- Home
- Entertainment
- 'రాధే శ్యామ్' బ్యూటీ రిద్దీ కుమార్ యమా హాటు గురూ.. ఎన్టీఆర్, బన్నీ, రౌడీ హీరోపై కన్నేసింది
'రాధే శ్యామ్' బ్యూటీ రిద్దీ కుమార్ యమా హాటు గురూ.. ఎన్టీఆర్, బన్నీ, రౌడీ హీరోపై కన్నేసింది
రాధే శ్యామ్ చిత్రం కోసం రిద్దీ కుమార్ప్రత్యేకంగా ఆర్చరీ నేర్చుకుందట. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ సెకండ్ ట్రైలర్ లో ప్రభాస్ స్పోర్ట్స్ వద్దు అని చెప్పేది ఈమెకే.
- FB
- TW
- Linkdin
Follow Us

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ తిరిగి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇటీవల విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచేసింది. ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రిద్దీ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది.
రాధే శ్యామ్ చిత్రం కోసం రిద్దీ కుమార్ప్రత్యేకంగా ఆర్చరీ నేర్చుకుందట. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ సెకండ్ ట్రైలర్ లో ప్రభాస్ స్పోర్ట్స్ వద్దు అని చెప్పేది ఈమెకే. తాజాగా ఇంటర్వ్యూలో రిద్దీ కుమార్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ చిత్రంలో నేను స్పోర్ట్స్ ఉమెన్ గా నటించా. ఈ పాత్రలో నటించడం చాలా కష్టం. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి అని రిద్దీ తెలిపింది.
నేను పుట్టి పెరిగింది పూణేలో. మా నాన్న ఆర్మీ ఆఫీసర్. ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేశాను. మోడలింగ్ చేస్తున్నప్పుడు సినిమాల్లో అవకాశం వచ్చింది. తెలుగులో లవర్స్, అనగనగా ఓ ప్రేమ కథ చిత్రాల్లో నటించా. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా, పైగా పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ చిత్రంలో అవకాశం దక్కింది.
తక్కువ సమయంలో ఇంత పెద్ద ఆఫర్ వస్తుందని అనుకోలేదు. ఈ చిత్రంలో నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్ చేశాను. మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నాను అని రిద్దీ పేర్కొంది.
రిద్ది తన బోల్డ్ అండ్ గ్లామర్ లుక్స్ తో మాయ చేయడం మొదలు పెట్టింది. సోషల్ మీడియాలో రిద్దీ కుమార్ షేర్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పొట్టి డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ కమర్షియల్ చిత్రాలకు సై అంటోంది ఈ యంగ్ బ్యూటీ.
అప్పుడే ఈ యంగ్ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోలపై కన్నేసింది. ఎన్టీఆర్, బన్నీ, విజయ దేవరకొండ లాంటి స్టార్స్ తో నటించాలని ఉన్నట్లు రిద్దీ పేర్కొంది. డిటెక్టివ్, హాస్యంతో కూడుకున్న పాత్రలు చేయాలని ఉందట.
రిద్ది కుమార్ ఇన్స్టా లో షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్ళని పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి. ఈ కుర్ర భామ తన క్లీవేజ్ అందాలతో మైమరిపిస్తోంది.