హీరోయిన్ రాశి తండ్రిగా, ప్రియుడి గా నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా?
హీరోయిన్ గా దశాబ్ధం పాటు వెండితెరను ఏలింది రాశి. ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకున్న అందాల రాశి ఒక హీరోకు మాత్రం కూతురుగా, ప్రియురాలిగా నటించింది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?

వెండితెరపై ఆ 10 ఏళ్లు
టాలీవుడ్‌లో ఓ దశాబ్దానికి పైగా అగ్రహీరోయిన్ గా వెలుగొందిన నటీమణులలో రాశి ఒకరు. 1990ల నుండి 2000ల మధ్యకాలంలో ఆమె సినిమాలకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. చిన్న వయసులోనే బాలనటిగా తెరంగేట్రం చేసి, ఆ తర్వాత హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించింది రాశి. వరుస సక్సెస్ లతో దూసుకుపోయింది బ్యూటీ.
ఫ్యామిలీ ఆడియన్స్ మనసుదోచిన హీరోయిన్
1988లో విడుదలైన "రావుగారి ఇల్లు" చిత్రంతో రాశి కెరీర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రంలో ఆమె బాలనటిగా కనిపించింది. అప్పట్లో ఆమె వయస్సు కేవలం 9 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత పలు సినిమాల్లో బాలనటిగా నటించిన రాశి, జగపతిబాబు హీరోగా నటించిన "శుభాకాంక్షలు" చిత్రంతో హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించింది.
గోకులంలో సీత తో మరింత పాపులారిటీ
1996లో విడుదలైన "గోకులంలో సీత" సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన రాశి, ఆ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా అటు యూత్ ఆడియన్స్ తో పాటు ప్రత్యేకించి ఫ్యామిలీ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
బుల్లితెరపై కూడా హవా
ఆ తరువాత ఆమె పెళ్లి పందిరి, మనసిచ్చి చూడు, ప్రేయసి రావే వంటి హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా నిలిచింది. హీరోయిన్ అవకాశాలు తగ్గిన తర్వాత కూడా రాశి సెకండ్ ఇన్నింగ్స్‌లో పలు సినిమాలు, టెలివిజన్ సీరియళ్లలో నటించి తన నట ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా "జానకి కలగనలేదు" అనే బుల్లితెర సీరియల్‌లో ఆమె పాత్రకు మంచి స్పందన వచ్చింది.
రాజశేఖర్ సరసన రాశి
అయితే రాశి కెరీర్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఆమె ఒకే హీరోతో మొదట కూతురిగా, ఆ తర్వాత హీరోయిన్‌గా నటించిన ఘనత సాధించింది. ఆ హీరో మరెవరో కాదు రాజశేఖర్.1989లో విడుదలైన "మమతల కోవెల" సినిమాలో రాశి రాజశేఖర్‌కు కూతురి పాత్రలో నటించింది. ఆ సమయంలో ఆమె వయస్సు కేవలం 10 ఏళ్లు మాత్రమే. అయితే అదే రాజశేఖర్‌తో పదేళ్ల తరువాత అంటే 1999లో విడుదలైన ఒక చిత్రంలో హీరోయిన్‌గా రొమాన్స్ చేసింది రాశి. అప్పటికి రాశి వయస్సు 20 ఏళ్లు.ఈ విధంగా ఒకే నటుడికి మొదట కూతురిగా, పది సంవత్సరాల గ్యాప్‌లో హీరోయిన్‌గా నటించిన అరుదైన సందర్భం ఆమె కెరీర్‌లో చోటు చేసుకుంది.