66 ఏళ్ల వయసులోనూ యంగ్ లుక్ లో నాగార్జున, టాలీవుడ్ కింగ్ డైట్ సీక్రేట్ ఏంటో తెలుసా?
తాజాగా 66 లోకి అడుగు పెట్టాడు టాలీవుడ్ కింగ్, తెలుగు సినిమా మన్మధుడు నాగార్జున. ఈ ఏజ్ లో కూడా హ్యాండ్సమ్ లుక్ తో మెరిసిపోతున్నాడు. ఇది ఎలా సాధ్యం. నాగార్జున డైలీ ఏం తింటారు? ఎలా గ్లామర్ ను మెయింటేన్ చేస్తారు?

టాలీవుడ్ మన్మధుడు
టాలీవుడ్‌లో కింగ్, తెలుగు సినిమా మన్మధుడిగా పేరు తెచ్చుకున్నాడు అక్కినేని నాగార్జున. తాజాగా తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ వయస్సులోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. అమ్మాయిల మనసు దోచేస్తున్నాడు నాగార్జున. యవ్వనంగా కనిపిస్తూ, యువ హీరోలతో పోటీపడుతున్న నాగార్జున, తన ఫిట్‌నెస్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలోనే కూలీ సినిమాతో స్టైలీష్ విలన్ గా అవతారం ఎత్తిన కింగ్, సైమన్ పాత్రలో అదరగొట్టారు. విలన్ అయినా సరే నాగార్జున లుక్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. తమిళనాట నాగ్ కు ప్రత్యేకంగా అభిమానులు తయారయ్యారు.
KNOW
నాగార్జున డిఫరెంట్ లైఫ్ స్టైల్
60 ఏళ్లు దాటితే ఆనోప్పులు.. ఈ నోప్పులు అంటూ, ముసలితనం ఆలోచనలోనే వచ్చేస్తుంది. కాని 66 లోను 33 లా కనిపిస్తున్న నాగార్జున అసలే ఏం తింటారు? ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. తన ఆరోగ్య రహస్యం ఏంటి?. ఈ విషయాల గురించి పలు సందర్భాల్లో నాగార్జున కొన్ని సీక్రేట్స్ ను వెల్లడించారు. డైట్, వ్యాయామం, మైండ్‌సెట్ విషయంలో క్రమశిక్షణ పాటించడం వల్లే ఈ స్థాయికి వచ్చానని ఆయన అన్నారు. ఇక నాగార్జున ఫిట్‌నెస్ రొటీన్, డైట్ వివరాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది.
నాగార్జున డైట్ రొటీన్
డైలీ లైఫ్ స్టైల్ లో నాగార్జున ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటారు. రోజూ భోజనం చేస్తారుగానీ వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తీసుకుంటారు. భోజనంలో తప్పనిసరిగా మూడు రకాల ఆకు కూరలు ఉండేలా చూసుకుంటారు. అదేవిధంగా చికెన్ లేదా చేపలు కూడా ఆహారంలో భాగమవుతాయి. ప్రోటీన్, కార్బొహైడ్రేట్లు, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఉన్న బ్యాలెన్స్‌డ్ డైట్‌ను పాటిస్తారు.
నాగార్జున తక్కువ మొత్తంలో తిన్నా, లిమిటెడ్‌గా స్వీట్స్ తీసుకోవడం, డిన్నర్‌ను చాలా త్వరగా పూర్తి చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అలాగే, పెరుగు కూడా రోజూ ఆహారంలో తీసుకుంటారు. వయస్సు పెరిగే కొద్దీ కొన్ని ఆహార పదార్థాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని, ఆ విషయంలో నిపుణుల సలహా మేరకు ముందడుగు వేస్తానని ఆయన ఎప్పుడూ అంటుంటారు.
వ్యాయామం ప్రాముఖ్యత
ఆహారాన్ని సరిగా తీసుకోవాలంటే వ్యాయామం తప్పనిసరని నాగార్జున చెబుతారు. ప్రతి రోజు ఉదయాన్నే వ్యాయామం చేయడం తన శరీరానికి మెటబాలిజాన్ని మెరుగుపరచుతుందని అభిప్రాయపడతారు. గత 35 ఏళ్లుగా వ్యాయామం తన లైఫ్ స్టైల్ లో భాగం అయ్యిందని ఆయన అన్నారు. అంతే కాదు సాధ్యమైన రోజుల్లో రన్నింగ్ లేదా స్విమ్మింగ్ అయినా తప్పనిసరిగా చేస్తానని నాగార్జున ఓ సందర్భంలో తెలిపారు.
మానసిక ఆరోగ్యం కూడా కీలకం
నాగార్జున అసలైన ఆరోగ్య రహస్యం గురించి మాట్లాడుతూ "ఎటువంటి విషయం గురించి ఎక్కువగా ఆలోచించను. జరిగే దాన్ని జరగనివ్వాలి. అలా ఆలోచించకపోవడం వల్ల స్ట్రెస్ తక్కువగా ఉంటుంది" ఈ విషయాన్ని తన తండ్రి నాగేశ్వరావు దగ్గర నుంచి నేర్చుకున్నానని నాగార్జున అన్నారు. ఈ విషయాన్ని కూలీ ఆడియో ఫంక్షన్ లో స్వయంగా సూపర్ స్టార్ రజినీకాంత్ వెల్లడించారు. ప్రశాంతమైన మైండ్‌సెట్‌తో జీవితం ఆనందంగా ఉంటుందని నాగార్జున అభిప్రాయపడ్డారు. ఫ్యామిలీ జీన్స్ కూడా తనకి హెల్ప్ అయ్యాయని ‘కూలీ’ ప్రమోషన్లలో తెలిపారు.
నాగార్జున 66 ఏళ్ల వయస్సులోనూ ఇలా ఆరోగ్యంగా ఉండేందుకు కారణం క్రమశిక్షణ, సరైన డైట్, వ్యాయామం తో పాటు ఆరోగ్యకరమైన ఆలోచన విధానం. ఆయన లైఫ్‌స్టైల్ స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది ఆయన అభిమానులు తమ జీవితాల్లో మార్పులు చేసుకున్నారు.