బాబును అందరూ అభిమానించేవారు. హీరోయిన్లకు ఆయన అంటే చాలా ఇష్టం ఉండేది. ఈక్రమంలో శోభన్ బాబును ఓ హీరోయిన్ అయితే బన్నుబాబు అని ముద్దుగా పిలిచేదని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా హీరోయన్? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 29 2025, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Facbook / Sobhan Babu fans

క్రమశిక్షణ కలిగిన నటుడు

నటభూషన్, అందాల నటుడు, సోగ్గాడు శోభన్ బాబు. ఇండస్ట్రీ అంతా ఒక ఎత్తు అయితే, శోభాన్ బాబు మాత్రం ఒక వైపు. ఆయన పద్దతులు, జీవన విధానం, హెల్దీ లైఫ్ స్టైల్, ఆర్ధిక క్రమశిక్షణ, టైమ్ సెన్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే, శోభన్ బాబు జీవితం అంతా చాలా పద్దతిగా, క్రమశిక్షణతో గడిపారు. అంతే కాదు ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బును బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ లో భారీగా ఆస్తులు కూడా సంపాదించాడు. తన ఫ్యామిలీలో ఎవరినీ సినిమాల వైపు రాకుండా చూసుకున్నారు శోభన్ బాబు. ఏ విషయంలో అయినా ఒక్క సారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడు శోభన్ బాబు. ఎవరు చెప్పినా ఆ నిర్ణయంతో మార్పు ఉండదు. నటించకూడదు అని ఒక్క సారి నిర్ణయం తీసుకున్న శోభన్ బాబు, ఆతరువాత ఎవరు వచ్చి అడిగినా అదే మాటకు కట్టుబడి ఉన్నారు. కోట్లు ఇస్తామన్న ఆయన సినిమాలు చేయలేదు.

DID YOU
KNOW
?
10 సినిమాల్లో జంటగా
అందాల నటుడు శోభన్ బాబు, రాధిక జంటగా 10 సినిమాలకు పైగా నటించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : our own

60 ఏళ్లకే నటనకు విరామం

అంతే కాదు ఎన్ని మీడియా సంస్థలు వెళ్లినా ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు అందాల నటుడు. తన ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. తనను అందాల నటుడిగా, సోగ్గాడిగా ఆదరించిన తన అభిమానులు తండ్రి, తాత పాత్రల్లో తనను చూడలేరని శోభన్ బాబు నమ్మేవారు. అందుకే 60 ఏళ్లు దాటిన తరువాత నటించకూడదు అని ఫిక్స్ అయ్యి ఉన్నారు. దాంతో ఎంత మంది స్టార్స్ వచ్చి బ్రతిమిలాడినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అతడు సినిమా కోసం శోభన్ బాబును తీసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు నిర్మాత మురళీ మోహన్. కాని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తాను నటించనని చెప్పేశారు. ఇలా శోభన్ బాబు గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి.

Related Articles

Related image1
రమ్యకృష్ణ చిరంజీవికి చెల్లెలుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Related image2
66 ఏళ్ల వయసులోనూ యంగ్ లుక్ లో నాగార్జున, టాలీవుడ్ కింగ్ డైట్ సీక్రేట్ ఏంటో తెలుసా?
35
Image Credit : Times Of India

సోగ్గాడు, అందాల నటుడు

శోభన్ బాబు అంటే ఆ కాలంలో కూడా చాలా క్రేజ్ ఉండేది. ముఖ్యంగా ఆయనతో సినిమా అంటే హీరోయిన్లు ఎగిరి గంతేసేవారు. శోభన్ బాబును ఎంతో ప్రేమించేవారు. ఆయన కూడా హీరోయిన్లతో ఎంతో సరదాగా ఉండేవారు. వారిని నిక్ నేమ్ లతో పిలిచేవారు. శోభన్ బాబుకు కూడా హీరోయన్లు పెట్టిన ముద్దు పేర్లు చాలా ఉన్నాయి. అభిమానులు ఆయన్ను సోగ్గాడు, అందాల నటుడు, నటభూషనుడు అని ముద్దుగా పిలుచుకునేవారు. ఇక ఓ హీరోయిన్ అయితే శోభన్ బాబుకు ఏకంగా బన్నుబాబు అని ముద్దు పేరు పెట్టింది. ఆయన్ను ఎప్పుడూ అలానే పిలిచేదట ఆ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో కాదు రాధిక.

45
Image Credit : Asianet News

శోభను బాబుకు రాధిక పెట్టిన మరో పేరు

శోభన్ బాబు, రాధిక కాంబినేషన్ లో 10కి పైగా సినిమాలు వచ్చాయి. ఈ ఇద్దరి జంటకు అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండేవారు. రాధిక ఏ హీరోతో అయినా చాలా కంఫర్ట్ గా ఉంటారు. సరదాగా చలోక్తులు విసురుతూ ఉంటారు. ఈక్రమంలోనే శోభన్ బాబుతో ఆమెకు ఉన్న చనువుతో ఆయనకు బన్ బాబు అని పేరు పెట్టారట రాధిక. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మరో హీరోయన్ జయసుధ వెల్లడించారు. శోభన్ బాబుతో చాలా క్లోజ్ గా ఉండేవారం, ఆయన చాలా చనువుగా ఉంటారు, మా రాధిక అయితే బన్ బాబు అని పేరు కూడా పెట్టింది అని జయసుధ వెల్లడించారు.

55
Image Credit : Sobhan babu

జయసుధ వెల్లడించిన నిజం

అంతే కాదు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వారావు తో హీరోయిన్లు ఒక లైన్ వరకే ఉండేవారట. ఆ ఇద్దరు హీరోలంటే కాస్త భయం ఉండేది, అందుకే లైన్ క్రాస్ చేసి చనువు తీసుకునేవారు కాదు. కాని శోభన్ బాబుతో మాత్రం చాలా క్లోజ్ గా ఉండేవారమని జయసుధ అన్నారు. శోభన్ బాబు కూడా హీరోయిన్లకు ముద్దు పేర్లు పెట్టేవారు. జయప్రదను అత్తా అని పిలిచేవారు నటభూషనుడు ఇలా శోభన్ బాబు అంటే ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ క్రియేట్ అయ్యింది. విలువలతో కూడిన ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మురళీ మోహన్ లాంటి నటులు ఎదిగారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
నందమూరి తారక రామారావు

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image2
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image3
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Related Stories
Recommended image1
రమ్యకృష్ణ చిరంజీవికి చెల్లెలుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Recommended image2
66 ఏళ్ల వయసులోనూ యంగ్ లుక్ లో నాగార్జున, టాలీవుడ్ కింగ్ డైట్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved