- Home
- Entertainment
- Radhe Shyam Review:రాధే శ్యామ్ ప్రీమియర్ షో టాక్... ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్
Radhe Shyam Review:రాధే శ్యామ్ ప్రీమియర్ షో టాక్... ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్
2022లో విడుదలైన మొదటి భారీ బడ్జెట్ చిత్రం రాధే శ్యామ్(Radhe Shyam). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ కావడంతో దేశవ్యాప్తంగా హైప్ నెలకొని ఉంది. ప్రభాస్ మూవీ విడుదలైన రెండున్నరేళ్లు అవుతుంది. ఫ్యాన్స్ రాధే శ్యామ్ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రాధే శ్యామ్ చిత్రానికి ఉన్న హైప్ రీత్యా ప్రీ రిలీజ్ బిజినెస్ అదే స్థాయిలో జరిగింది. బిజినెస్ కి తగ్గట్లుగానే భారీ ఓపెనింగ్స్ దక్కాయి. స్కై హై అంచనాలు నెలకొని ఉన్న రాధే శ్యామ్ మూవీ మార్చి 11న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఓవర్ సీస్ లో ప్రీమియర్స్ ప్రదర్శన ఇప్పటికే ముగిసింది. రాధే శ్యామ్ బెనిఫిట్ షోల ప్రదర్శన తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా మొదలైంది.
మరి రాధే శ్యామ్ ప్రీమియర్స్ (Radhe Shyam review)చూసిన ఆడియన్స్ స్పందన ఏమిటో చూద్దాం. రాధే శ్యామ్ మూవీ కథ విషయానికి వస్తే విక్రమాదిత్య (ప్రభాస్) ప్రపంచంలోనే గొప్ప పేరున్న హస్తసాముద్రికుడు. చేతి రాతల ఆధారంగా పుట్టుక నుండి చావు వరకు మనిషి జీవితాన్ని చదవగల దిట్ట. అలాంటి విక్రమాదిత్య అందమైన అమ్మాయి ప్రేరణ(పూజా హెగ్డే) ప్రేమలో పడతాడు. అన్నీ తెలిసిన విక్రమాదిత్య ప్రేమ కథ గురించి ఆయనకు తెలిసిన భయంకర నిజం ఏమిటీ? విధిని ఎదిరించి ప్రేమ నిలబడిందా? ఓడిపోయిందా? అనేది మిగతా కథ.
రాధే శ్యామ్ మూవీ ప్రకటన నాటి నుండి ఇది ఓ ప్యూర్ క్లాసిక్ లవ్ డ్రామాగా చెప్పుకొస్తున్నారు. చెప్పిన విధంగానే రాధే శ్యామ్ అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ప్రభాస్ సినిమాల్లో ఉండే మాస్ ఫైట్స్, హీరో ఎలివేషన్ సీన్స్, కామెడీ అంశాలు రాధే శ్యామ్ చిత్రంలో లేవన్న మాట వినిపిస్తోంది. చెప్పాలనుకున్న కథ నుండి పక్కకు పోకుండా రాధే శ్యామ్ మూవీ విక్రమాదిత్య, ప్రేరణ లవ్, ఎమోషన్స్ ఆధారంగానే నడుస్తుంది.
a
పీరియాడిక్ లవ్ స్టోరీ కావడంతో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సెటప్ బాగా కుదిరింది. సినిమాలో విజువల్స్ ఆకట్టుకుంటాయి. ప్రభాస్(Prabhas)-పూజా హెగ్డేల కెమిస్ట్రీ మూవీలో చెప్పుకోవాల్సిన మరొక అంశం. ఫస్ట్ హాఫ్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. సెకండ్ హాఫ్ లో ఏమి జరుగుతుందా? అనే క్యూరియాసిటీ డెవలప్ చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.
జస్టిన్ ప్రభాకర్ సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. థమన్ బీజీఎమ్ అనుకున్న స్థాయిలో లేదన్న మాట వినిపిస్తుంది. రాధే శ్యామ్ మూవీ చూసిన మెజారిటీ ఆడియన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. సినిమా చాలా బాగుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూజా గ్లామర్, ప్రభాస్ ప్రెజెన్స్ అదుర్స్ అంటున్నారు.
అయితే రాధే శ్యామ్ మూవీకి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ కూడా వస్తుంది. ముఖ్యంగా సినిమా చాలా స్లోగా ఉందన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కీలకమైన సన్నివేశాల్లో సీజీ వర్క్ అనుకున్నంత స్థాయిలో లేదంటున్నారు.
ప్రభాస్-పూజా హెగ్డే(Pooja Hegde)ల ప్రేమ కథ ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. వీరు విడిపోయియే సన్నివేశాలు, నేపథ్యం చాలా అసహజంగా ఉన్నాయంటున్నారు. ఇక మూవీకి ఇచ్చిన ముగింపు అనుకున్నంత స్థాయిలో లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో జగపతిబాబుని సరిగా ఉపయోగించుకోలేదు.
మొత్తంగా రాధే శ్యామ్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. అయితే విపరీతమైన అంచనాలతో సినిమాకు వెళితే నిరాశ ఎదురుకావచ్చు. అలాగే రాధే శ్యామ్ నిరాశ పరిచే మూవీ అయితే కాదు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగల సూపర్ క్లాసిక్ చిత్రం అంటున్నారు. మరి ఇంకెందుకు ఈ వీకెండ్ రాధేశ్యామ్ మూవీతో ముగించండి.