రమ్యకృష్ణ చిరంజీవికి చెల్లెలుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి, రమ్యకృష్ణ జంటగా సూపర్ హిట్ సినిమాలు ఆడియన్స్ నుఅలరించాయి. ఈ ఇద్దరు జోడీకి మంచి పేరు ఉంది. అయితె చిరు, రమ్మకృష్ణ అన్నా చెల్లెలుగా నటించిన సినిమా కూడా ఉందని మీకు తెలుసా? ఇంతకీ ఏంటా సినిమా?

70 ఏళ్ల వయసులో దూసుకుపోతున్న చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 70 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్ ను , ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి.
మెగాస్టార్ రెండు సినిమాలు
“విశ్వంభర” సినిమాను దర్శకుడు వశిష్ట రూపొందిస్తుండగా, ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్ గారులో చిరంజీవి సరసన నయనతార నటిస్తోంది. ఈ రెండు సినిమాలలో విశ్వంభర షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. గ్రాఫిక్స్ వర్క్ వల్ల రిలీజ్ లేట్ అవుతోంది. ఇక అనిల్ రావిపూడితో చిరంజీవి చేస్తోన్న సినిమా షూటింగ్ మాత్రం సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.
చిరు జోడీగా స్టార్ హీరోయిన్లు
చిరంజీవి తన దశాబ్దాల సినీప్రయాణంలో అనేక మంది టాప్ హీరోయిన్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రాధ, రాధిక, సౌందర్య, మీనా, భానుప్రియా, రమ్యకృష్ణ వంటి స్టార్ నాయికలతో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. అంతే కాదు ఎంతో మంది హీరోయిన్ లకు చిరంజీవి లైఫ్ ఇచ్చారు. మెగాస్టార్ సరసన నటించి స్టార్డమ్ పొందిన తారలు ఎందరో ఉన్నారు. రెండు జనరేషన్ హీరోయిన్లతో మెగాస్టార్ ఆడిపాడారు.
చిరు రమ్యకృష్ణ జంటగా 3 సినిమాలు
ఇక చిరంజీవితో ఎక్కువసార్లు జోడీగా నటించిన హీరోయిన్లలో రమ్యకృష్ణ కూడా ఒకరు. ఆమె చిరు సరసన హీరోయిన్‌గా “ముగ్గురు మొనగాళ్లు”, “అల్లుడా మజాకా”, “ఇద్దరు మిత్రులు” వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. వీరి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ “ముగ్గురు మొనగాళ్లు” కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అనంతరం వచ్చిన “అల్లుడా మజాకా” కూడా ఘన విజయం సాధించింది. “ఇద్దరు మిత్రులు” చిత్రం అంతగా ఆకట్టుకోకపోయినా, వీరి కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి మాత్రం కొనసాగింది.
అన్నా చెల్లెలుగా చిరంజీవి-రమ్యకృష్ణ
అయితే హీరో హీరోయిన్ గా సూపర్ హిట్ సినిమాలు చేసిన చిరంజీవి-రమ్యకృష్ణ, ఒక సినిమాలో అన్నాచెల్లెలుగా కూడా నటించారని మీకు తెలుసా? రమ్యకృష్ణ చిరంజీవి చెల్లెలుగా నటించిన ఆ సినిమా ఏదో తెలుసా? ఆ సినిమా పేరు “చక్రవర్తి”. ఈ చిత్రంలో చిరంజీవి-రమ్యకృష్ణ అన్నా చెల్లెలుగా నటించారు. రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాక, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. చక్రవర్తి సినిమా రిలీజ్ అయిన ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాతే “ముగ్గురు మొనగాళ్లు”లో వీరు హీరో-హీరోయిన్‌గా కలిసి నటించారు. అన్నా చెల్లెలుగా డిజాస్టర్ సినిమా చేసిన వీరు, హీరో హీరోయిన్లుగా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు.